మంచి మాట

వినయగుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యావినయాన్ని ఇస్తుంది. వినయగుణం మనిషిలోని మంచితనాన్ని వెలికితెస్తుంది. అందుకే విద్యావినయాలనే రెండింటికీ మానవ జీవితంలో సమాన ప్రాధాన్యం ఉంది. గీతలో శ్రీకృష్ణుడు విద్యావినయముల చేత సంపన్నుడైన వాడే గౌరవానికి పాత్రుడని పరోక్షంగాచెప్పిఉన్నాడు. విద్య అనగా జ్ఞానమే. కాని, కేవలం అక్షర జ్ఞానం ఒక్కటే విద్యకాదు.
విద్య వలన మనుషుల్లో అనాలోచితంగానైనా ఉన్న గర్వం, అహంకారం అనే అనవసర పటాటోపాలు నశిస్తాయ. సత్వగుణం అబ్బుతుంది. అందరిలోను ఉన్న పరమాత్మ అంశ చూచే నేర్పు అలవడుతుంది. అట్లాకాక విద్య నేర్చుకున్నా తామే అధికులమని తమకే విద్యాజ్ఞానం అబ్బిందని అనుకొంటే నేర్చుకున్న విద్య మనిషిగా ఎదగడానికి పనికి రాలేదన్నమాట. ఎంత విద్య ఉన్నప్పటికీ అతడు సంస్కారిగా గుర్తింపబడడు. అందుకే విద్యాగర్విష్ఠిని మణికలిగి ఉన్న నాగుబాముతో సమానం అని శతకకారుడు అన్నాడు.
త్రిగుణాలలో ఈ లక్షణాన్ని తమోగుణం అంటారు. తమోగుణంతో ప్రభావితుడైన ఉన్న మనిషికీ, పశువుకూ అభేదం అంటారు పెద్దలు. చదువుకునే చదువు మనిషికి వివేకాన్ని కలుగచేయాలి. వివేకంవలన సత్యాసత్య పరిజ్ఞానం ఏర్పడుతుంది. విద్యావంతుడు మానసికంగా ఎదుగుతాడు. మనిషిలో దాగున్న శక్తులను బయల్పపరిచేది విద్య అని అందరూ అంగీకరిస్తారు. పరలోకంలో సుఖాలను అనుభవించడానికైనా, ఈ లోకంలో జీవించడానికి అయనా విద్య చాలా అవసరం. ప్రహ్లాదుడు చెప్పినట్టు చదువుల్లో మర్మాన్ని తెలుసుకొంటే అదనంగాని, లేక ప్రత్యేకంగా గాని చదువకుండానే చదువరి ఈలోకానికి పనికి వచ్చే చదువును మాత్రమే చదివినా పరలోక సంపదలను కూడా కూడపెట్టుకోగల సంస్కారి అవుతాడు. ఏ చదువైనా మనిషిలోని మానవత్వాన్ని వెలికితీస్తేనే అది చదువు అవుతుంది.
ఇంతకుముందు కాలంలో గురుకులాలు ఉండేవి. అక్కడ విద్య నేర్చుకోవడానికి ఉన్నవారిలో తరతమ భేదాలు ఉండేవి కావు. రాజకుమారుడు, మంత్రికుమారుడు లేక సామాన్యుడు అని కాక గురు పుత్రులుగా వారందరూ విద్యనభ్యసించేవారు. అందుకే శ్రీకృష్ణుడు కుచేలుడు ఒకే గురువు వద్ద విద్యాభాస్యం చేసి పెరిగి పెద్దవారై శ్రీకృష్ణుడు యదుకులానికి రాజు అయనా కుచేలుడు దారిద్య్రంతో సతమతమవుతూ శ్రీకృష్ణునిచెంతకు వస్తే కృష్ణుడు ఎంతో ఆదరాభిమానాలతో ఆదరించాడు. తనకు కుచేలునకు అభేదమని కృష్ణపరివారానికి తెలియపర్చాడు. దాంతోకృష్ణుని అభిమానాన్ని చూరగొన్న ఆ కుచేలుడు ఎంతటి భాగ్యవంతుడో అని అంతఃపురజనం అనుకొన్నారంటే వారి మధ్యస్నేహం అంత పరిమళించడానికి కారణం వారి విద్యాభ్యాస కాలంలో నేర్చుకున్న చదువే కదా.
అందుకే నేటికాలంలో జీవనయానం సాగించడానికి విద్య నేర్చుకున్నా అది కూడా పరమాత్మను చేరే మార్గాన్ని చూపేదిగాను, మానవత్వాన్ని ద్విగుణీకృతం చేసే నేర్పును కలిగి ఉండేలాగాను ఉండాలి. అటువంటి విద్యను గురువులు నేటి బాలలకు నేర్పాలి. అపుడే భారతదేశం పుణ్యభూమిగాను, కర్మభూమిగాను వర్థిల్లుతుంది. ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న మన భారతదేశం పూర్వవైభవం మరలా మన కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. కనుక వినయాన్ని ఒసగే విద్యను పిల్లలు నేర్చుకునేటట్టుగా అటు తల్లిదండ్రులు, ఇటు గురువులు శ్రమించాలి. అపుడే భావి భారతదేశం అఖండమైన కీర్తి ఆర్జించగలుగుతుంది.
...................................
మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను
సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.
...................................

- జి. కల్యాణి