మంచి మాట

శ్రీరాముని జననం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధురాతి మధురం రామనామం. రామకథ ఎన్నిసార్లు విన్నా, రామనామం ఎన్నిసార్లు పలికినా ‘రామ’ అనే రెండక్షరాల మళ్లీ మళ్లీ వినాలనిపిస్తూనే ఉంటాయ. సర్వ జగద్రక్షుడైన శ్రీరాముని నామస్మరణం ఎంతో విశిష్టమైనది అని భారతీయ పురాణాలన్నీ పల్కుతూన్నాయి. విష్ణుమూర్తి యొక్క ప్రతినామజపం మనలోని చెడును నశింపజేస్తుంది. అలాంటి వేయి విష్ణునామాలు ఒక్క రామనామ స్మరణకు ‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే శ్రీ సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే’ అనే రామస్తుతికి సమానం అని రామాయణ మహాకావ్యమే చెబుతోంది.
ఆ రాముడే చైత్ర శుద్ధనవమి నాడు కౌసల్యాదశరథుల నోములపంటగాను, అయోధ్యా వాసుల పుణ్యఫలంగాను, మానవకోటి చేసుకొన్న పుణ్యపు రాశిగాను ఉద్భవించాడు. రాముడు అరవింద దళాయతాక్షుడు, మునుల మనసులనే దోచిన సుందరరూపుడు. ఆ రాముడు ఆజానుబాహుడు, నల్లని శరీర ఛాయతో గూడిన వర్చస్సున్నవాడు. చంద్రబింబాలకే చంద్రబింబం ఆయనవదనం. ఇతరులలో తప్పులు ఎంచడు. తాను సదా శాంతచిత్తుడు. ఎల్లవేళలా ప్రియభాషణమే చేస్తాడు. సీతా మనోహరుడైన ఆ పురుషోత్తముడు నిగ్రహానుగ్రహ సమర్థుడు. భక్తజన సంరక్షకుడు. సకలార్థసిద్ధి సహితుడు. రామఅన్న పిలుపే పలికే భక్తవత్సలుడు. మారుతిలాంటి వారి హృదయంలో నెలకొన్న ఇష్టదేవతాస్వరూపుడు. రావణాసురుల్లాంటివారికి గుండెల్లో గునపమై గుచ్చుకునేవాడు. ఆ రాముడే చైత్ర శుద్ధ నవమినాడు జన్మించాడని నాటి నుంచి నేటి వరకూ జన్మదినవేడుకలను ఆబాలగోపాలమూ చేస్తారు. దేవాలయాల న్నింటా రామనామ స్మరణతో పులకించి పోతూ చూతము రండి సీతారాముల వివాహవేడుక అంటూ అంగరంగవైభోగంగా సీతారాముల కల్యాణాన్ని జరుపుతారు. వడపప్పు, పానకం తాము సేవించి నలుగురికీ సీతారాముల ప్రసాదమని పంచిపెట్తారు. ఒక్కదేవాలయాల్లో కాదు నాలుగుదారులు కలసే ప్రతిచోట రాముని వేదికను నిర్మించి సీతమ్మ మాయమ్మ అంటూ సీతారాముల గుణగానం చేస్తూ వారికి కల్యాణోత్సవాలను జఠుపుతారు. అంథరూ కలసి వడపప్పుపానకాలు సేవిస్తారు. ఎండ వేడిమి తాళడానికి విసనకర్రలుకూడా పంచుతారు.
నాడు రాముని జననాన్ని చూచి దేవదుందుభలు మ్రోగాయ. అప్సరసలు, యక్ష గంధర్వనాగకన్యలు దేవతలంతా తమ కష్టాలను, భూమాత నష్టాలు తొలిగిపోయాయ ఇక అని ఆనందోత్సవాలతో నృతగానాలాలపించారు. నేడు రామజననాన్ని స్మరించుకుంటూ పండితులు వేదానాదాన్ని ఆలపిస్తారు. గాయకులు పిబరే రామరసం అని రామనామంతో తాద్యాత్మం చెందుతారు. నృత్యకారులు మైమరిచి రామకల్యాణ గాథను కనులకు కట్టిస్తారు. పామరులు సైతం దాశరథి శతక పద్యాలను మననం చేసుకొని ఆనందిస్తారు.
వాఙ్మయ ప్రపంచమంతటా వివిధ సాహిత్య ప్రక్రియలల్లో నెలకొన్నా రామకథను హరికథలు బుర్రకథలు, సంకీర్తనలు, గేయాలు, జానపదాలు ఇట్లా ఒక్కటనేమిటి అందరూ రామనామామృతంలో మునకలు వేసే రోజే చైత్రశుద్ధ నవమి. 32 శుభ సాముద్రికా లక్షణాలతో, 34 శుభ సుగుణాలతో, ముగ్గురమ్మల ముద్దుల కొడుకుగా, తండ్రికి ప్రియసుతుడుగా, ధర్మమే రాశిపోశినట్లు కౌసల్యానందుడు ఈ కలికాలంలోనూ అందరికీ ప్రియబాంధవుడైనాడు. మానవులల్లో మృగ్యమైపోతున్న మానవ సంబం ధాలను తిరిగి మేల్కొలపడానికి ఆదర్శమూర్తి ఏకపత్నీవ్రతుడు, సకల శుభ లక్షణుడు అయన రాముడే ఆ రాముని దివ్యచరితమే మార్గదర్శనం కావాలి. గిరులు తరులు న్నంతకాలమూ రామకథ ఉంటుందన్న మహర్షుల నోటిమాట నిత్యసత్యమని మూగజీవులు సైతం తమపేర్లను రామునితో ముడిపెట్టుకుని జీవించే ఈ మనుష్యగణాన్ని చూచి అవి కన్నీరు కార్చుతూ రాముని నామామృతాన్ని తనవి తీరా ఆస్వాదిస్తాయంటారు కొందరు. ఏది ఏమైనా మానవోన్నతికి మార్గాన్ని చూపే రామకథను అందరూ తెలుసుకొని తీరాల్సిందే.

- రామారావు