మంచి మాట

మానవ ధర్మాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యం, ధర్మం, శాంతం, ప్రేమ అనేవి మానవ ధర్మములు. వాటిని నిరంతరం ఆచరణలో పెట్టిననాడు మానవుడు విజ్ఞాని కాగలడు. సత్యం అనేది ఎల్లప్పుడూ పలుకుతూనే వుండాలి. సత్యం వలన మనిషి జీవితం ధన్యం కాగలదు. ధర్మం కూడా దాదాపు అటువంటిదే. ధర్మం పాటించినవారికి చానవమార్గం, ధర్మమార్గం, సత్యసంధతను కలిగిస్తాయి.
పుడమిపై పుట్టిన ప్రతి మానవుడు గిట్టక తప్పదు. కనుక ధర్మనిబంధనలు తెలుసుకుని మసలుకోగలిగినవారే నిజమైన మానవుడు అనిపించుకుంటాడు.
శాంతం ప్రతి మనిషికి ఎంతో అవసరం. శాంతం సముద్రం కంటే గొప్పది కదా! అటువంటి శాంత స్వభావం కలిగి వుండడం వలన సకల మానవాళికి సేవా పరమ ధర్మం ఆచరించినవారౌతారు. శాంతం మనిషి ఉన్నతికి మార్గం. శాంతంతో ఎన్నో పనులు సాధించవచ్చును. శాంతం ఎంతో గొప్పదంటారు. పూర్వకాలము మహామునులు సైతం శాంతంతో ఎంతో సాధించగలిగారు. లోకకళ్యాణానికి శాంతమే శ్రీరామరక్షగా మిగిలింది. శాంతము లేకుండా సౌఖ్యం లభించదు. ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలి.
పవిత్రమైన వేదాలలో సైతం ధర్మసూత్రాలు ఎన్నో వివరించబడి వున్నాయి. వాటిని మనం యధావిధిగా ఆచరించాలి. అప్పుడే సకల మానవాళికి శుభోదయం కాగలదు. ధర్మరాజు, సత్యహరిశ్చంద్రుడు సత్య ధర్మ సూత్రములు పాటించి మహాపురుషులుగా మిగిలిపోయారు.
సత్యమేవ జయతే, సత్యం పలికి అహింస వలదని మన జాతిపిత మహాత్మా గాంధీజీ బోధించారు. ప్రేమ గురించి బుద్ధ్భగవానుని బోధనలు మనకు ఆదర్శంగా నిలుస్తాయి. శ్రీరామచంద్రుడు సత్యవాక్య పరిపాలకుడిగా రామరాజ్యం ఏలాడు. ఆయన రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా జీవించారు. పితృవాక్య పరిపాలకుడిగా శ్రీరాముడు అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
అశోకుడు రోడ్లకు ఇరువైపులా చెట్లను నాటించినాడు. బాటసార్లుకు చల్లదనం పంచడం కోసం ప్రకృతి రమణీయతను పర్యావరణ పరిరక్షణ కోసం ఆనాడే కృషి చేసిన అశోక చక్రవర్తి సేవలు మరువలేనివి. సత్య, ధర్మ, శాంతి, ప్రేమల ధర్మముల పరిధిలోనికి ఈ మహనీయులంతా వస్తారు.
మనది భారతదేశం. మన భారతీయత కర్తవ్యం ఐక్యత, జాతీయ సమైక్యత. మన దేశ చరిత్రలో ఎందరో మహనీయులు ఆదర్శంగా నిలిచారు. భావితరాలకు ఆదర్శప్రాయులయ్యారు.
ప్రేమతో పలకరించడం, పదిమందికీ చేయూతనివ్వడం ఆ కాలంలో ప్రభువుల పాలన మన్ననలు పొందింది. రాయలేలిన రసవైభవం శ్రీకృష్ణదేవరాయల వారి సామ్రాజ్య పాలన సత్య, ధర్మ, శాంత, ప్రేమలకు ఆదర్శంగా నిలిచింది. మన భారతీయత ఉట్టిపడే రామాయణ, మహాభారత ఇతిహాసాలలో సైతం సత్య, ధర్మ, శాంత, ప్రేమలు ఆయా పౌరాణిక పాత్రల ద్వారా మనం విన్నాం.. తరించాం. పురాణాలు మనకు ఆదర్శాలుగా నిలిచాయంటే భారతీయ చరిత్ర సంస్కృతి కళావికాసం సత్య, ధర్మ, శాంత ప్రేమలకు ఎలా కట్టుబడి వుందో మనం గ్రహించవచ్చును.
కలియుగంలో మానవుడు మాత్రం కర్తవ్యం విస్మరిస్తున్నాడు. స్వార్థచింతనతో జీవిస్తున్నాడు. ఇది మానవ మనుగడకు ముప్పు గనుక ప్రతీ ఒక్కరూ దైవ చింతన భావనతో మసలుకోవాలి. మట్టిలో పుట్టి మట్టిలోనే కలిసిపోయే మనకెందుకు స్వార్థం? నిస్వార్థంతో జీవించాలి. పదిమందికీ మేలు తలపెట్టాలి. చేతనైన సాయమందించాలి. మానవ మనుగడ కోసం అందరూ సమిష్టిగా కృషిచేయాలి. సత్య, ధర్మ, శాంత, ప్రేమలతో మసలుకోవాలి.
సకల మానవాళి సంక్షేమానికి కృషిచేయాలి. శాంతి సమైక్యత జాతీయ సమైక్యత, దేశ సమైక్యతకు పునాది కాగలదు. దేశమును ప్రేమించు! మంచి యన్నది పెంచుకో! పరోపకారంతో పరమార్థం గ్రహించు. ఆదర్శంగా జీవించు. అన్నింటా విజయం నీదే. మానవ ధర్మములు మరువరాదు.

- ఎల్.ప్రపుల్ల చంద్ర