మంచి మాట

రఘువంశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘శ్రీ రాఘవం దశరధాత్మజ ............ నిశాక్షరకర వినాశకరం, నమామీ రామం’’-
రఘు వంశ రాజుల సద్గుణాలను కీర్తించకుండా ఉండలేక రఘు వంశ మహాకావ్యాన్ని తాను రచిస్తున్నానని కాళీదాసు మహాకవి పేర్కొన్నాడు. ఒక కాళీదాసే కాదు, ఏ కవి రాసినా రాముడిని రాముడిగా కీర్తిస్తే అతడికి తృప్తిగా ఉండకపోయేది. అందుకనే వాల్మీకి మహర్షి కూడా శ్రీరాఘవమని తన రామాయణంలో అక్కడక్కడా చెబుతుండేవాడు. రాముడికి కూడా రాఘవ రాముడంటే ఆనందించేవాడట, పరవశించేవాడట. రఘు కుల తిలకమని, రఘుకులేష్టుడని, వాల్మీకి మహర్షి కీర్తించేవాడు. రాముడికి తన వంశం తరువాత కన్నా తండ్రి దశరథ మహారాజంటే, అతడి పేరు చెబితే ఆనందించేవాడు, గౌరవించేవాడు. సీతా స్వయంవరం తరువాత గురువు విశ్వామిత్రుడు వివాహం జరిపిస్తానంటే, తన తండ్రి లేకుండా, అతని అనుమతి లేకుండా వివాహం చేసుకోనని చెబుతాడు. రాముడికి తన తండ్రి అంటే అంత గౌరవం, మర్యాద ఉండేది.
తండ్రి తరువాత రాముడికి సీతమ్మ అంటే ప్రీతి కనుక తండ్రి పేరు తరువాత సీతాపతిః అని చెబితే సంతోషించేవాడు. అనుకూల దాంపత్యమంటే సీతారాములది. వారి శరీరాలు వేరైనా మనసు ఒకటిగా ఉండేది. అందుకనే సీతమ్మ లంకలో రామునిని వదిలి అంతకాలమున్నది. జీవుడికి కూడా రామనామం ఉంటే ఒంటరిగానూ జీవించగలడు, ఏదైనా సాధించగలడు.
రాముడు తన గొప్ప ముందుగా చెప్పుకునేవాడు కాదు. ముందు తన వంశం, తరువాత తండ్రి, పిదప పత్ని పేరు కలిస్తేనే తన కీరికలిగిందని, అసలు శ్రీమద్రారామాయణాన్ని, సీతాయానం అంటేనే బాగుంటుందని అనుకున్నాడట వాల్మీకి మహర్షి. ఇటువంటి రాముడు తల్లీ తండ్రి, సోదరులు, భార్య, బంధుమిత్రుల, సృష్టి మొత్తాన్ని ప్రియంగా చూసే రాముడు రఘుకుల వంశానికి రత్నదీపమయినాడు, కీర్తి తెచ్చినాడు.
రత్నమంటేనే జిగేల్‌మని మెరిసే కాంతి గలది. అటువంటి రత్నదీపమయితే మరెంత వెలుగో చెప్పలేము. రఘువంశానికి అంత కీర్తిని, చెప్పుకునే సకల గుణాభిరాముడు శ్రీరామచంద్రుడు ధర్మమూర్తి. వంశం, కుటుంబ కీర్తి ప్రతిష్ఠలు చెప్పిన తరువాతనే తన రూప లావణ్యము, అవతార విశేషాలు చెబితే సంతోషించేవాడని, వాల్మీకి మహర్షి రామాయణం తెలియజేయుచున్నది. రామాయణమే కాదు, భాగవతం కూడా రఘు వంశాన్ని కీర్తించింది. ఆజానుబాహు అరవింద దళాయతాక్ష.... ఈ శ్లోకార్థ్భావన, మన భక్తికి పరాకాష్ఠ అవుతుంది.
రఘువంశరాజులు, రాజ్యపరిపాలనలో ప్రజలను కన్నబిడ్డలవలనే కాక పరిపాలన భగవదారాధనగా భావించేవారు. అందుకే శ్రీరామచంద్రుడు అరణ్యానికి వెళ్ళే ముందు ప్రజలు బారులు తీరి కన్నీరు మున్నీరై విలపించారట. తరువాతికాలంలో శ్రీరామచంద్రుడు, 11 వేల సంవత్సరాల కాలం భగవంతుని ఉపాసనా రూపంగా రాజ్యాన్ని పరిపాలించాడని, సంక్షిప్త రామాయణం తెలియజేయుచున్నది.
రఘువంశ రాజులు ప్రజలను, ప్రభువులుగా తమను ప్రజా సేవకులుగా భావించి పరిపాలించే వారు. అంతేతప్ప తాము ప్రభువులమని, అహంకారం ప్రజల ముందు ప్రదర్శించలేదు. రాముడు కూడా తన వంశ ప్రతిష్ఠలు నిలుపుకునే పద్ధతిలో రాజ్యం చేశాడు. కనుక రామరాజ్యం కావాలని కలలు కనేవారు. ప్రతి సభలోనూ ‘రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ఈశ్వర అల్లా తేరేనామ్’ అని ముందుమాటగా శ్రీరామకీర్తన చేసేవారు. నల్గురితో అనిపించేవారు. రామసారధి లేకుంటే స్వాతంత్య్ర ఫలాలు దక్కకపోయేది మనకు. రఘుపతి, సీతాపతి రామరాజ్యానికి సారధి అవుతేనే రామరాజ్య ఫలాలు, మనం కన్నకలలు సాఫల్యం అవుతాయ.
‘మేఘం లేకుండా వర్షం రాదు, సంకల్పం లేకుండా రామరాజ్యం రాదు’ రఘుపతి రాఘవ రాజారాం- అంటూనే మనందరమూ రామునిలాగా మనుగడ సాగింఛాలి. రావణాదులు(అధర్మం, అన్యాయం) ఎవరైనా ఎక్కడైనా కనపడితే రామునిలాగా విజృభించి అధర్మాన్ని కాలరాయాలి. ధర్మాన్ని పునఃస్థాపితం చేయాలి.

-జమలాపురం ప్రసాదరావు