మంచి మాట

సేవ - ఫలితము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌశికుడను ఒక బ్రాహ్మణుడు తపస్సు చేసుకుందామని అరణ్యాలకు బయలుదేరినాడు. అతనికి వృద్ధులై రుూ కొడుకు తప్ప మరెవరు దిక్కులేని తల్లిదండ్రులున్నారు. వారు కుమారుని తమ అనంతరం తపస్సుకు వెళ్లమని చెప్పి బ్రతిమాలుకున్నారు. కౌశికుడు వినలేదు. ఆ ముసలి తల్లిదండ్రులను అలా దిక్కుమాలిన స్థితిలో దిగవిడచి తపస్సునకు వెళ్లి ఒక నిర్జన ప్రదేశంలో ఊరుకు దూరంగా ఒక చెట్టు క్రింద తపస్సు చేయుట ప్రారంభించాడు. రోజూ నిత్య కృత్యాలు తీర్చి మధ్యాహ్నం దాకా తపస్సు చేసుకుంటూ మధ్యాహ్న వేళ భిక్షాటనకు గ్రామంలోనికి వెళ్లా ‘్భవతి భిక్షాందేహి’ అని ఏవో కొన్ని ఇండ్ల వద్ద అడిగి కరతల భిక్షతో పొట్టనింపుకుంటూ తపస్సు చేస్తూండేవాడు. ఒక రోజు మధ్యాహ్నం తపస్సు చాలించి భిక్షాటనకై వెళ్లుటకు ఉద్యమిస్తుండగా తాను కూర్చున్న చెట్టుపైనున్న కొంగ రెట్ట వేయగా అది కౌశికుని నెత్తిపై బడెను. అంత మహాకోపంతో కన్నులెర్ర చేసి చెట్టుపైనున్న కొంగవైపు చూడగా ఆ కోపాగ్నికి ఆ కొంగ రెక్కలు కొట్టుకొనుచు నేలకూలెను. అంత ఆ తపస్వి తన తపము ఫలోన్ముఖము కానున్నదని కొంత సంతోషము, కొంత గర్వముతో లేచి భక్షాటనకై ప్రక్క గ్రామమునకేగెను. ఒక బ్రాహ్మణవాడకేగి ‘్భవతి భిక్షాందేహి’ అని ఒక ఇంటి గుమ్మము కడ నిలబడి కేకపెట్టెను. ఆ గృహిణి అప్పుడే వచ్చిన తన భర్తకు కావలసిన పరిచర్యలు చేసి భిక్షకొని వచ్చుటలో కొంత ఆలస్యమయ్యెను. అంత కౌశికుడు తీవ్ర స్వరంతో ఏమమ్మా! మావంటి తపస్వులనింత నిర్లక్ష్యం చేయతగునా? నేను వచ్చి చాలాసేపైనది గదా! అని కఠోరముగా పలికెను.
అంత నా బ్రాహ్మణి, అయ్యా! నా భర్త పరిచర్య చేయుటలో కొంత ఆలస్యమైనది. స్ర్తిలకు పతిసేవ తరువాతనే గదా వేరొందు పనిచేయుట. మీరంత తీవ్రంగా చూచుచున్నారు గాని నేను కొంగను కాదు లెండి. మీ వంటి తపస్వులకు శాంతము అత్యంత ఆవశ్యకము కదా అనెను. అడవిలో ఎవరూ చూడని చోట జరిగిన ఒక వృత్తాంతము ఈమెకు ఎట్లు తెలిసెనా అని కౌశికుడు ఆశ్చర్యపడి అమ్మా! మన్నించుము, ఆకలితో ఆలస్యమైనందుకు తొందరపడితిని. అది సరేగాని కొంగ సంగతి నీకెట్లు తెలిసెను అని అడిగెను! తాపసా! నీతో మాట్లాడుటకు నాకు వ్యవధి లేదు. అదిగో చూడు మా ఊరి చివర ధర్మవ్యాధుడను చర్మకారుడున్నాడు. అతడు నీకన్నియు చెప్పగలడనెను. కౌశికుడు మరింత ఆశ్చర్యంతో ఆ ధర్మవ్యాధుని కోసం మాదిగపల్లె చేరెను. ధర్మవ్యాధుని ఇంటికేగి లోపలనున్న ఆతనికి కబురంపెను. ధర్మవ్యాధుడు తాను రావడానికి వీలు లేదని బ్రాహ్మణడినే లోనికి రమ్మనెను. కౌశికుడు లోనికేగి తూగుటుయ్యాలలో వృద్ధులైన తల్లిదండ్రులను పరుండబెట్టి ఊపుచూ సేవ చేయుచున్న ఆ ధర్మవ్యాధుని చూచెను. ధర్మవ్యాధుడు బ్రాహ్మణ కుమారా! తల్లిదండ్రుల సేవ విడనాడి అడవిలో తపమొనర్చుట నీకు తగదు. వృద్ధులై వేరు దిక్కులేక నీకై పరితపించుచున్న నీ తల్లిదండ్రుల సేవ చేయుచు వారి అనంతరం తపమాచరింపుము.
కొంగ చచ్చినంత మాత్రాన నీ తపస్సు ఫలించినట్లు తలంపుకుము. తల్లిదండ్రుల తరువాతనే దైవము, భర్త సేవ తరువాతనే స్ర్తికి దైవసేవ, ఆ యమ్మ నా పరిస్థితి నీవు చూచి తెలిసికొనగలవనియే నా కడకు పంపింది. నేను తపస్సెరుగను. దాన ధర్మములు చేయలేదు. నా తల్లిదండ్రుల సేవ తప్ప నాకితరము తెలియదు. నా వృత్తి ధర్మముననుసరించి చర్మకారుడనై చెప్పులు కుట్టి అమ్ముకుని జీవించుచున్నాను. నా తల్లిదండ్రుల యాశీస్సులచే నీ వృత్తాంతము, అమ్మ వాక్యములు నాకు తెలిసినవి. నీ తల్లిదండ్రులు నీ రాకకై ఎదురుచూచున్నారు. పొమ్ము, వారి సేవ చేసి వారి ఆశీస్సులందుము. నీ కోరికలు సిద్ధించును అని చెప్పెను. కౌశికుడాశ్చర్యముతో నుక్కిరిబిక్కిరియై తన తప్పిదమునకు పశ్చాత్తాపపడి ఇంటికేగి తనకై పరితపించుచున్న తల్లిదండ్రులనూరడించి వారి పరిచర్యలొనర్చి వారి అనంతరము తపోవనమునకేగి తపమాచరించి సిద్ధిచెందెను. కర్మ క్రియా ఫలములచే ఎవరైనను ఫలమునందుట తప్పదు. పుట్టుక ప్రధానము కాదు, నడవడికయే ప్రధానము.

-వడ్డూరి రామకృష్ణ