మంచి మాట

అంతరార్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపావళి పండుగ అటు దేవతలకు, ఇటు పితృదేవతలకు విశేషించి మానవులకు భగవద్భక్తులకూ ఆనందాన్ని కల్గించి సదాశయజ్యోతులు నింపి, ‘ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ’ అనే మన సనాతన భారతీయ సిద్ధాంతాన్ని కార్యరూపంలో నిరూపించే పండుగ దీపావళి.కేవలం టపాసులు కాల్చడం దీపాలు వెలిగించడం అనేది ఒక కార్య క్రమంగా కాక భక్తితో అంతరార్థాన్ని తెలుసుకొని చేస్తే ఆ పండుగలోని పరమార్ధం తెలుస్తుంది. మన భారతీయ సంప్రదాయం సనాతన ధర్మం కలసి ఉంటే కలదు సుఖం అని చెప్తుంది. రాక్షసుల్లోనూ వారి అహంకారం వల్ల దుర్గుణాలు వచ్చాయని అంటుంది. ఆ అహంకారాన్ని నాశనమొనరిస్తే చాలు వారు కూడా మంచివారు అవుతారనేది మన ధర్మం చెప్పే మాట.
ఎంతో మంది రాక్షసుల కథలు కూడా ఇదే అర్థాన్ని ఇస్తున్నాయ. రావణాసురుడు లాంటి వారు సైతం కైలాసవాసుని భక్తులే. వారు భగవంతుణ్ణి మరెవరూ పూజించనంత తీవ్రంగా పూజిస్తారు. కర్ణకఠోరమైన తపస్సు లు ఆచరించి భగవంతుణ్ణి మెప్పించి వరాలను పొందినవారే. కాని ఆ భగవంతునిమాయకు చిక్కుకుని ఇంద్రియాలలౌల్యం లోపడి తామే అధికులమని విర్రవీగి తిరిగి ఆ భగవంతుని చేతిలోనే మోక్షాన్ని పొందారు. కనుక రాక్షసులు సైతం భగవద్భక్తులుగా మనకు కనిపిస్తారు. మనభారతీయం అందుకే సర్వేజనా సుఖినోభవన్తు అన మంటుంది. ప్రతివారు సుఖసంతోషాలతో ఉంటే ఇక ఒకరిపై ఒకరికి ఆధిపత్యం చేయాలన్న కాంక్ష ఉండదు. కొన్ని చోట్ల ఇంద్రియాలకు బానిసలైనవారు ఆధిపత్యం కోసం ఆరాటపడి వారితో వీరితో గొడవలు తెచ్చుకుంటారు. కాని చివరకు వారిలో చైతన్యం వచ్చి అందరిలోను పరమాత్మ అంశ ఉన్నదన్న సత్యాన్ని తెలుసుకొని వారు కూడా సజ్జనులుగా మారుతారు. భగవద్గీతలో భగవానుడు స్వయంగా సర్వమూ తానే అని గ్రహించినవారికి తనకు భేదము ఏమాత్రం లేదని చెప్పాడు. తనను నమ్మినా అన్నింటికీ కార్యాకారణుడను నేనని ఎవరు తెలుసుకుని ప్రవర్తిస్తారో ఎవరు ప్రతి పనిని ఈశ్వరార్పణం చేస్తారో వారికి నేను వారు కోరకున్నా వారికి తోడునీడగా ఉంటానని చెప్పాడు. కర్తవ్యపాలన చేస్తే చాలన్నాడు. పనినే భగవంతుడని నమ్మి ఎవరి బాధ్యతలను వారు నిర్వర్తిస్తూ భగవానుని గూర్చి తలవకపోయనా ఆ పనేభగవంతుడు కనుక వారికీ చేదోడు వాదోడుగా ఉంటాడు. వారిని కంటికి రెప్పగా చూసుకుంటాడు భగవానుడు. గర్వం అహంకారం ఎవరికి ఉన్నా పరమాత్మ వాటిని సహించడు. ఆ గర్వోన్నతిని త్రుంచివేయకుండా మానడు. ఒకసారి నారదుడు తానే అందరికన్నా విష్ణునామసంకీర్తన చేయడంలో మేటి ననుకొంటాడు కనుక భగవంతునికి ఇష్టమైన వారిలో నేను అగ్రశ్రేణిలో ఉన్నానని అనుకొంటాడు. కాని భగవంతుడు ఓ కట్టెలు కొట్టుకొని జీవించేవాని దినచర్యను నారదుణ్ణి చూసి రమ్మంటాడు. ఆ కట్టెలమ్ముకునే వ్యక్తి తాను నిద్రలేవగానే ఓ భగవంతుడా నీవే దిక్కు నీవు తప్ప నాకు ఇతఃపరంబెరుగనయ్యా కాపాడి రక్షించు తండ్రీ అని నమస్కారం చేసి నిత్యకృత్యంలోకి వెళ్తాడు.
అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని మోపులు కట్టి నెత్తిపై పెట్టుకుని నారాయణా అని అనుకొంటూ అంగడి బయలుదేరుతాడు. ఆ కట్టెలను అంగడి వానికి వేసి నారాయణా అని దుమ్ము దులుపుకుని ఆ అంగడివాడు డబ్బులిస్తే నారాయణా అని తీసుకొని దినవెచ్చాలు తీసుకొని ఇంటికి వచ్చి ఇల్లాలికిచ్చి ఆమె వండి పెట్టిన దాన్ని తిని నారాయణా ఈ రోజు గడిపావయ్యా ఇక మీద భారమూ నీదే సుమా అని సుఖనిద్రలోకి జారుకున్నాడట. ఈ దినచర్యలోని గొప్పతనం అర్థం కాక నారదుడు నారాయణుని దగ్గరకు వెళ్లి మహానుభావా నేను నిరంతరమూ నీ నామాన్ని మరువక జపిస్తాను కదా.. అనవసరంగా నన్ను వానిని చూసి రమ్మని పంపావు... అతని నడతలో ఏవిశేషమూ నాకు కనిపించలేదు.. కాని నేను నీ నామాన్ని జపించడంలో ఒకరోజు వృథా చేసుకొన్నాను అని వాపోయాడట. నారాయణుడు నవ్వి నారదా నీవే కదా మరవక నా నామాన్ని జపిస్తానని అన్నావు.. ఎలా మరిచితివి.. అని అడుగుతూ ఏ పనిలో ఉన్నా నా నామాన్ని ఆ కట్టెలమ్ముకునేవాడు మరిచాడటయ్యా అని అడిగాడు. విషయం అర్థం అయన నారదుడు తన అహంకారాన్ని త్యజించి నా తప్పును కాచమని నారాయణుణ్ణే వేడుకున్నాడు. ఇక మనమూ భగవంతుని నామాన్ని జపిద్దాం..

- సాయకృష్ణ