మంచి మాట

ధర్మసంస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృతం సాధించడం కోసం క్షీరసాగర మథనం జరిగిన తరువాత మోసపోయిన దానవులు దేవతలతో యుద్ధం చేసి ఓడిపోయారు. రాక్షసులకు నాయకత్వం వహించిన బలిచక్రవర్తి ఆ యుద్ధంలో పరాజయం పాలయ్యాడు. అనంతరం తమ కులగురువైన శుక్రాచార్యులను ఆశ్రయించాడు. అతని సేవలకు మెచ్చి అతన్ని అనుగ్రహింపదలచిన భార్గవుడు శిష్యుడైన బలిచేత విశ్వజిద్యాగం చేయించాడు. తత్ఫలితంగా యజ్ఞం పూర్తికాగానే అగ్నిదేవుడు అతనికి ఒక దివ్యరథం ఇచ్చాడు. దానితోపాటు ఒక దివ్యమైన ధనుస్సునూ రెండు అక్షయ తూణీరాలను కూడా ఇచ్చాడు. తాత అయిన ప్రహ్లాదుడు ఎప్పటికీ వాడిపోకుండా ఉండే పద్మమాల ఇచ్చాడు. శుక్రాచార్యులు చంద్రబింబం లాంటి స్వచ్ఛమైన శంఖం ఒకటి ఇచ్చాడు.
పిమ్మట బలి చక్రవర్తి పెక్కు దాన ధర్మాలతో విప్రులను సంతుష్టిపరచి వారందరి ఆశీస్సులు పొందాడు. శుక్రాచార్యులు ఒక సుముహూర్తం నిర్ణయించగా ఆనాడు అగ్నిదత్తమైన రథంపై అధిరోహించి వేలకొలది దైత్యవీరులతో విశ్వాన్నంతటినీ జయించడానికి బయలుదేరాడు. దండయాత్ర వార్త విని ఇంద్రుడు దేవగురువైన బృహస్పతిని కర్తవ్యం ఉపదేశించమని ప్రార్థించాడు. ఇపుడు విశ్వజిత్ యాగ ఫలితంగా బలి చక్రవర్తి జయశీలుడై ఉన్నాడు. బ్రహ్మవాదులైన భృగువు మున్నగువారు ఇతనికి అజేయ బలసపంద కలిగించారు. నీవే కాదు, నీకంటె అధికులైనను హరి హరులు తప్ప మరెవ్వరూ ఇపుడు బలిని ఎదిరింపజాలరు. బలవద్విరోధము కలిగినపుడు అణిగిమణిగి ప్రవాసులై ఉండటం మంచిది అని చెప్పగా బృహస్పతి ఇచ్చిన సమయోచితమైన ఉపదేశం ప్రకారం దేవతలందరూ అతి రహస్యంగా స్వర్గం నుండి తమకు అనుకూలమైన ప్రదేశాల్లో అజ్ఞాతవాసం చేయడానికి వెళ్లారు. తనను ఎదిరించేవారు లేకపోవడంతో ఒక్క రక్తపు చుక్క కూడా చిందించనక్కరలేకుండా స్వర్గానికి రాజధానియైన అమరావతిని బలిచక్రవర్తి వశపరచుకొన్నాడు. అతని అనుయాయులైన రాక్షసులంతా బలి అండదండలతో పెచ్చుపెరిగి స్వేచ్ఛగా ప్రవర్తించసాగారు.
మంచివారికి సంపదలు వస్తే లోకకల్యాణంకోసం వెచ్చిస్తారు దాన్ని. రాక్షసులకు సంపదలు వస్తే అనాలోచితంగా ఖర్చుచేసి సాధువులను సజ్జనులను గర్వంతో హింసిస్తారు. దాంతో మళ్లీ వారికి వినాశకాలం దాపురిస్తుంది. అట్లానే ఈ బలికి గురువు అనుగ్రహంతో లభించిన సంపదను చూచి వరాలను చూచి గర్వంతో మిడిసి పడి దేవతలను, మనుష్యులను హింసించడం మొదలెట్టారు. వీని బాధలు పడలేని దేవతలు మరలా విష్ణువునే ప్రార్థించారు. వారి ప్రార్థనలు విని ఎక్కడ అధర్మం పెచ్చు మీరినా నేను ఆ అధర్మాన్ని కాలరాచి ధర్మాన్ని పునఃస్థాపిస్తాను. మీరేమీ దిగులు పడకండి అని వారిని ఓదార్చాడు ధర్మపక్షపాతి యైన మహావిష్ణువు. రాక్షసుల కృత్యాలు పెచ్చుమీరాయ. అధర్మానికి పెద్దపీట వేస్తున్న వారిని గమనించాడు మహావిష్ణువు. మహానుభావుడైన బలి అండతో దుర్మార్గులు సజ్జనులను హింసిస్తున్నారని తెలుసుకొన్నాడు. బలిని పాతాళానికి పంపిస్తే రాక్షసుల హింస తగ్గు తుందనుకొన్నాడు. వెంటనే ఆయన వామనుడుగా జన్మించడానికి సంకల్పించు కొన్నాడు.
ధర్మసంస్థాపన చేయడంలో ఆసక్తుడైన మహావిష్ణువు అదితికి కొడుకు పుట్టాడు. పుట్టినవాడు ఇంతింతయై అంతయై పెరిగాడు. బలిని చూచాడు. ఏంకావాలో అడగమంటున్న బలిని నాకు మూడుడగుల స్థలం చాలన్నాడు. మహావిష్ణువే తనను దానం అడుగుతున్నాడనుకొన్న బలి నాకు అదే పరమానందం అనుకొన్నాడు. మహావిష్ణువు దానమిచ్చిన బలి సంతోషంతో పాతాళానికేగాడు. మదోన్మత్తులైన రాక్షసులందరూ బలివెంటే వెళ్లారు. లోకాలన్నీ సంతోషించాయ. ఎప్పటిలాగే ఇంద్రుడు అమరావతికి రాజైయ్యాడు. దేవతలందరూ వారి వారి స్థానాలను చేరారు. మానవులు యజ్ఞాలతో యాగాలతో దైవకార్యాలను చేయడానికి పూనుకొన్నారు. ధర్మసంస్థానం జరిగింది. సర్వులూ సంతోషించారు.

-యస్.ధర్మారావు