మంచి మాట

అయ్యప్ప స్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరిహరసుతుడుగా పేరెన్నిక గన్న స్వామి అయ్యప్ప. కార్తికమాసారంభంలో అయ్యప్ప స్వామి దీక్ష ఆరంభవౌతుంది. స్వామి బ్రహ్మచర్యాదీక్షవ్రతుడు. స్వామి భక్తులంతా కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తూ మండలం రోజులు దీక్ష వహించి నేలమీద పడుకుంటూ స్వామిని మూడు వేళలా అర్చిస్తూ సదా అయ్యప్పనామాన్ని అనుసంధానిస్తూ పరులలలో పరమాత్మను చూస్తూ కాలాన్ని గడుపుతారు. ఇట్లాంటి వారంతా స్వామికి అనురూపులే. కనుకనే వారిని ఇతరులంతా స్వామి అన్న నామంతోనే సంబోధన చేస్తుంటారు.
ముఖ్యంగా ఈ స్వామి దీక్ష తీసుకొనేటపుడు దేవాలయానికి వెళ్లి నా అంతకు ముందుగా దీక్ష తీసుకుని ఆచరిస్తూన్న గురువును ఆలంబన చేసుకొంటారు. ఆ గురుస్వామి చెప్పిన దీక్షాపద్ధతులను కొత్తవారు ఆచరిస్తారు. స్వామి దీక్షను ఇంతకు ముందు ఆచరించినప్పటికీ కూడా గురుస్వామి అనేవారిదగ్గరే దీక్షారంభం చేస్తారు. ఈ పద్ధతిలో త్రిమూర్తులకన్నా గొప్ప వాడైనా సద్గురువు ఆవశ్యకత తెలుస్తుంది.
దీక్షాదారులంతా తులసిమాల కాని రుద్రాక్షమాలను కానీ ధరిస్తారు. మాలకు అయ్యప్ప స్వామి ముద్ర వున్న లాకెట్టును కూడా ధరిస్తారు. దీనే్న ముద్రమాలగా చెప్తారు.
దీక్షా వస్త్రాలను ధరిస్తారు. ఎక్కువగా శనికి ప్రతిరూపంగా భావించే నలుపు రంగు బట్టలను వాడుతారు. కొందరు కాషాయరంగును కూడా ధరిస్తుంటారు. చన్నీటి స్నానం చందనకుంకుమలను ధరించడం, అయ్యప్ప స్వామికి పూజ చేయడం ఏకభుక్తం ఉండడం మొదలగువన్నీ దీక్షతీసుకొన్నవారి నిత్యకృత్యాలుగా ఉంటాయ. ఆ తరువాత సాయంత్రం పూట స్వామి భక్తులంతా కలసి భజన చేస్తూ శరణు అంటూ స్వామికి పూజచేస్తారు.
మద్యమాంసాలకు, దురలవాట్లకు దూరంగా ఉంటారు. వ్యర్థ ప్రసంగాలు చేయరు. కేవలం భగవంతుని కథలను అందరూ కలసి చెప్పుకుంటుంటారు. దుష్ట ఆలోచనలను రానివ్వరు. నిత్య భగవంతుని నామాన్ని పలుకుతుండడం వల్ల వారిలో స్వార్థ బుద్ధి విడనాడుతుంది. సమబుద్ధి అలవడుతుంది. తన సాటి వారిలో పరమాత్మను చూడగలిగే నేర్పును నేర్చుకుంటారు.
తత్వమసి సిద్ధాంతమే అయ్యప్ప దీక్షకు పట్టుకొమ్మ. తనలో అయ్యప్పస్వామిని చూసుకొని ఎదుటివారిలో కూడా స్వామివారి రూపాన్ని దర్శించకలగడమే ఈ దీక్ష ప్రత్యేకత. సదా స్వామి శరణం అంటూ ఎదుటివారిని రెండు చేతులు జోడించి నమస్కరిస్తారు.
స్వామి అన్నదాన ప్రభువు కనుక స్వామివారి పేరు మీద అన్నదానం చేస్తుండడం కూడా దీక్ష లో భాగమే. మాల ధరించి దీక్ష చేసేవారిలో పురుషులను అయ్యప్పలని, స్వాములని పిలుస్తారు. బాలికలను కుచ్చుమాలికాపురాలని, స్ర్తిలను మాలికాపురమ్మ లేక మాతగా సంభోదిస్తారు. పనె్నండేళ్ళలోపు బాలురను మణికంఠులని పిలుస్తారు.
దీక్షా సమయంలో అబ్బిన సదాచారం వల్ల పెద్దల పట్ల గౌరవాదులు పెరుగుతాయ. పిన్నల పట్ల ఆదరాభిమానాలు వృద్ధి అవుతాయ.
కనుక ఆ సత్వగుణాలు సజ్జన మిత్రత్వమూ జీవితాంతం ఉండాలని స్వామిని కోరుకుంటారు దీక్షాతీసుకొన్న భక్తులు. దీక్ష తీసుకొన్నవారిని కూడా ఇతరులు స్వామికి మారుగా తలవడం మంచింది. వారితో స్నేహతత్వాన్ని కలిగిఉండాలి కాని వారిని ఎగతాళి చేయడం కూడదు. హరిహర భేదనాశకుడైన అయ్యప్పను శివకేశవభక్తులిరువురు సేవిస్తారు. నిర్గుణుడు, నిరంజనుడు, నిస్సంగుడు అయన భగవంతుడు కోరిన రూపంతో దర్శనవిస్తారు. భగవంతుని తత్వాన్ని ఎరిగి తాము కూడా భగవంతునికి మారుపేరుగా వ్యవహరిస్తారు భక్తులు. అందుకే భగవంతునికి భక్తునికీ అభేదం అంటారు పండితులు.

- సాయ మణికంఠ