మంచి మాట

భగవద్గీతాసారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవానుని చేత నుడవబడినగీత భగవద్గీత. ఇది వేదాంత సారము. గీత మానవునికి కర్మ ఎంత ముఖ్యమో ఆ కర్మను ఏవిధంగా చేస్తే ఏవిధమైన జన్మను పొందవచ్చో తెలుపుతుంది. ఒక్కకర్మగురించే కాక మానవుడేవిధంగా జీవించాలో కూడా గీత బోధిస్తుంది.
లోక కల్యాణకారుడైన భగవానుడు అర్జునుడు దుఃఖితుడై తన వారిని అందరినీ చంపి రాజ్యభోగాలను అనుభవించలేనని చెప్పే సమయంలో క్లైబ్యమును, హృదయ దౌర్బల్యమును పొందడం అనే పరిస్థితి అర్జునుని వంటి వీరునికి తగదని కృష్ణుడు చెబుతూ అసలు నీవు నేను అనేవారు ఎవరున్నారు. ఉన్నదంతా కేవలం నేను మాత్రమే అని చెపుతూ మృత్యువు వచ్చినవాడు, చచ్చినవాడు, చంపబడుతున్నవాడు, చంపేవాడు కూడా నేనే. నేను తప్ప మరెవ్వరును ఎక్కడునూ లేరు అన్నాడు. అదే సత్యమని అనేకమంది పండితులు, జ్ఞానులు చెప్పారు. వేదమూ చెప్పినది, వేదాంతభాష్యం కూడా దానినే చెప్తున్నది.
కృష్ణుడు అర్జునుడికి దేహము, ఆత్మ వేరు వేరు. చేసిన కర్మల వల్ల ఈ దేహము ప్రాప్తవౌతుంది కాని దేహము ఆత్మ ఒక్కటి కాదు. మానవుడు పాత బట్టలను విడిచి కొత్త బట్టలు ధరించినట్లుగా చేసిన కర్మల ఫలితాన్ని బట్టి ఆత్మ ఇపుడున్న దేహాన్ని విడిచి మరొక దేహాన్ని పొందుతుంది. కాని ఆత్మ చావదు పుట్టదు. అసలు ఆత్మకు చావు పుట్టకలు లేవు. ఆత్మ దేహము కాదు. దేహమందు దేహి ఒకడు కలడు. అతనికి కౌమార, యవ్వన జరలవలనే మరొక దేహము కూడ ప్రాప్తమగును. అతడు ఎన్నడును పుట్టడు, చావడు, ఉండి లేకుండా పోడు. అతడు నిత్యుడు, శాశ్వితుడు, చంపబడడు అని తత్వాన్ని అర్జునునికి స్వయంగా భగవానుడు చెప్పాడు. కనుక నీవు ఎవరినో చంపుతున్నానని కాని వారెవరో మరణిస్తున్నారని కాని విచారించవలసిన పని లేదు. నీ గుణ కర్మలను బట్టి ఈ దేహము వస్తుంది. ఆ యా కర్మల తాలూకూ ఫలితంవల్లనే ప్రాప్తించిన జన్మలోని దేహాన్ని పొందుతారు అని జ్ఞానోపదేశం చేశాడు.
పుణ్యపాపసంచయం వల్ల సుఖాలు దుఃఖాలు కలుగుతాయని కేవలం సుఖాలు కావాలంటే స్వర్గాన్ని ఆశిస్తే పుణ్యకర్మలు చేయాలని చెప్పే గీత మానవుని చేతిలోనే పుణ్యపాపార్జనకు వీలుందని దానివలనే దేవతలు సైతం మానవులుగా పుట్టాలి అనుకొంటారని తెలియచేస్తుంది. ఈ కర్మల ఫలితాలనుంచి తప్పించుకోవాలంటే నిరంతరమూ భగవంతుని సన్నిధి యందే ఉండాలని వాంఛించే వారికి భగవానుడు స్వయంగా నీ కర్తవ్యాన్ని నీవు ఆచరించు ఫలితాన్ని ఆశించకు అని, చేసే ప్రతి కర్మను కూడా నీవు నిమిత్తమాత్రుడివై ఆచరించు. నీచేత చేయంచేది చేసేది కూడా నేనే నని విశ్వాసంతో చేసినపుడు ఆ కర్మల తాలూకూ ఫలితాలు నీవు అంటవు అనే జ్ఞానా మృతాన్ని కూడా అందించాడు. కనుకనే గీతను చదివి అర్థం చేసుకొంటే మనుష్యుడు తానేవిధంగా జీవించాలో సులభంగా తెలుసుకొంటాడు.
తపస్సు అంటే ముక్కు మూసుకుని ఏకాగ్రచిత్తంతో భగవంతుని నామాన్ని స్మరిం చడమే కాదు అని చెప్పే భారతీయం చేసే పనిలో భగవంతుణ్ణి చూడమనే సందేశాన్ని ఇస్తుంది. ఈశ్వరార్పణతో చేసే ఏపనియైనా భగవంతుడు మెచ్చుతాడు. స్వార్థాన్ని మాని నలుగురికీ మంచి జరిగే పని చేస్తే ఆ పనిలో మంచి ఫలితాలనే అందుకోవచ్చు అనేది కూడా హైదంవం చెప్తుంది. ప్రపంచానికే తల మానికమైన భగవద్గీత సాటి మనుషులను మాధవరూపంలో చూడమని ప్రేరేపిస్తుంది. నరుల్లో నారాయణాంశను ఉందనే విశ్వాసంతో బతకమని ప్రేరణనిస్తుంది. పరోపకారం మిదం శరీరం అని బతకమనే భారతీయం ప్రతివారిలో పరమాత్మను చూడమంటుంది. మానవ సేవే మాధవ సేవ అనడంలో అర్థం ఇదే.
......................................................................
మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను
సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

- హనుమాయమ్మ