మంచి మాట

పర్యావరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మసాధనలో మానవులకు శరీరమే ప్రధాన సాధక యంత్రం. సుప్రసిద్ధ సంస్కృత మహాకవి కాళిదాసు ‘శరీర మాద్యం ఖలు ధర్మసాధనం’ అని ధృవీకరించాడు. సమత్వ బుద్ధితో మానవుడు జ్ఞాన సముపార్జన చేయాలన్నా, నిశ్చల చిత్తంతో, నిర్మల భక్తితో భగవంతునిపై మనస్సు నిలిపి ధ్యానమగ్నుడు కావాలన్నా, సంపూర్ణ ఆరోగ్యంతో వున్న శరీరంతోనే సాధ్యమవుతుంది.
ప్రయోజనం లేని నిష్ఠలతో నియమాలతో శరీరాన్ని శుష్కింపజేసుకుంటే, శుష్క్భీత శరీరం నుండి శుష్క్భీత ఆలోచనలే వస్తాయి అని బుద్ధ్భగవానుడు స్వీయ అనుభవంతో చెప్పాడు. ఆనాటి సమాజానికది చక్కని సందేశం. సబలుడైన మానవుడు తాను తలపెట్టిన ఏ కార్యమైనా సాధించటానికి శరీరం ఒక సాధక యంత్రం! ఆ యంత్రాన్ని శక్తివంతంగా వుంచుకోవాలి! అహర్నిశలు శరీరానికి ఇంధనంగా వుండే ఆహారం ఆరోగ్యదాయకమైనదిగా, పుష్టికరమైనదిగా సమకూర్చుకోవాలి! అవినాశియైన దేహి (ఆత్మ) పరిమిత ఆయుః ప్రమాణంగల దేహాన్ని అంతిమ దశ వరకు కాపాడుకోవాల్సిన బాధ్యత వుంది. కాళిదాస కవీంద్రుడు చెప్పింది అదే! గౌతమ బుద్ధుడు చేసిందీ అదే!
దేహిగా వున్న ఆత్మకు దేహం రథం వంటిది అని కఠోపనిషత్తు పేర్కొన్నది. ఆ రథానికి ‘బుద్ధి’ సారధి. ‘మనస్సు’ ప్రగ్రహం (పగ్గం). ‘కోరికలు’ (ఇంద్రియాలు) గుర్రాలు అని చెప్పింది. సారథి పగ్గాలు సరిగా పట్టి గుర్రాల్ని సరియైన మార్గంలో నడపాలని ఉపనిషత్తు మానవులకు ఉద్బోధ చేసింది. ఇది గొప్ప ఉపమాలంకారయుత హితబోధ! ఉపనిషత్తులన్నీ జ్ఞానదాయకమైనవే! వాటిని రచించిన ఋషులు జ్ఞానమూర్తులు. సమాజ శ్రేయోభిలాషులు. భావితరాల ప్రజల శ్రేయస్సు కోసం పరిశోధనలు, శాస్త్ర రచనలు చేశారు. అడవులలో ఆశ్రమాలు నిర్మించుకొని నిరాడంబర శ్రమశీల జీవితం గడిపారు. ఆశ్రమాలను గురుకులాలుగా చేసి, తమను ఆశ్రయించిన విద్యార్థులకు వారు, వీరు అనే భేదం లేకుండా సాధారణ యువకులను, సార్వభౌముల కుమారులను సమానంగా సంభావిస్తూ, సకల శాస్త్ర పారంగతులుగా తీర్చిదిద్దారు. ఆశ్రమ గురుకులాలు ఆరోగ్య నిలయాలుగా వుండేవి. చారిత్రక మహాపురుషులుగా ప్రసిద్ధులైన రఘురామ, శ్రీకృష్ణ, బలరామాదులు ఆశ్రమ గురుకులాలలోనే విద్యాభ్యాసం చేశారు. వశిష్ట, విశ్వామిత్ర, భరద్వాజ, సాందీపని, గురుకులాలే అందుకు ఉదాహరణలు.
ఆనాటి మహాఋషులు కార్యసాధకులు. ఆటంకాలెన్ని ఎదురైనా అధిగమించి అనుకున్నది సాధించగల అకుంఠిత దీక్షాదక్షులు. అందుకు విశ్వామిత్రుడే నిదర్శనం! శక్తిసంపన్నులైన ఆనాటి ఋషులు కనె్నర్ర జేస్తే చక్రవర్తులు, రాజులు గడగడలాడేవారని రామాయణ, మహాభారత కథలు చెబుతున్నాయి.
ఆ కాలపు గురుకులాలలో, విద్యార్థులు కూడా ఆశ్రమ పరిసరాలలో ఆరోగ్య పరిరక్షణ, ప్రకృతి పరిపోషణ కార్యక్రమాలు నిర్వహించేవారు. గురుకుల పరిసరాలు ఫలవృక్షాలతో, సస్యక్షేత్రాలతో ప్రకృతి శోభ, పచ్చదనం కనువిందుగా వుండేది. గురుకులాలలో గోగణాలను శ్రద్ధగా పెంచి పోషించేవారు. గోక్షీరం, గోఘృతం, గోదధి, గోమూత్రం, గోమయం- అన్నీ (పంచగవ్యం) ఆరోగ్యదాయకమైనవే! ఔషధ గుణాలు ఉన్నవే! ఆశ్రమాల్ని ఆవుపేడతో అలికి ముగ్గులు పెట్టి అందంగా, పరిశుభ్రంగా వుంచేవారు. గోవులు నివసించే చోటికి రోగ క్రిములు చేరవు. అంతేగాక మహాఋషుల సతీమణులైన అరుంధతి, లోపాముద్ర, అనసూయ, మరుద్వతి మొదలైనవారు తమ తమ ఆశ్రమ గురుకులాల పరిశుభ్రత గురించి, ఆరోగ్యకరమైన భోజన పానీయాలను గురించి శ్రద్ధ తీసుకొని శిష్య గణాన్ని కన్నబిడ్డలవలె సంభావించేవారు. అందుకే ఆనాటి చక్రవర్తులు, రాజులు, ఋషిపత్నుల్ని మాతలుగా గౌరవించేవారు. ఆదిదేవుడైన శివుడు కూడా పార్వతీదేవితో తన వివాహం సందర్భంగా సప్త మహాఋషులతో పాటు సతీ అరుంధతిని సగౌరవంగా ఆహ్వానించాడని కాళిదాసకవి కుమార సంభవం కావ్యంలో పేర్కొన్నాడు.
మానవులారా! కాలగమనంలో వేగంగా మారిపోతున్న ఈ కాలపు వాతావరణ కాలుష్య స్థితిగతులలో, కల్లోల భరిత సామాజిక పరిణామ గమనంలో, శారీరక మానసిక ఆరోగ్యాల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అపారమైన సంపద మానవుడిని అనారోగ్య ప్రమాదం నుండి కాపాడజాలదు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్న పెద్దల మాట మరువకండి.

-పారుపల్లి వెంకటేశ్వరరావు