మంచి మాట

గాయత్రీ మాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాయత్రీ మంత్రంలోని 24 బీజాక్షరాలు మానవుని, మనస్సును తనువును ప్రభావితం చేసి శాంతి, ఆనందం వ్యాప్తిచెంది, మంత్రోచ్చారణ వల్ల మనస్సు ఏకాగ్రత నొంది శరీరం స్థిరత్వాన్ని పొంది, ఇంద్రియాల శాంతపడి మనస్సు ఏకాగ్రత మవుతుంది. గాయత్రీ మంత్ర ఉపాసన వల్ల ఆత్మ బలం హెచ్చి సత్వగుణము దైవీ సంపద వృద్ధిచెంది మంత్ర జపసాధన వల్ల మానవుడిలో దాగివున్న దివ్య శక్తులన్నీ జాగృతమవుతాయి. మంత్రానికి ధ్యానం చాలా అవసరం. ప్రాణ, అపానవాయువును వశంలో ఉంచుకుంటేగాని సాధ్యం కాదు. ప్రాణాయామం చేయకుండా ధ్యానం సాధ్యంకాదు. ఈ ప్రాణాయాన సాధన వల్ల మూలాధార చక్రం జాగృతమై శక్తి, బుద్ధి వృద్ధిచెందుతాయి. ఇడ, పింగళ, సుషుమ్న నాడులతో పాటు ఊర్థ్వగతిని పొందుతారు. అభ్యాసం లో భృకుటి మధ్యలో ఉన్న ఆజ్ఞాచక్రం జాగృతమవుతుంది. దీనితో జ్ఞాపకశక్తి వృద్ధి చెంది మస్తిష్కంలో నిక్షిప్తమవుతుంది. గాయత్రీ మంత్రంలో స్తుతి, ప్రార్థన, ఉపాసన ముఖ్యమైన మూడు విధులు. మొదటి పాదంలో స్తుతి, రెండవపాదంలో ఉపాసన, మూడో పాదంలో ప్రార్థన ఉన్నది. అందుకే దీనిని మహామంత్రమన్నారు. గాయత్రీ మాతను భూలోక కామధేనువని, గాయత్రీ మంత్రాన్ని పఠించడం వల్ల ఉపాసకుడి కోరికలు నెరవేరుతాయని గాయత్రీ మంజరి లో పేర్కొనబడింది. గాయత్రి మంత్రం దివ్యమైన శక్తులను ప్రసాదించే అద్భుతమైన మంత్రరాజం.
గాయత్రీ తత్వం తెలిస్తే సమస్త వాఙ్మయ తత్త్వమూ తెలుస్తుంది. గాయత్రిని ఎరిగిన వాడు సమస్త భువనాల రూపంలో ఉన్న పరమాత్మని ఉపాసించినవాడు అవుతాడు. ఈ గాయత్రీయే సంధ్యారూపంలో అన్ని ప్రాణుల చేతనూ ఉపాసించబడుతూ ఉంది. ఈ విశ్వమంతా గాయత్రీ మంత్రరూపమే. గాయత్రీ మంత్ర ఉచ్చారణలో భగవంతుని గుణ గణాలను స్తుతిస్తారు. ఈ గాయత్రి మంత్రం ఉపాసనే రక్షకవచవౌతున్న సాధకుడికి, దివ్యశక్తిని పొందడానికి సర్వోత్తమైన మంత్రమని వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం మహాభారతం వచనం. గాయత్రీ మంత్రాన్ని జపించేవారిని అగ్ని కాల్చలేదని, అకాల మృత్యువు కబళించలేదని భగవానుడు చెప్పాడు. ఈ గాయత్రీ మంత్రాన్ని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో కాలాంతరంలో ధర్మభ్రష్టులై మహాపతనం లోకి చేరిపోతారు. గాయత్రీ మంత్ర స్మరణం వేద పఠన సదృశ్యమని యోగలు తెలిపిన ఎన్నో విషయాలు మనకు పురాణేతి హాసములలో కనబడుతాయి. గాయత్రీ మంత్రం సమస్త వేదాల సారం. ప్రతిపూజా కార్య అనుష్ఠానాల్లో గాయత్రీ మంత్ర ఉచ్చారణ ఉంటుంది. దైవిక సంధ్యావందనం లో సూర్య గాయత్రి మంత్రాన్ని జపించడం జరుగుతుంది. శివుడుపార్వతి తో ఉపాసించేది గాయత్రీ మాతనే అని చెప్పాడు.
ఓం భూర్భువః స్వః భర్గో దేవస్య ధీమహి
దియోయోనః ప్రచోదయాత్
అనే గాయత్రీ మంత్రం యజుర్వేదంలోని 35వ మంత్రం. ఓమ్ పరమాత్మ నామం భూః అన్నిటికీ ప్రాణాధారం కాగా , భవః అందరి దుఃఖాలను దూరం చేసేది. స్వః సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చేది తత్ అనగా ఆ పరమాత్మ సమిత్ జగత్తుకు తల్లిదండ్రులు. దేవస్య దేవుని యొక్క వరేణ్యం వరించే యోగ్యమైన శ్రేష్‌ఠమైన భర్గః శుద్ధ స్వరూపం ధీమహి ధ్యానం ధారణ యః సవితాదేవి పరమాత్మ నః మన యొక్క దియః బుద్ధుల ప్రచోదయాత్ మంచి పనులతో వుంచుకాక అని అర్థం. ఈ మహామంత్రాన్ని అర్థం చేసుకొని జపం చేయడం వల్ల బ్రహ్మపదం, ముక్తి లభిస్తాయని శాస్త్ర వచనం.
......................................

మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

- రసస్రవంతి కావ్యసుధ