మంచి మాట

శ్రీకృష్ణాష్టమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంసాది రాక్షసుల విహారం ఎక్కువై భూభారం పెరిగింది. వారి అధర్మవర్తనంతో భూమాత తల్లడిల్లింది. ఆ తల్లి కన్నీళ్లు తుడవడానికి బ్రహ్మాదిదేవతలు ఒక్కచోట కూడారు. ఆ తల్లి కూడా వారితో చేరి నన్ను ప్రాణికోటిని రక్షించమని ఆ దేవదేవుణ్ణి ప్రార్థించింది. సాధువుల ప్రార్థన విన్న అఖిలాండేశ్వరుడు, ఆదిమధ్యాంతరహితడు, సృష్టిస్థితిలయకారకుడైన శ్రీమన్నారాయణుడు చిరునవ్వుతో వారికి అభయప్రదానం చేశాడు. తాను ద్వాపరయుగంలో దేవకీవసుదేవుల కుమారుడుగా పుట్టి రాక్షససంహారం చేస్తానని మాటిచ్చాడు. ఆ మాట ప్రకారమే కంసుని వద్దకారాగారంలో బందీలుగా ఉన్న దేవకీవసుదేవులకు అష్టమ గర్భాన జన్మించాడు.
పుట్టీపుట్టగానే ఆ శ్రీమన్నారాయణుడు చతుర్భాహునిగా దర్శనమిచ్చి వసుదేవునికి నన్ను తీసుకొని వెళ్లి నందుని ఇంట యశోదాతల్లి దగ్గర పరుండబెట్టు. అక్కడ జన్మించిన ఆడ శిశువు తీసుకొచ్చి ఈ దేవకీ తనయగా కంసునికి చూపించు మని ఆదేశించాడు. కృష్ణుడు చెప్పినట్టుగానే వసుదేవుడు నిమిషంలో శిశువుగా మారిన మహావిష్ణువును బుట్టలో పరుండబెట్టుకొని మాయామోహితులైన కావలివాళ్లు నుదాటుకుని వాటికవే తెరుచుకున్నకారాగార ద్వారం నుంచి బయల్వెడి దారిచ్చిన యమునా నదిలో నుంచి నడిచి యశోదతల్లి ఒడిన కృష్ణయ్యను చూచి తిరిగి మాయాశక్తి ని తీసుకొని దేవకీచెంతకు చేరుకున్నాడు.
అపుడే ఆ శిశువు పుట్టినట్లుగా ఆ కృష్ణమాయ కెవ్వున ఏడ్చింది. ఆ ఏడుపుకు కావలి వాళ్లుఅప్రమత్తులై ఆ దేవకీ పురుడు పోసుకుందన్న విషయాన్ని కంసునికి చేరవేశారు. కంసుడు వచ్చి ఆ శిశువును చంపబోగా దేవకీదేవి తన తోబుట్టువు, సోదరుడైన కంసుణ్ణి పరిపరివిధాల వేడుకుంది. ఆడశిశువు నీకేమాత్రం కీడు చేయదు అన్నా నా బిడ్డను బతికించు అని వేడుకున్నా మృత్యుభయం వెంటాడే కంసుడు కనికరం లేక ఆ శిశువును చంపదలచి ఆకాశానికి ఎగరవేసాడు. ఆ శిశువు కిందకు రాక అక్కడ ఉండిపోయింది. అంతటితో ఆగక ఆకాశవాణి ‘‘ఓరీ కంసా! నిన్ను మట్టుపెట్టేవాడు రేపల్లెలో పెరుగుతున్నాడు. నీమృత్యువు ఆసన్నమైంది’’ అని కంసుని హెచ్చరించింది. అలా కృష్ణయ్య పుట్టిన తిథే శ్రావణ అష్టమి. యశోదమ్మ ఒడిని చేరిన కృష్ణయ్య అల్లారుముద్దుగా గోకులానికే మణిదీపంగా దినదినాభివృద్ధిచెందసాగాడు. యశోదమ్మ తనయుడుగా ఉంటూనే పూతనాది రాక్షసులనెందరినో మట్టుపెట్టాడు. శకటాసురుణ్ణి, తృణావర్తనుణ్ణి, అఘాసురుణ్ణి, ధేనుకాసురుణ్ణి, ప్రలంభాసురుని, అరిష్టాసురుణ్ణి, కేశిని, వ్యోమాసురుణ్ణి మొదలైన రాక్షసులను మట్టు పెట్టి కంస సంహారం చేశాడు.
మరోవైపు రేపల్లెలో యశోదమ్మకే కాక గోపీజనానికంతా ముద్దుబిడ్డడిగా ఎదిగాడు.తన స్నేహితులతో కలసి ఇల్లిల్లు తిరుగుతూ ఎన్నో వింతలు చేసేవాడు. కోతులకు వెనె్న పంచే కన్నయ్య పొరుగిండ్లలో వెన్న దొంగగా పిలిపించుకున్నాడు. ఓ తల్లి కోడలి అందకుండా ఉండాలని వెనె్న ఉట్టిమీద పెడితే సంగడీలతో ఉట్టిపైన కుండను దింపి తాను తినితనవారికి పెట్టి, అత్తమూతికి పూసి పోయాడు.కోడలిని కట్టడి చేసే వెన్నపూసుకొన్న మూతితో ఉన్న అత్తను చూచి నలుగురు నవ్వేట్టు చేసాడు. పల్లెవాసులు ప్రార్థించే దేవుని పటాలకు ఎంగిలి రాసేవాడు. వేల్పులకు ఎంగిలి అంటకూడదనే వారికి నాకన్నా వేల్పులెవరు అని ప్రశ్నించేవాడు. పాలుపెరుగుమననీయడంలేదు నీకొమరుడు మేము మరోచోటికి వెళ్తాం అంటూ ఫిర్యాదులు చేయవచ్చిన గోపికల ముందు అమాయకుడిలా తన తల్లి చెంత నిద్రపోతూ కనిపించేవాడు. మన్ను తిన్నావని గద్దించిన అడిగిన యశోదమ్మకు తన నోట 14 భువనాలు వీక్షింపజేసిన నిర్మలుడు శ్రీకృష్ణుడు. నరకాసురుని సంహరించి 16వేలమంది రక్షించిన వీరుడు శ్రీకృష్ణుడు. ఉలూకబంధనంతో కుబేరునికొడుకులైన యమళార్జునులకు శాపవిమోచనం కలిగించి దామోదరునిగా పేరెన్నిక కన్నాడు. ఇలా ఎనె్నన్నో చిత్రాలు చేసిన శ్రీకృష్ణునికి ప్రతి శ్రావణ బహుళ అష్టమి నాడు జన్మదినోత్సవ వేడుకలు ఆ బాలగోపాలం జరుపుతారు.

- చోడిశెట్టి శ్రీనివాసరావు