మంచి మాట

సత్యమేవ జయతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలు తెలియక తప్పు చేసినా, అబద్ధాలు ఆడినా వారిని తల్లిదండ్రులు సమర్థించకూడదు. ఒక తప్పు చేస్తే మందలించాలి, మళ్లీ అలాంటి తప్పు చేస్తే శిక్షించాలి, దండించాలి. పిల్లలకు పసిప్రాయంలోనే నైతిక విలువల గురించి చెప్పాలి. సత్యమే మాట్లాడమని, అబద్ధం చెప్తే అనర్థాలు జరుగుతాయని, మంచి పనులు చేయాలని బోధించాలి. ఇది తల్లి తండ్రుల బాధ్యత.
నీతి, నిజాయితీలకు కట్టుబడిన వారి జీవితాలు కష్టాల కాణాచి అని, సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటే సుఖాలకు దూరమవుతామని సర్వసాధారణంగా అందరూ అనుకుంటారు. సత్యమార్గంలో నడవడం ముళ్ళబాటమీద నడవడంతో సమానమని ఎవరైన అంటే, వారితో మనం విభేదించలేము. రోగికి కొన్ని పథ్యాలుంటాయి. జిహ్వకు రుచిగా ఉంటాయని వైద్యుడు వర్జించినవి తింటే రోగం ముదురుతుంది. అలాగే ఆదిలో కష్టాలున్నా సత్యమార్గం వదలరాదు. తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి ధర్మపథం తప్పి, నైతిక విలువలకు తిలోదకాలుఇవ్వకూడదు. సత్యాన్ని ఆశ్రయించిన వారికి ప్రారంభ దశలో కష్టాలు రావచ్చు. వాటిని ఎదుర్కొనే సాహసం అలవరచుకోవాలి. సత్యవర్తనులనే విజయం వరిస్తుంది. సచ్చీలం కలవారే శాశ్వతానందం పొందడానికి అర్హులు. సచ్చీలురైనవారికే కీర్తిప్రతిష్ఠలు, భోగభాగ్యాలు, సుఖశాంతులు శాశ్వతంగా లభిస్తాయి.
కపటవర్తనులు, అధర్మపరులు, అసత్య మార్గావలంబులు తీరని కడగండ్లకు పాలవుతారు. వాటిలో సుఖం ఉండదనుకుంటారు కాని అవన్నీ క్షణిక సుఖాలు దుఃఖాలకు హేతువు లవుతాయి. దుర్యోధనుడు అధర్మమార్గాన్ని ఎంచుకోవటంవలననే కురు వంశం నాశనమైంది. ప్రాణం పోయినా సరే మాట తప్పరాదు అన్న శ్రీరాముడు ప్రజలహృదయాల్లో ఉండిపోయాడు.
మరొక సంఘటన- ‘‘అన్యాయాన్ని ఎదుర్కొనడానికి నీవు ఏనాడూ వెనుకాడవద్దు’’ అని నరేంద్ర దత్తుతో అతని తల్లి భువనేశ్వరీదేవి చిన్నతనంలో అంటుంది. నరేంద్రుడా వ్రతాన్ని తన జీవితంలో తు.చ. తప్పక పాటించాడు. తరువాత శ్రీరామకృష్ణ పరమహంస శిష్యరికంలో జగన్మాతను తన కళ్ళతో దర్శించాడు. విశ్వమత సమ్మేళనంలో భారతీయ కీర్తిని పతాక స్థాయికి తీసుకువెళ్ళాడు. ఆ బాల నరేంద్రుడే స్వామి వివేకానంద అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.
మొక్కై వంగనిది మ్రానై వంగదంటారు. బాల్యంనుంచి కౌమార దశకు చేరిన పిల్లలకు తల్లిదండ్రులు ఎన్ని హితబోధలు చేసినా అవి వారి బుర్రకెక్కవు. అందువలన పసిప్రాయంలోనే పిల్లలకు నైతిక విలువలు బోధించే బాధ్యత తల్లిదండ్రులది. ప్రతి ఇల్లూ ఒక పాఠశాల కావాలి. నైతిక మూల్యాలను ఆ పాఠశాలలో తల్లి పిల్లలకు నేర్పాలి. నేడు సమాజంలో పలు దుర్మార్గ్గులను చూస్తున్నాం. హింస, హత్యలు, స్ర్తిలను బాధించడం, అవినీతి, మోసం, స్వార్థం మొదలుగా గలవి. మొక్క దశలో పిల్లలను తీర్చిదిద్దకపోవడంవలననే ఈ విశృంఖలత సమాజంలో చోటుచేసుకుంది. భావితరాలవారిని సన్మార్గంలో నడిపే గురుతరమైన బాధ్యత తల్లిదండ్రులదే.
నేటి బాలలే రేపటి పౌరులు. కనుక నేడు మంచిని నేర్చుకుంటే నీతివిలువను తెలుసుకుంటే అవినీతికి దూరంగా ఉంటారు. అన్యాయం వల్ల బాధపడే వారిని చూచి వారి కడగండ్లను తెలుసుకొంటే అన్యాయం చేయడానికి వెనుకాడుతారు. సత్యధర్మాల విలువ తెలుసుకొని అవి ఆచరించిన వారి జీవితాలను పరిచయం చేస్తే ఈబాలలే భారత దేశకీర్తిని పెంచే వారిగా ఎదుగుతారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని తెలుసుకొంటారు. ఉజ్వలమైన కీర్తిని ఆర్జిస్తూ సుసంస్కారులుగా వినయం మూర్త్భీవించిన వారుగా రాణింపుకు వస్తారు. దీని నంతా నేర్పించవలసిన బాధ్యతను నేటి తల్లితండ్రులు గురువులు తలకెత్తుకొనవలసి ఉంటుంది. బాధ్యత సక్రమంగా నెరవేరిస్తే రేపటి బంగారు పంటను చూడవచ్చు.నేడు పుచ్చుల్లేని విత్తనాలు నాటితే అధిక ఫలసాయానిచ్చే పంట పొందుతాం కదా.

-గుమ్మా ప్రసాదరావు