మంచి మాట

సత్యమార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శరీర మాధ్యం ఖలు ధర్మసాధనమ్’ అన్న వేదోక్తి ప్రకారం మానవునికి లభించిన ఈ శరీరమనే ఉపాధి ధర్మసాధనకు మాత్రమే వినియోగించాలి. కాని నేడు కలియుగ ప్రభావం వలన ధర్మమనే మాటకు సరి అయిన నిర్వచనం తెలియక సతమతమవుతున్నారు. పూర్వజ్ఞానం విజ్ఞాన శాస్తమ్రుగా ఆవిర్భవించినప్పటినుండి మానవులలో స్థిరత్వము లోపించింది. ఉత్కృష్టమైన మానవ జన్మను స్వజాతి నాశనము కొరకు వినియోగిస్తున్నారు. పదార్థమును గురించి మాత్రమే ఆలోచిస్తూ యథార్థమును మరచినారు. కాని మన వేదభూమిలో పరమాత్మ చింతన అంకురిస్తూనే వుంటుంది. ఏనాటికైనా భారతదేశమే ప్రపంచానికి ఆధ్యాత్మిక దిశానిర్దేశం చేయగలదని స్వామి వివేకానందులు ప్రగాఢంగా విశ్వసించారు. అదే ఆశయంతో మన సనాతన ధర్మాన్ని పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేసి వివరించారు.
మానవులందరిలో ఉన్నది ఆత్మ ఒక్కటేనని, కాని అది వ్యక్తమయ్యే ఉపాధి మాత్రం శక్తివంతము, పరమ పవిత్రము, ఆదర్శంగా వుంటుందనే సత్యాన్ని శ్రీరామకృష్ణ పరమహంస తెలియజేశారు. అందుకే పరమాత్మ మానవునిగా అవతారం దాల్చి మనకు దిశా నిర్దేశం చేస్తాడని విశ్వసించారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ధర్మము యొక్క రూపాన్ని కనుల ముందు నిలిపాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ అధర్మానికి విధించే శిక్షలు ఆవిష్కరించాడు. ఈ అవతారాల ద్వారా మానవులకు చూపిన సన్మార్గమును సదా అనుసరించాలని ఆయన సూచించేవారు.
ఇక కలియుగంలో మానవుడు ఎలా నడుచుకోవాలో ఈ అవతార పురుషుల ద్వారా తెలుసుకోగలం. వారి పుణ్యగాధలైన రామాయణ, మహాభారత, భాగవతములలోని నిత్య సత్యాలను అనుసరించడం ద్వారా ఈ సంసార సాగరాన్ని దాటి ముక్తిని పొందవచ్చు. అందుకే మనం సత్యమార్గమయిన ఆధ్యాత్మిక జీవనం అలవరచుకోవాలి. ఇది చాలా కష్టతరమైన మార్గమే కాని సాధించలేనిది మాత్రం కాదు. ప్రారంభంలో అంతర్మథనం చాలా తీవ్రంగా వుంటుంది. మనసు అనుక్షణం ఎదురు తిరుగుతుంది. బుద్ధితో దానిని సమాధానపరచాలి. విచక్షణతో ధర్మమార్గాన్ని అనుసరించాలి. అహంకారాన్ని అణచివేయాలి. చిత్తమును అనుక్షణం ఆత్మనందే నిలిపి పరిశీలించాలి. మెల్లగా ఆనందం మన వశమవుతుంది. అప్పుడే సంసారమనే సాగరాన్ని దాటడం సులభమగును. ఈ తాపత్రయ జీవితంలో ఆధ్యాత్మికత ఒక్కటే సేదతీర్చును. ఇదే విషయాన్ని శ్రీరామకృష్ణులు చక్కగా వివరించారు.
ఒక కారవడిలో ప్రకృతి సిద్ధమైన ఒక లోతైన బావిలో ఒక బాటసారి ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. అదృష్టవశాత్తు ఒక తీగ ఆసరాగా దొరికింది. దానిని పట్టుకొని వ్రేలాడుతున్నాడు. అప్పటికే ఆకలిగొన్న మృగాలు బావి గట్టుపై మాటువేసి కూర్చున్నాయి. ఆకలి తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. క్రిందికి చూస్తే ఒక మహా సర్పం పడగ విప్పి కాటువేయడానికి సిద్ధంగా ఉంది. ఈ లోగా ఇంకొక ఉపద్రవం ముంచుకొచ్చింది. ఆసరాగా ఉన్న తీగలను రెండు పెద్ద ఎలుకలు కొరకడం ప్రారంభించాయి. తీగలు క్షణ క్షణానికి బలహీనపడుతున్నాయి. ఇటువంటి భయంకర పరిస్థితిలో బావిపైన వున్న చెట్టుకొమ్మలలో ఉన్న తేనె పట్టు నుండి తేనె బిందువులు భయంతో పైకి చూస్తున్న బాటసారి నోటిలో పడసాగాయి. ఎంతో మధురంగా వుంది. చుట్టూ ఆవరించి ఉన్న విపత్కర పరిస్థితులను మరచిపోయాడు. ఆస్వాదిస్తూ తరిస్తున్నాడు. కొంతసేపటికి ఒక వేటగాడు బావి చుట్టూ ఉన్న మృగాలను వేటాడటానికి వచ్చి బాటసారిని చూసి రక్షించాడు. ఇక్కడ బావి దగ్గర ఏర్పడిన కష్టాలు మన సంసార యాత్రలో నిరంతరం కనబడుతుంటాయి. ఆసరాగా ఏర్పడిన తీగలను కొరికే రెండు ఎలుకలు అత్యాశ, దురాశ. అటువంటి నిరాశాపూరిత స్థితిలో మనకు లభించిన తేనె బిందువులే సత్యమార్గమైన ఆధ్యాత్మిక జీవనం. ఈ మార్గములో పరమాత్మ మన కష్టాలను కడతేర్చే మధురమయిన తేనె మార్గాన్ని సుగమం చేస్తాడు. వేటగాడి రూపంలో మన కష్టాలను కడతేర్చి రక్షిస్తాడు.

-వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు