మంచి మాట

త్యాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టిన ప్రతి మనిషి జీవించడానికి ఏదో ఒక పని చేయవలసి వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కో విధమైన పని చేసి జీవనోపాధి పొందుతారు. ఎవరి అభిరుచిని బట్టి వారు ఆ పని చేస్తారు. కొందరు ఏ పని చేసినా పనిలో నాకేం లాభం? అని ఆలోచిస్తారు. నాదంతా దాచుకోవాలని కొందరు భావిస్తే, మరికొందరు దొరికినంత దోచుకోవాలని ఆలోచిస్తారు. ఇంకొందరు స్వార్థం లేకుండా నిజాయితీగా తను సంపాదించిన సంపద, జ్ఞాన సంపద సమాజాభివృద్ధికి సమర్పిస్తారు. ఇటువంటివారే త్యాగమూర్తులు.
ఇచ్చిన మాటకు కట్టుబడి తన సంపదను, జ్ఞాన సంపదను నిస్వార్థంగా ధారపోసిన మహానుభావులు మన పురాణాల్లో, ఇతిహాసాల్లో, భారతజాతి చరిత్రలో మనకు దర్శనమిచ్చి, ముందుకు నడిపేవారు ఉన్నారు.
సూర్యుడు ఒకసారి కర్ణుని పూజామందిరంలో ప్రత్యక్షమై పుత్రా! కర్ణా! ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో నీ వద్దకు వచ్చి నీ కవచ కుండలాలను దానంగా అడుగుతాడు. నీవు ఇవ్వద్దని చెపుతాడు. ఇస్తే నీ ప్రాణానికే హాని కలుగుతుందని చెపుతాడు. అపుడు కర్ణుడు తండ్రీ! దేవతల రాజైన ఇంద్రుడే స్వయంగా నా వద్దకు వచ్చి ‘దేహి’ అని అడిగితే నేనెలా కాదనను. ఈ దేహం శాశ్వతం కాదు. ఎటువంటి ఆపద వచ్చినా కాదనను అని చెప్పాడు. కేవలం చెప్పడమే కాదు ఇంద్రుడు అడిగితే నిస్వార్థంగా కవచకుండలాలను ఇచ్చాడు.
రంతిదేవుని దానశీలతను, త్యాగనిరతని పరీక్షించటానికి ఒకసారి ఇంద్రుడు డేగగా మారి, అగ్ని పావురంగా మారుతారు. డేగ పావురాన్ని తరుముకుంటూ వస్తుంది. పావురం తనను డేగ బారినుంచి రక్షించమని రంతిదేవున్ని వేడుకుంటుంది. వెంటనే రంతిదేవుడు పావురాన్ని కాపాడటానికి తన శరీరంలోని మాంసాన్ని సమర్పిస్తాడు. పావురాన్ని కాపాడుతాడు. ఇందులో రంతిదేవుడు ఏమి ఆశించాడు? ఏమీ లేదు కదా! ఇదే గొప్ప త్యాగం కదా!
విరోచనుని కుమారుడైన బలి అసుర చక్రవర్తి. భక్తప్రహ్లాదుని మనుమడు. తన శక్తి సామర్థ్యాలతో సర్వలోకాన్ని ఆక్రమిస్తాడు. ఒకనాడు బలి నర్మదా నదీ తీరంలో యాగం చేస్తుండగా వామనుడు వెళ్లి మూడు అడుగుల నేల కోరుతాడు. బలి చక్రవర్తి ఇస్తానని మాట ఇస్తాడు. ఇందులో ఏదో మోసం ఉందని రాక్షస గురువైన శుక్రాచార్యుడు చెప్పినా, ఇచ్చిన మాటకు కట్టుబడి మూడు అడుగుల వేల దానం చేశాడు. బలి ఏమి ఆశించాడు. ఏమీ లేదు కదా! ఇది నిజమైన త్యాగం. మనిషి తన జీవితమంతా కుటుంబ సభ్యులకోసం త్యాగం చేస్తున్నాడు. ఈ త్యాగంలో కుటుంబ సభ్యుల క్షేమం ఉంది. అంటే ఇందులో స్వార్థం ఉంది. స్వార్థం ఉన్నటువంటి త్యాగం ఎప్పటికీ నిజమైన త్యాగం అనిపించుకోదు. ఇటువంటి త్యాగంవలన ప్రయోజనం ఉండదు. అయినా సంసార మాయలో పడి మనుషులు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ప్రతి పనిలో ఫలితం కోరుకుంటారు. లాభం కలగాలని ఆశిస్తారు. విలువైన జీవితాన్ని ఎందుకు పనికిరాకుండా చేసుకుంటారు. ఫలితాన్ని ఆశించకుండా పని చేయాలని శ్రీకష్ణ్భగవానుడు గీతలో ఉపదేశించాడు కదా!
అన్ని జన్మలకంటే విలువైన జన్మ మానవజన్మ. మానవ జన్మకు వచ్చిన ప్రతి మానవుడు తన విలువైన జీవితాన్ని భగవంతుని కార్యానికి నిస్వార్థంగా ఉపయోగిస్తే ఎంత బాగుంటుంది. భగవంతుని నామస్మరణకు, భగవంతునికి భక్తుని జీవితాన్ని, తన సర్వస్వాన్ని ధారపోసే జన్మ ధన్యమవుతుంది.
మదర్ థెరిస్సా తన సర్వస్వాన్ని దీనజనుల, రోగపీడితుల కోసం ధారపోసింది. వీరందరు ఏమి ఆశించి జీవితాన్ని సర్వస్వాన్ని ధారపోశారు. ఆలోచిస్తే త్యాగంలోని గొప్పతనం, మాధుర్యం తెలుస్తుంది. ఏమి ఆశించకుండా చేసేదే త్యాగం. మహాత్ముని బాటలో మనం పయనిద్దాం. వారి వారసులమని నిరూపిద్దాం.
............................................
మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను
సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి. మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.
...........................................

-జాధవ్ పుండలిక్‌రావు పాటిల్