మంచి మాట

స్నేహ సంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్నేహానికి హద్దులు ఉండవు. పరిమితులు ఉండవు. స్నేహం ఒక గొప్ప ప్రవాహం లాంటిది. అనిర్వచనీయమైనది. త్యాగాన్ని కోరుకుంటుంది. ప్రేమను కురిపిస్తుంది. సంతోషాన్ని కలిగిస్తుంది. తృప్తిని కలిగిస్తుంది. అసంతృప్తిని దూరం చేస్తుంది. ఆశలను చిగురింపజ్తేంది. ఆశయాలను గుర్తుచేస్తుంది. స్వార్థాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేస్తుంది. కపటాన్ని, మోసాన్ని కాఠిన్యాన్ని దరిచేరనీయదు. వృద్ధిని కోరుకుంటుంది. సన్మార్గంలో నడిపిస్తుంది. అందుకే చిరస్మరణీయమైన మధుర జ్ఞాపకాలను మిత్రులు ఎల్లప్పుడూ పొందుతుంటారు. దీని కారణంగానే స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అనే మాటలు ప్రసిద్ధికెక్కాయి. స్నేహానికన్నా మిన్న లోకాన లేదు అంటారు స్నేహ మాధుర్యం తెలిసినవారు.
స్నేహానికి హెచ్చుతగ్గులు ఉండవు. పేద, ధనిక తారతమ్యాలు ఉండవు. స్నేహానికి కులం, మతంతో పని ఉండదు. కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడు నీడలా ఉంటారు. ఇటువంటివారే నిజమైన స్నేహితులుగా నిలుస్తారు. ఒకరి శ్రేయస్సును మరొకరు కోరుకుంటారు. అవసరమైతే ఒకరికొకరు ఒకరు సుఖాలను, సంపదలను, సమయాన్ని తమ దేహాన్ని త్యాగం చేయటానికి వెనుకాడరు నిజమైన స్నేహితులు.
ఇవ్వడం, తీసుకోవడం, దాపరికం లేకుండా రహస్యాలు చెప్పడం, అడగడం, తినడం, తినిపించడం అనే ఆరు లక్షణాలు స్నేహమున్న చోటనే ఉంటాయని అంటారు పెద్దలు.
మంచి మిత్రులు ఏ విధంగా వుంటారో భర్తృహరి తన నీతి శతకంలో ఇలా చెప్పాడు.
పాపకార్యాలనుంచి నివారింపజేస్తుంది. హితాన్ని కలిగిస్తుంది. సత్కార్యాలు చేయిస్తుంది. రహస్యాలను దాచి ఉంచుతుంది. మంచి గుణాలను ప్రశంసిస్తుంది. తగిన విధంగా సహాయం చేసేవారే మంచి స్నేహితులుగా చెప్పబడతారని భర్తృహరి మంచి స్నేహితుల గురించి చెప్పాడు.
రామసుగ్రీవుల మైత్రి గురించి అందరికీ తెలిసిందే. సుగ్రీవుని కష్టాన్ని తెలుసుకొని ఆ కష్టాన్ని దూరం చేసి సుఖసంతోషాలను ఇచ్చినవాడు రాముడైతే తన బలగంతో రాముని పత్ని సీతమ్మ ఎక్కడుందో కనుగొని అపార సేనావాహిని తోడివ్వడమే కాకుండా తాను సైతం రణరంగానికి నడిచి రాముని ప్రాణానికి ప్రాణంగా సలహాలు ఇస్తూ ఆజన్మాంతమూ మైత్రి విలువలను కాపాడుకున్నవాడు సుగ్రీవుడు. అట్లానే రావణుని తమ్ముడు విభీషణుడు తన అన్నను సకల సంపదలను విడిచి రాముని దగ్గరకు శరణార్థిగా వచ్చి రామునికి ప్రియస్నేహితునిగా మారిన విభీషణుని స్నేహమూ గొప్పదే. అట్లాంటి స్నేహం గురించి వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణంలో తెలిపిన విషయం అందరికీ తెలిసిందే.కృష్ణుడు, కుచేలుల స్నేహం గురించి తెలుసుకొన్నప్పుడు స్నేహంలో తారతమ్యాలు ఉండవని మనకు తెలుస్తుంది. మంచి స్నేహాన్ని సూర్యోదయంతో పోలుస్తారు. సూర్యుడు వెచ్చని కిరణాలను మెల్లమెల్లగా ప్రసరింపచేస్తూ కాలం పెరిగే కొద్దీ సూర్యప్రతాపం ఏవిధంగా ప్రచడంగా తయారు అవుతుందో స్నేహం కూడా మొదట్లో కొద్దిగా ఉన్నట్టు కనిపించినా రాను రాను ఇరువురి మధ్య స్నేహంగాఢమై వారువీరయ్యారు అన్నట్టుగా మారుతుంది.
ఎటువంటి స్నేహం చేయాలో ఎటువంటి స్నేహం చేయకూడదో అవగాహన కల్పించేది భారతం. మన పురాణాదులు, కావ్యాలు, కథలు చదివితే చాలు స్నేహం విలువ మనకు ఎంత గొప్పదో తెలుస్తుంది. సత్యస్వరూపులతోను, నీతి నియమాలతో బతికేవారితో స్నేహం ఎన్నాళ్లైనా వాడిపోదు. మాసిపోదు.
అందుకే ప్రతి ఒక్కరు మంచి స్నేహం చేస్తే, జీవితమే సుఖశాంతులతో కొనసాగుతుంది. స్నేహం లేని జీవితం నరకంలా ఉంటుంది. అందుకే మంచి స్నేహాన్ని డబ్బు ఇచ్చి కొనుక్కోవాలంటారు. చెడ్డ స్నేహాన్ని పైకం ఖర్చుచేసైనా సరే విడిచిపెట్టాలంటారు. మరి ఇట్టి స్నేహ సంపదను సంపాదించుకుని మనం జీవిస్తే ఇలలోనే స్వర్గం గోచరిస్తుంది.

- జాధవ్ పుండలిక్‌రావు పాటిల్