మంచి మాట

ధర్మాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మాచరణ చేస్తూనే మనుష్యులు ప్రపంచంలో నివసించాలి. ఎప్పుడైతే ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తారో వారు మానవులుగా పరిగణింపబడరు. పశువుల్లో కూడా కొన్ని నీతినియమాలు ఉన్నాయ. వాటిని అనుసరించి అవి బతుకుతాయ. కాని అవి ఎపుడూ కూడా వాటి నియమాన్ని అతిక్రమించవు.నదులు, చెట్లు, ప్రకృతి కూడా నియమాలను అనుసరించే వాటి పనిని అవి చేస్తూనే ఉన్నాయ. కేవలం మనిషి మాత్రమే తనకున్న విచక్షణాజ్ఞానముతోను, తనకున్న మాట్లాడే నేర్పుతోను తాను ఇతరుల సొమ్మును దోచుకోవడమో, బలహీనులను రాపాడడమో లేక ఇతరులను హింసించడంలో ఆనందాన్నో పొందుతున్నారు. కనుకనే అధర్మాచరణకు పూను తున్నాడని ప్రకృతి ఒక్కోసారి మనిషిని హెచ్చరిస్తుంది. ఆ హెచ్చరికను కూడా లెక్కచేయని మనిషి తాను అనుకొన్న దానినే చేస్తూ వెళ్లడం వల్ల ప్రకృతి ప్రకోపాలు అక్కడక్కడ మనకు కనిపిస్తాయ.
దానివల్లే ప్రాణినష్టమో, మానవునికి అవసరమైన వనరుల కరువు ఏర్పడుతోంది. ఇలాంటి కరువులు ఏర్పడడ్డానికి కేవలం కారణం మాత్రంబుద్ధి జీవి అయన మనిషి మాత్రమే. మనిషిలోని స్వార్థ పరత్వం దీనికి కారణభూతం అవుతోంది. చరిత్రను పరిశీలించినట్లయతే ఒక్క మహిషుడో, ఒక్క రక్త బీజుడో, మరో రావణుడో లేక శకటా సురుడో, జరాసంధుడో, కాలయవనుడో, లేక మరో రాక్షసుడో, రక్కసుడో ఈ మానవ మనుగడను తమతమ స్వార్థంతో అతలాకుతులం చేసిన దాఖలాలు మనకు కనిపిస్తాయ. కాని అవిఅన్నీ కూడా కొంత సమయం వరకు మాత్రమే అటు సజ్జనులనో, ఇటు ప్రకృతినో వ్యథకు గురి చేస్తుంటారు. కాని ఎపుడైతే వారి ఆగడాలు మితిమీరుతాయో వెను వెంటనే భగవంతుడు తనకు తానై తన్ను సృజియంచుకొని ఆ ప్రకోపాలను, ఆ రాక్షసులను తుదముట్టా నాశనం చేసి ధర్మాన్ని పునఃస్థాపితం చేసిన కథలను కూడా మనం చరిత్రలో చూస్తాము. కాని ఆ దుర్మార్గుల సమయం కొద్దిమాత్రమే ఉంటే ఈ సన్మార్గులకు, ధర్మావలంబుల కాలం ఇటు ఈ లోకంలోనే శాంతిని పునర్నించడమే కాక వారి యశస్సు కలకాలం ఉంటోంది.
చివరాఖరికి తేలే దేమంటే ప్రతి సమయంలోనూ సచ్చరిత్ర కలవాడై ధర్మమును ఆచరించేవానికే భగవంతుని తోడు ఉంటాడు. ఇక మానవుడు తనకు ధర్మాచరణకావాలో తద్వారా ఒనగూడే భగవంతుని అజరామరమైన ప్రేమ కావాలో లేక అధర్మాచరణతో భగవంతుని శిక్ష కావాలో ఎవరికి వారు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అట్లాఅని విష్ణువైరి అయతే హిరణ్యకశ్యపుల హిరణాక్ష్యుల లాగానో లేక రావణ కుంభకర్ణాదుల లాగానో త్వరగా జన్మలను అయపోగొట్టుకుని త్వరగా వైకుంఠానికి వెళ్లవచ్చునని అనుకొంటే అది మానవత్వం అనిపించుకోదు. ఇతరులను బాధపెట్టి తాను లాభం పొందడమే మానవత్వం అనిపించదు. తాను బాధపడినా ఇతరుల సుఖానికి విలువనిచ్చేవాడే నిజమైన మనిషి. అతని అంతరంగమే భగవంతుని నిత్యనివాసవౌతుంది. శిబి చక్రవర్తి తన మాంసాన్నిచ్చినైనా ఎదుటి ప్రాణిని కాపాడాలనుకోవడమే భగవంతుడు మెచ్చుకున్నాడు కాని ఏదో ఒక ప్రాణిని హింసించి తాను సుఖాన్ని పొందగోరే ప్రాణులను మెచ్చుకున్నట్టు చరిత్రలో మనకు కనిపించదు. రాక్షసులంతా ఎంత భగవద్భక్తులైనా చివరకు వారు భగవంతుని చేతిలో మృత్యువాతనే పడ్డారు. భగవంతునికి ప్రియమవ్వాలంటే భగవంతుడే రూపు ధరించి వచ్చిన పాత్రలను మనం ఆదర్శంగా తీసుకోవాలి. రాముడు తాను కష్టపడ్డా ఇతరుల సుఖానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. కృష్ణుడు తన్ను పెంచిన తల్లిదండ్రులకు ఎంత విలువనిచ్చాడో అంతే విలువను తన నెచ్చలులకు, తన్ను నమ్ముకున్న గోపికలకు ఇచ్చాడు. రేపల్లెవాసులు ఇంద్రుని వల్ల బాధపడితే తన చిటికెన వ్రేలుతో గోవర్థగిరి ఎత్తి రక్షించాడు. ఎందరో రాక్షసులను మట్టుపెట్టి ఎంతమందికో ఊరటనిచ్చాడు. ఇలాంటివాళ్లను ఆదర్శంగా తీసుకొంటే తమ సుఖాని కన్నా ఇతరుల సుఖాలకోసం విలువనివ్వాలి. స్వార్థాన్ని విడనాడాలి అని తెలుస్తుంది.

- రాంప్రసాద్