మంచి మాట

గురువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్ష వాఙ్మయానికి ఆద్యుడు వేదవ్యాసుడు. సనాతన ధర్మమును ప్రతిష్ఠింపజేయడంలో ఆయన సృజించని తాత్త్వికాంశమే లేదు. వేదాలను విభజించిన వ్యాస మహర్షి జ్ఞాన ప్రధానమైన రచనలను ఎన్నో చేశారు.
గురుస్థానం ఎంతో పవిత్రమైనది. విశిష్ఠమైనది. ఆదిశంకరాచార్యులవారు గురుస్తోత్రంలో ‘‘నగురోరధికం’’ అంటూ ఈశ్వరుని ఆత్మకు, గురువుకూ మధ్య తేడా లేదని ప్రవచించారు. యోగి వేమన గురువులకు నెలవులు ఆలయాలన్నాడు. ప్రాచీన కాలంలో గురువులు ఆలయాలను వేదికలుగా చేసి కొని శిష్యులకు విద్యనే నేర్పిజ్ఞాన వంతులను గావించేవారు. వీరు ఆడంబరాలతో దేశాటనం చేసేవారు. కొన్ని వేళల్లో కొందరు గురువులు శిష్యులను పీడించి దక్షిణలు వసూలుచేస్తూ గురువులుగా- స్వామీజీలుగా- ఆచార్యులుగా రాణించేవారు. వేమన యిలాంటి మూఢ మత విశ్వాసాలను బోధించే కుల గురువులు- మఠాధిపతులు- పీఠాధిపతులు నిజమైన గురువులుగారనీ, వీరు ధనాశాపరులనీ హేళన చేశాడు. దుష్టగురువులను నిందిస్తూ, సద్గురువులను ఎంతో గౌరవించాడు.
నిజమైన గురువులు ఆడంబరాలకు, వేషభాషలకు దూరంగా ఉంటారన్నాడు. యధార్థ గురువులకు ‘మతానికన్న మతియే మిన్న’అని తెల్పుతూ కస్తూరు వనె్న నల్లగా ఉన్ననూ దాని పరిమళము గుప్పుమంటుంది. అలాగే ఆదర్శ గురువుల గుణగణాలు సమాజ వికాసానికీ, సమాజ శ్రేయస్సుకూ సోపానలనీ అభినందించాడు.
గురువులు నిరంతరం పరువుగా జీవనం సాగిస్తూ సద్బోధలుగావించాలన్నాడు. కుల గురువుల విశిష్ఠతలను ఎంతగానో ప్రశంసించాడు. గురువులు జ్ఞానప్రదాతలుగా ఉంఢాలన్నాడు. గురువులు శిష్యులకు జ్ఞానభిక్షనందిస్తూ, ఆధ్యాత్మిక విషయాలను కూడా నేర్పాలన్నాడు.
గురువులు త్యాగమూర్తులుగా- నిస్వార్థ జీవనం గడపాలి. సద్గురువులుగా సంఘంలో స్థానం పొందాలి. నిజ గురువులుగా వుంటూ శిష్యులకు పరిపూర్ణమును తెలుపుతూ జన్మరహితులగావించాలి.
భక్తినుంచి జ్ఞానం వైపుకు నడిపించేవాడే సద్గురువు. గురుశిష్యుల బంధం, సంబంధం ఎంతో పవిత్రమైనది. శిష్యులు గురుమార్గంలో పయనించాలి. జ్ఞాన పిపాస కల్గినవేళలో చేయి పట్టుకొని, జ్ఞానం లోతులను తరచి చూపించే శక్తియే గురువు.
ఆదిశంకరులు గుర్వష్టకంలో అనేక జన్మలనుండి అనుసరిస్తూ వచ్చి చుట్టుకొన్న ప్రారబ్దం అనే కట్టెలను- ‘ఆత్మజ్ఞానం’ అనే అగ్నిచే దగ్ధం చేసి జ్ఞానమార్గం చూపించే గురువునికి నమస్కారం అని తెలిపారు. ‘గురుశుశ్రూషయా విద్యా’ అని సూక్తి ననుసరించి గురు పూజ చేయడానికీ, గురుకృప పొందుటకు, గురు సాక్షాత్కారం పొందడానికీ అందరికీ అధికారం ఉందనీ, ప్రతివారూ యోగ్యులేననీ బాబావారు సెలవిచ్చారు. యుగ యుగాలనుండీ ఆషాఢ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా, గురుపూర్ణిమగా ఆచరిస్తూ వస్తున్నారు.
వ్యాస పౌర్ణిమి రోజున వేద వ్యాసునికి పూజాదికాలు నిర్వహించి గురువిశిష్ఠతను మరింతగా తెలిసికొని సమాజం ఆనందిస్తుంది. సద్గురువు అయిన వ్యక్తి గురుభక్తితోనూ ఆత్మనిష్ఠలోనూ దృఢంగా వుండుటవలన ఆయనను నమ్ముకున్న శిష్యుల- భక్తుల బరువుబాధ్యతలను ఆ గురువు సహించగల్గుతాడు. స్కాంద పురాణంలో వున్న ఉమామహేశ్వర సంవాదాన్ని ‘గురుగీత’ అంటారు. గురువు ఎవరు, ఎలా వుండాలి, వారి లక్షణాలు ఏమిటీ, ఆవశ్యకతను, గురు సాంగత్యంలో శిష్యుడు ఎలా జీవించాలి? చరించాలి? స్మరించి, తరించాలనే పలు విషయాలను శివుడు పార్వతికి ఉపదేశించాడు.
గురువులు ప్రేమ స్వరూపులు. వారే లోకధర్మాలనూ, జీవన మర్మాలను బోధించాలనీ గురుగీత ఉపదేశం. యోగివేమన గురుని కాననివారు, గురుసేవ చేయనివారు నరక కూపంలో బడతారన్నాడు. లోకమునకు, లోకులకు గురువు తప్పక కావాలన్నాడు. సద్గురువుల కృపతో జ్ఞానంతోబాటు, సద్గతి లభిస్తుందనీ, వారి చదువులు మోక్షదాయకాలనీ, సద్గురువునే దైవమనీ బోధించాడు. అఖిలమునకు గురువు ఆధారమని ప్రశంసించినాడు. అఖిల జగత్తుకూ గురువు శ్రీకృష్ణపరమాత్మ. అర్జునుని శిష్యునిగా స్వీకరించి పలు రకాల తత్త్వజ్ఞానాన్ని ధర్మమార్గాన్ని కర్తవ్య బోధను గావించి ధన్యుని చేశాడు.
శ్రీకృష్ణుడు సాందీపునివద్ద విద్యనభ్యసించాడు. దశరథ పుత్రులు విశ్వామిత్రుడు, వశిష్ఠులవారి వద్దనూ విద్యనేర్చుకొని వేద సారాన్నీ, దైవతత్వాన్ని తెలిసికొని ఆచరణలో చూపారు. ఆధ్యాత్మిక భావనలో శ్రీకృష్ణుడూ, వేదవ్యాసుడూ జగద్గురువులుగా పేరుపొందారు. వేదవ్యాసుని త్రిమూర్తి స్వరూపునిగా వర్ణించారు.

- పి.వి.సీతారామమూర్తి