మంచి మాట

సాంఖ్య జనార్దనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవులు ఏదైనా విపత్కర పరిస్థితికి గురి అయినపుడు అశాంతితో, భయ సందేహాలతో శోకమగ్నులై యున్న సందర్భంలో ఒక మహాజ్ఞానియైన పుణ్యపురుషుడు చేసే హితబోధ, నేర్పుతో చేసే ఓదార్పు, ఆ మానలవులకే గాక అనంతర తరాల మానవాళికి మహా సందేశంగా వుంటుంది. అది చిరస్మరణీయంగా సమాజంలో నిలిచి వుంటుంది. అంత నేర్పుగాను, మానవుల హృదయంపై ముద్రవేసేదిగాను ఆ మహాపురుషుని ఓదార్పు వుంటుంది. ఎంతటి విహ్వలతతో కూడిన శోకాన్నైనా, భయ సంశయాలతో కూడిన హృదయాంధకారాన్నైనా పటాపంచలు చేయగల శక్తి ఆ మహాపురుషుని బోధనకి వుంటుంది.
అందుకు భగవద్గీతలో కృష్ణ్భగవానుడు అర్జునునికి చేసిన సాంఖ్యయోగ జ్ఞాన బోధనయే చక్కని ఉదాహరణ! ఉత్తేజకరమైన బోధనతో అర్జునుని హృదయాంధకారాన్ని పటాపంచలు చేసి జ్ఞానిగా మార్చాడు. అతని చింత, వంత, సాంఖ్యయోగ జ్ఞాన బోధనతో సమూలంగా తొలగించాడు. సాంఖ్యం జ్ఞానానికి సంబంధించిన యోగం. కర్మయోగం యోగుల కర్మనిష్ఠకు సంబంధించింది. కనుక అర్జునా! ఈ సమయంలో జ్ఞానివై యుద్ధ విముఖుతని, బంధు మోహాన్ని విడిచిపెట్టు! పరంతపుడవని ఖ్యాతి గడించినాడవు! నీవు దుఃఖించనవరం లేనిదానికోసం దుఃఖిస్తున్నావు! నీవంటి వీరులు పండితులు, ఇటువంటి అవసరంలేని దుఃఖాన్ని పొందరు. గతించిన వారిని గురించిగాని, జీవించి ఉన్నవారిని గురించి గాని వారికి ఏదో అపకారం జరుగుతుందని శోకించరు. మానవులు ఇంద్రియ సంబంధమైన అనుభూతుల్ని, అనగా మంచి విషయం చెవులతో విని ఆనందించటంగాని, చెడ్డ విషయం విని చీకాకుపడటంగాని, కన్నులతో సుందర దృశ్యం చూసి ఆనందం పొందటంగాని, అసహ్యకరమైన దృశ్యాన్ని చూసి వికల మనస్కులు కావటంగాని, కష్టాల్ని ఎదుర్కొన్నప్పుడు, సుఖాల్ని అనుభవిస్తున్నప్పుడు, జయం లభించినప్పుడు, అపజయం సంభవించినపుడు ధీరుడైనవాడు సమబుద్ధితో, స్థిరచిత్తంతో వుండాలి! స్థితప్రజ్ఞత్వం అంటే అదే!
పార్థా! నీవు నీ తాతల్ని, తండ్రుల్ని, బంధువుల్ని, మిత్రుల్ని, పుత్రుల్ని సంహరిస్తున్నానని చింతించవద్దు! ప్రతి వ్యక్తి ‘ఆత్మ’ అవినాశి, అది నశించదు. దానిని శస్త్రాలు ఛేదించలేవు. అగ్ని దహింపజాలదు, నీరు తడుపలేదు, వాయువు ఆత్మను స్పర్శించి ఎండింపజాలదు. కనుక నీవు వారి ఆత్మలను ఛేదించి నశింపచేయలేవు. నియమిత కాలంలో నశించేవారి శరీరాల్ని మాత్రమే నీవు ఛేదించగలవు. మనిషి జీర్ణమైన వస్త్రాన్ని (చినిగిపోయిన) వదలి నూతన వస్త్రాన్ని ధరించినట్లే నాశనం లేని ఆత్మ నశించి శరీరాన్ని వదిలి మరొక నూతన శరీరాన్ని ధరిస్తుంది.
నీవు, నేను, మనకు ఎదురుగా వున్న శత్రువర్గ యోధులు, ఒకప్పుడు లేని వాళ్లము కాము. ఇప్పుడున్నట్లే ఇక ముందూ వుంటాం! నశ్వరమైన దేహాలు మారుతూ వుంటాయి. కనుక నీవు ఈ సత్యాన్ని తెలుసుకొని స్థిరచిత్తుడవై యుద్ధం చెయ్యి. కర్మ వీరుడవు కావాలి! కర్మ చెయ్యటానికే నీకు సాధికారత వుంది. కర్మఫలానికి నీవు సాధికారివి కాదు. అలా అని కర్మ నిర్వహణ త్యజించరాదు. కర్మ నిర్వహణ ప్రతి మానవుడి విధి! అది తెలుసుకో! ఈ విధంగా శ్రీకృష్ణ్భగవానుడు విజయుని విషాద హృదయాంధకారాన్ని ‘సాంఖ్యయోగం’ దివ్యబోధనామృత కరదీపికతో పారదోలి వెలుగు నింపాడు. సాటిలేని భక్తాగ్రేసురుడిని చేశాడు. భగవద్గీతలోని అధ్యాయాలన్నీ ఒక్క అర్జునుడికేగాక భావితరాల మానవాళికి కూడా స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందిస్తూ నిత్యనూతనంగా విరాజిల్లుతున్నాయి.

-పారుపల్లి వెంకటేశ్వరరావు