మంచి మాట

తులసీవివాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తిక ఏకాదశినాడు మేల్కాంచిన మహావిష్ణువు ద్వాదశినాడు బృందావనానికి విహారానికి వస్తాడు. తన భక్తితో మహావిష్ణువే మెప్పించిన తులసి ఆరోజు విష్ణుమూర్తిని చూచి సంతోషతరంగిణి అవుతుంది. మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది తులసి. తులసితో చేసే పూజ మహావిష్ణువును సంపీత్రిని చేయడమేకాక కోరిన కోరికలను ఈడేర్చట్టు చేస్తుంది. తులసిలో సర్వదేవతలు కూడి ఉంటారంటారు
పురాణాల్లో జలంధురుని భార్య తులసి. కాలనేమి కూతురు ఈమె. ఈమెను బృందగా వ్యవహరించేవారు. జలంధరుడు ముల్లోకాలకు బాధించే రాక్షసుడు.. ఓ సారి మహావిష్ణువు జలంధరుణ్ణి సంహరించడం కోసం తానే స్వయంగా రావల్సి వస్తుంది. దీనికి కారణం ఏమిటి అంటే కాలనేమి కూతురుగా ఉన్న బృంధ పాతివ్రత్య మహిమవల్ల జలంధురునికి ఎక్కడైనా విజయమే తటస్థించేది. ఆ బృంద పాతివ్రత్యాన్ని మహావిష్ణువే ఆటంకం కలిగించాడట. దానితో ఆమె మహావిష్ణువుపై కోపం తెచ్చుకుంది. భార్యా వియోగునివై సంచరించు అని మహావిష్ణువునే శపించిందట. అందువల్లనే మహావిష్ణువు రామునిగా అవతరించినపుడు సీతావియోగాన్ని పొందాడని అంటారు. బృందకు పాతివ్రతభంగ కారణంగా మహావిష్ణువు చేతిలో జలంధరుడు సంహరించ బడ్డాడు.
మరొకకథనం ప్రకారం తులసి శంఖచూడుని ఇల్లాలు. ఇక్కడ కూడా ఆ తల్లి పాతివ్రత్య కారణంగానే శంఖచూడుడు ఎల్లవేళలా జయశంఖం పూరించేవాడు. శంఖచూడునికి బ్రహ్మ వరముంది. దానితో ఆ శంఖచూడుడు వరగర్వియై అందరినీ హింసించేవాడు. ధర్మమూర్తి అయన మహావిష్ణువు శంఖచూడుని పరిమార్చాలని అనుకొన్నాడు. మహావిష్ణువు శంఖచూడుని రూపంలో తులసి దగ్గరకు రాగా ఆమె తన భర్త నే అనుకొని శ్రీహరిని సేవించిందట. దానివల్ల శంఖచూడుడు శ్రీహరి చేతిలో మరణించాడు. కాని వచ్చినది శంఖచూడుడు కాదని శ్రీ మహావిష్ణువే నని తెలుసుకొన్న తులసి మహావిష్ణువునే రాయిని కమ్మనమని శపించింది. కాని ముల్లోకాలను బాధించే అసురుణ్ణి నిర్మూలించడం తన పని అని శ్రీ మహావిష్ణువు చెప్పగా ఆమె విషయం తెలుసుకొని అమితంగా బాధపడిందట.
అపుడు ఆమెను మహావిష్ణువు అనుగ్రహించి నీ వు లక్ష్మీదేవితో సమానంగా పూజించబడుతావని వరాన్నిచ్చాడు. ఆమె శరీరం గండకీ నదియై ప్రవహిస్తుందని వరమిచ్చాడు. అలాగే ఆమె కేశము తులసిగా జన్మిస్తుందని, తులసి దళాలు, తులసి విష్ణుప్రీతికరాలవుతాయని వరమిచ్చాడు. అలాగే ఆమె శాపాన్ననుసరించి శిలనై సాలగ్రామరూపాన ఉన్న తనను లక్ష్మీనారాయణాది రూపాలలో ఉంటానని, తులసిని శంఖము, సాలగ్రామమును కూర్చి పూజిస్తే సర్వశ్రేయాలు కలుగుతాయని వరమిచ్చాడు. ఈ కార్తిక ద్వాదశిన లక్ష్మీ స్వరూపమైన తులసిని, విష్ణు స్వరూపమైన ఉసిరిక దగ్గరచేర్చి తులిసీ వివాహాన్ని జరిపిస్తారు. తులసి దగ్గర ఐదు పద్మాలను రచించి ఐదు దీపాలను పెట్తారు. ఉసిరిక దీపాలను వెలిగిస్తారు. మున్నాటఅరవై వత్తులను తులసి కోటముందు వెలిగించినా కార్తిక మాస పుణ్యాన్ని పొందవచ్చు.
తులసి ముందు దీపదానం ఎంతో పుణ్యప్రదం. తులసి పూజ వల్ల మాంగళ్య వృద్ధి, పుత్ర పౌత్రులు, సర్వసౌఖ్యాలు కలుగుతాయని, పూర్వజన్మ పాపాలు కూడా నివారింపబడతాయని తులసి మహిమను నారదుడు శ్రీకృష్ణుడికివివరించాడని దానివల్ల తులసీ వ్రతాన్ని ద్వాపరంలోనే సత్యాకృష్ణులు రుక్మిణీకృష్ణులు ఆచరించాని పురాణాలు చెబుతున్నాయ.
తులసిని పూజించిన ఇంట సిరులకు నెలవు అవుతుందని పురాణోక్తి. శ్రీకృష్ణుని ధర్మపత్ని రుక్మిణీ దేవి చేత ప్రతినిత్యమూ తులసి పూజలందుకునేది. అట్లాంటి తులసి వల్లనే సత్యభామ అహంకారాన్ని దూరం చేసుకోగలిగింది. పండరినాథుని తన నాథునిగా చేసుకోవడానికి గోదాదేవి ప్రతిరోజు తులసి మాలలు కట్టి రంగనికి పంపేదని గోదాపురాణం చెబుతుంది. చివరకు గోదాదేవి పండరినాథునికి ఇల్లాలైంది.

- సాయిశ్రీ