మంచి మాట

సామాన్య ధర్మములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవుని మనుగడకు మన మహాత్ములు కొన్ని సామాన్య ధర్మములు బోధించారు. అవి కచ్చితంగా మనం పాటించవల్సిందే. అవి అహింస, సత్యం, అశౌచం, అస్థేయం, ఇంద్రియ నిగ్రహం.
అహింస పరమో ధర్మః అన్నారు. అలాగని మనం హింస చేయకుండ వుండలేము. అదిఅందరికీ సాధ్యం కాదు. ఉదాహరణకు సరిహద్దుల్లో సైనికులు పరదేశ సైనికులను చంపకుండా ఉండలేరు. ఎందుకంటే అది వారి కర్తవ్యం, బాధ్యత. పర దేశ సైనికులు మన దేశంలోకి చొరబడితే.. వారిని ఆగమని హితబోధ చేస్తేవారు వినరు అందుకనే ఎక్కడ అహింస ఉండాలని వివేచన ఉండడంచేయడం ముఖ్యం.
సత్యం వధ.. ధర్మం చరన్నారు మహాత్ములు. ఎన్ని కష్టాలు ఎదురైనా సత్యమే పలకవలెను. ఎన్నడూ అసత్యం పలుకురాదు. హరిశ్చంద్రుడు ఇచ్చిన మాట కోసం రాజ్యానే్న వదిలేశాడు. సత్యం కోసం భార్యా పిల్లలను కూడా వదిలి ఓ సామాన్య కాటికాపరిలా జీవించాడు. చివరకు సత్య హరిశ్చంద్రుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఆ తర్వాత ఇంద్రియ నిగ్రహం మనిషికి చాలా అవసరం. ఇంద్రియ నిగ్రహం లేకపోతే మనిషి అధోగతి పాలవుతాడు. ఎంతటి క్లిష్ట పరిస్థితి లోనైనా సరే ఇంద్రియ నిగ్రహం కోల్పోకూడదు. మానసికంగా.. చాలా దృఢంగా వుండాలి. లేదంటే చాలా కష్టం.
మనిషి జీవితంలో ముఖ్యంగా నాలుగు ఆశ్రమాలుంటాయి. అవి బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. బ్రహ్మచర్యం పాటించడానికి ప్రత్యేక ధర్మాలు వుంటాయి. గురువు సమక్షంలో పాటించవలసిన ధర్మాలు పాటిస్తూ జీవనం కొనసాగించవచ్చు. తర్వాతది గృహస్థాశ్రమం.. ఇందులో భార్యా పిల్లలతో జీవనం కొనసాగిస్తూ... భగవంతుని యందు భక్తితో జీవించవచ్చు. గృహస్థు శరీరంను కష్టపెట్టకూడదు. బ్రహ్మచారి ఏకాదశి రోజు ఉపవాసం చేయవచ్చు.కాని ఈ ఉపవాసం అందరికీ కాదు ఇక్కడావివేకం ఉండితీరాలి. కొందరు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో భగవంతునికి హృదయపూర్వక అంజలులు అర్పిస్తే చాలు.
బాల్యం, యవ్వనం తర్వాత అన్ని బాధ్యతలు, బంధాలకు దూరంగా అడవులకేగి గడిపేది వానప్రస్థం. చివరకు మిగిలింది సన్యాసం. అందరినీ వదిలి ఏ స్వార్థం లేకుండా భగవంతుని సేవకు అంకితమయ్యేది సన్యాసం. నా అనేది లేకుండా జీవించడమే సన్యాసం. మహాగురువుల సమక్షంలో మంత్రోపదేశంతో స్వీకరించేదే సన్యాసం. అన్నీ భవబంధాలకు దూరంగా వుంటూ కడవరకు భగవంతునిలో ఐక్యమయ్యే వరకు దీక్షతో గడిపేదే సన్యాసం.
ధర్మో రక్షితి రక్షితః అన్నారు మహాత్ములు. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. పుట్టిన ప్రతి మనిషికీ కొన్ని ధర్మాలు వుంటాయి. అవి తప్పక అందరూ పాటించవల్సిందే. ముందు మనం ఈ జన్మను ప్రసాదించిన భగవంతునికి సర్వదా కృతజ్ఞుడిగా వుండాలి. తర్వాత మనకు జన్మనిచ్చిన మాతాపితరులయందు కృతజ్ఞులమై వుండాలి. వారి వారి మాతా పితరులయందు కృతజ్ఞులుగా వుండడం ధర్మం. ఇక్కడ జీవితంలో ప్రతి మనిషి వివిధ రూపాల్లో ధర్మాన్ని ఏనాడూ మరువకూడదు. గురుపత్ని మనకు మాతతో సమానం. ఆ తల్లికి సేవ చేయడం మన అదృష్టంగా భావించాలి. గురు సంతానం మనకు సోదరీ సోదర బంధంతో సమానం. వీరందరియందు సర్వదా భక్తి ప్రేమపూర్వకమైన ధర్మంతో సేవించి తరించాలి.
ఈ భూమీద ప్రతి మనిషి ఏదో ఒక పని చేసి జీవించాలి. పంతులుగారి పని పంతులుగారిదే.. కసాయి వాడి పని కసాయివాడిదే. ఇక్కడ ఎవరి ధర్మం వారే నిర్వర్తించాలి. ‘మానవ సేవయే మాధవ సేవ’ అన్నారు మహాత్ములు. మానవులంతా సమానమే. కుల మత ప్రాంతీయ దేశ భేదాలు మనం ఏర్పర్చుకొన్నవే కాని భగవంతుడి సృష్టి ఎంత మాత్రం కాదు. జననం, మరణం, ఆకలి, జీవన గతులన్నీ అందరికీ ఒకటే. అలాంటపుడు భేదాలెందుకు? మానవులుగా మానవత్వంతో సామాన్య ధర్మాలు పాటిద్దాము. భగవంతుని పాదాల చెంత పరిమళాల సుమాలుగా మారుదాము.

-కురువ శ్రీనివాసులు