మంచి మాట

అనంతపద్మనాభస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం కౌండిన్యముని భార్య ‘శీల’ కష్టాలను భరించలేక సర్వాధికారియైన శ్రీమన్నానారయణుణ్ణి ప్రార్థించగా ఆయన అనంతుని అర్చించమని దారి చూపాడట. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని చేత బోధించబడిన వాడై అనంత పద్మనాభ చతుర్థశి అనే వ్రతాన్ని భాద్రపద శుద్ధ చతర్దశినాడు ధర్మరాజు ఆచరించగా,వారి కష్టాలు దూరం అయ రాజ్యాధిపతులైనారు.
అట్టి వ్రతాన్ని శీల కూడా ఆచరించాలని తలచింది. పెద్దలను అడిగి వ్రతాచరణ తెలుసుకొంది.వారు చెప్పిన ప్రకారం వ్రతాచరణ - ‘కృత్వా దర్భమయం దేవం శే్వత ద్వీపే స్థితమ్ హరిమ్ సమన్వితం సప్త ఫణె పింగళాక్షం చతుర్భుజమ్’ అంటూ ప్రార్థిస్తూ నది వద్దగాని, చెరువు వద్దగాని, లేక ఇంట్లోనే ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని శుభ్రం చేసి సిద్ధం చేసుకోవాలి. స్నానం చేసి పరిశుభ్రమైన వస్తమ్రులను ధరించాలి. శుభ్రంచేసిన స్థలంలో అష్టదళ పద్మాన్ని వేసి, తామర పువ్వు వంటి మండలాన్ని నిర్మించాలి. దక్షిణ భాగంలో నీటితో నింపిన కలశాన్ని ఉంచాలి. వేదిక మధ్యలో ‘అనంతపద్మనాభస్వామిని’ దర్భతో చేసి, ఆవాహనం చేయాలి. కల్పోక్త ప్రకారంగా షోడశోపచార పూజను చేయాలి. ప్రదక్షిణ నమస్కారములుచేయాలి. పధ్నాలుగు ముళ్లు గలిగిన, కుంకుమతో తడిసిన, కొత్త తోరమును స్వామి దగ్గర ఉంచి పూజించాలి. ఐదు పళ్ల గోధుమ పిండితో 28 అప్పాలను చేసి స్వామికి నివేదనచేయాలి. తోరాన్ని కుడిచేతికి కట్టుకోవాలి. 14 అప్పాలను వాయనంగా బ్రాహ్మణునికి యిచ్చి, తరువాత బ్రాహ్మణ సమారాధనను చేసి దక్షిణ తాంబూలములతోవారిని సంతృప్తి పరచాలి. ఆ తర్వాత ప్రసాదాన్ని స్వీకరించాలి. వ్రతమహాత్వాన్ని తెలిపే కథను వినాలి.
ఒకసారి కౌండన్యమహాముని తన భార్య చేతికి ఉన్న అనంతపద్మనాభుని తోరాన్ని చూచి భ్రమపడి కలిమహాత్వంతో ఈ తోరం నన్ను వశపరుచుకోవడానికి కట్టింది దీన్ని తీసేయాల్సిందని ఆవేశపడ్డాడు. అపుడు ఆ ధర్మపత్ని ఎన్నో విధాలుగా ‘‘స్వామీ! ఈ తోరం వల్లనే మనకు అష్టైశ్వర్యాలు లభిం చాయ. ఆ పరంధాముని కృప కలిగింది’’ అని ఎంత చెప్పినా వినలేదట. చివరకు నేను ఆ అనంతుని చూస్తానని, చూస్తే గాని నమ్మనని బయలు దేరి వెళ్లిపో యాడట. తిరిగి తిరిగి చివరకు సొమ్మసిల్లి పడిపోయాడట. అనంతుడు దయాళువు కనుక కౌండన్యుని మూర్ఖత్వానికి జాలిపడి అతని కలలోకనిపించాడట. స్వామి కరుణించి కౌండిన్యునితో నీవు ఈ అనంతుని వ్రతాన్ని పద్నాలుగు సంవత్సరాలు ఆచరించు. అపుడు నీకు దర్శనం ఇస్తాను. నీకు నక్షత్రస్థానాన్ని ఇస్తాను అని చెప్పాడట. భ్రమలు వీడిన కౌండిన్యుడు ఆ దేవాదిదేవుడి దర్శనంతో ఆనంధం పొంది. దేవా నీ వ్రతాన్ని ఆచరించే శక్తిని నాకిమ్ము అని వేడుకున్నాడట. అపుడు ఆ అనంతుని దయవల్ల కౌండన్యుడు తిరిగి ఇంటికి వచ్చి తన ధర్మపత్నితోకలసి 14 సంవత్సరాలు అనంతపద్మనాభని వ్రతాన్ని ఆచరించి పుత్ర పౌత్రాభివృద్ధిని పొంది, అంత్యకాలమునందు నక్షత్రలోకంలో స్థానాన్ని పొందాడట! ఈ కథను ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పాడు. పుత్ర, పౌత్రుల సంపదను, పాడిపంటల సిరులను, ఆధ్యాత్మిక జ్ఞానాన్నిచ్చి, అంత్యాన మోక్షాన్ని ప్రసాదించే ఈ వ్రతాన్ని ప్రతివారు ఆచరించాలి.
నీలాంబరాలతో కిరీట, కేయూర, కటి సూత్ర కంకణాలతో ప్రసన్న వదనుడై, ఎర్రని కనులతో, సనత్కుమారాది సిద్ధులు సేవిస్తూ ఉండే అనంతపద్మనాభుని దర్శంచాలన్న ఆకాంక్ష ఉన్న చిత్రకేతువు కు నారదుడు సంకర్షణ మంత్రాన్ని ఉపదేశించాడట. ఆ సంకర్షణ మంత్రాన్ని ఏకాగ్రచిత్తంతో చిత్రకేతువు జపించగా అనంతుడు పరమానంద పడి ఆ చిత్రకేతువుకు దర్శనం ఇచ్చాడట. ఆ అనంతపద్మనాభ స్వామిని చూచిన చిత్రకేతువు శరీరం పులకాంకురం అవగా కనులు భాష్పాలు రాల్చుతుండగా వణుకుతున్న చేతులెత్తి స్వామిని వేడుకుంటూ స్వామి నీ దర్శనం ఎన్ని జన్మల పూర్వపుణ్యమో అని స్తుతించగా అనంతుడు దివ్య విమానాన్ని, విద్యాధరలోకాధిపత్యాన్నిచిత్రకేతువును అనుగ్రహించాడు. ఆ అనంతుని మనమూ సేవిద్దాం. ఆ దివ్య పాదారవిందములను మనసున తలుద్దాం. తరిద్దాం.

- హనుమాయమ్మ