మంచి మాట

వైశాఖ మహత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైశాఖపురాణం ప్రకారం ఈ మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రియమైంది. విష్ణునామం స్మరించినా వినరో భాగ్యం విష్ణుకథా అంటూ హరికథలనువిన్నా చాలు ఆయన ఎంతో సంతోషించి మనలను సంతోషింపచేస్తాడు. భక్తవత్సలుడైన విష్ణు భగవానుడు వరాహాఅవతారమెత్తి భూదేవిని ఈ మాసంలోనే రక్షించి కాపాడాడు. అట్లాంటి వైకుంఠనాథుని స్మరిస్తూ నదీస్తాన్నాలు కూడా ఈ మాసంలో ప్రత్యేకతను సంతరించుకొన్నాయ.
ఎండ తీవ్రమైంది కనుక ఆ ఎండవేడిమిని భరించలేనివారికి చలివేంద్రాలు ఏర్పాటుచేయటం. జలదానం చేయడం, మజ్జిగ, నివ్మరసం, చెరకురసం లాంటి వాటిని ఉపాహారంగా ఇవ్వడం లాంటివి చేసి ఓ ప్రాణిని సంరక్షిస్తే ఆ పుణ్యం అనేక జన్మల వరకు ఆపదలను గట్టెక్కిస్తుంది.
జలదానం ఎంత మంచిదో గొడుగు, పాదుకలు దానం ఇచ్చినవారికి కూడా అంతే పుణ్యం అంటారు. కర్పూరం, చల్లని పుష్పాలు, వస్త్రాలు, కుంకుమ లాంటివి ఇచ్చినా విష్ణ్భుగవానుడు సంప్రీతి పొందుతాడు. ఎండలో తిరిగి తిరిగి అలసి వచ్చినవారికి సేద తీరేలాగా మంచినీరివ్వడం, పాదప్రక్షాళనం చేయడం లాంటివి చేసినా అవన్నీ లక్ష్మీపతికి చేసినట్లుగా భావించి తన భక్తులను ఎల్లవేళలా కంటికి రెప్పలాగా కాపాడుతుంటాడు.
ఇవేకాక చందనం, కస్తూరి, వట్టివేర్లు, సంపంగి, తుంగవేర్లు, పరుచుకునే చాప దానమివ్వడం వల్ల మోక్షాన్ని పొందవచ్చు. కొబ్బరికాయలను, కొబ్బరినీరును, కొబ్బరిబోండాలను దానం ఇస్తే ఏడుజన్మల వరకు వేద శాస్త్ర సంపన్నుడై విష్ణుప్రియుడుగా అలరారుతాడంటుంది వైశాఖ పురాణం. ఏది దానం చేసినా చేసిన వారు తీసుకొన్నవారూ కూడా సమస్తయజ్ఞాలు చేసిన ఫలాన్ని పొందుతారని పెద్దలంటారు. చైత్ర బహుళ అమామాస్యనాడు ఎవరైతే పానకంతో నింపిన కలశాన్ని దానం చేస్తారో వారు గయలో నూరు పర్యాయాలు పితృదేవతలకు శ్రాద్ధము పెట్టిన ఫుణ్యాన్ని మూటకట్టుకుంటారు.
వైశాఖ మాసంలోనే కృతయుగారంభం జరిగిందనేవారు ఉన్నారు. వైశాఖ తృతీయ రోజున అక్షయతృతీయన బంగారం కొనడం కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయంగా వస్తోంది. ఆరోజున లక్ష్మీదేవిని పూజించడం ముతె్తైదువలకు పండుతాంబూలం ఇవ్వడం లాంటివి చేస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని అంటారు. ఆ రోజునే సింహాచలేశ్వరునకు చందనోత్సవం ప్రముఖంగా జరుపుతారు. చందనోత్తరణ సేవలో లభించిన చందనాన్ని ఇంట్లో పెట్టుకుంటే సర్వశుభాలు కలుగుతాయని అంటారు. శ్రీకృష్ణుని తమ్ముడైన బలరాముని జయంతిని కూడా ఈమాసంలో చేస్తారు. తింటున్నా, తాగుతున్నా, నడుస్తున్నా, నిద్రిస్తున్నా హరినే స్మరించే ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి మహావిష్ణువు నరసింహావతారమెత్తిందీ ఈ మాసంలోనే కనుక నరసింహజయంతిని కూడా జరుపుతారు. పురుషార్థ చింతామణిలో, స్మృతికౌస్త్భుములో వైశాఖ మాసంలో లక్ష్మీనారాయణులను పూజించినవారికి ఇహలోక సంపదలతో పాటు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్తుంది.
చైత్రశుక్ల తదియనాట మొదలెట్టిన గౌరీపూజావ్రతము కూడా వైశాఖతృతీయ రోజుపరిసమాప్తి చేస్తారు. గౌరీ పూజతో పాటుగా త్రిలోచన గౌరీ వ్రతము కూడా చేస్తారని వ్రతగ్రంథాలు చెప్తున్నాయ. పుణ్యమైన ఈ మాసం విష్ణువుకు ప్రీతి కనుక మధుమాసమని కూడా అంటారు.మధుమాసంలో మాధవుని పూజ మూఢుడిని సైతం మాధవుణ్ణి చేస్తుందని అంధుకే ప్రతివారిలో పరమాత్మను చూడమని పెద్దలు చెప్తారు.
...................................
మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.
......................................

- సాయికృష్ణ