మంచి మాట

భక్తియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌపీనం పెట్టుకుని లేదా కాషాయం కట్టుకుని కమండలం పట్టుకున్న ప్రతివాడు యోగి కాడు. పైగా సర్వసంగ పరిత్యాగి అసలే కాలేడు. సమస్త సుఖములు రాజభోగములు అందుబాటులో ఉన్నప్పటికి వాటిని త్యజించినవాడు విరాగి కాగలడు ఏమో కాని ఎప్పటికీ యోగి కాలేడు. యోగి తత్వం వంటబట్టించుకొనుట అనుకున్నంత సులభంగాదు. ఏది సత్యం ఏది మిధ్య, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అను విషయముల మధ్య అంతరం తెలుసుకొని వాటిపై అవగాసన కలిగినవాడే నిజమైన యోగి. శాంతముతో కూడిన చిత్తము, స్థితప్రజ్ఞతతో నిండిన మానసిక పరిపక్వత, నిశ్చిత అభిప్రాయములు అనేవి యోగికి పెట్టని ఆభరణములు.
మహాకవి తులసీదాసు ప్రకారం యోగి యొక్క స్థాయి మూడు రకములని తన రామచరిత మానస్‌నందు సవివరంగా తెలిపి యున్నాడు.- ఒక పర్యాయం జాంబవంతుడు శ్రీరామచంద్ర ప్రభువుని చేరి ‘‘ప్రభూ వానర వీరులందరు మహా నైపుణ్యంతో సముద్రంపై వారధి నిర్మించినారు. ఊహించినటువంటి స్థాయిలో వారధి వెడల్పు రాలేదు. ఒకే పర్యాయం ఇద్దరు ముగ్గురు కన్నా ఎక్కువ పట్టే వెడల్పు లేదు అని విన్నవించెను. జాంబవంతుని మాటలు ఆలకించినవంటి శ్రీరామచంద్రులవారు ‘‘పద జాంబవంతా పద, ఒకసారి మనం పరిశీలించి వద్దాము’’ అనగా జాంబవంతులవారు ముందు శ్రీరాముడు నడిచి వెళుతూ ఉండగా వెనుక తాను బయలుదేరి వెళ్ళెను. శ్రీరామచంద్రులవారు సముద్రము చెంతకు చేరి వారధిని ఒక పర్యాయము నిశితంగా పరిశీలించి వారధిపై అడుగిడెను. రామపాదం వారధిపై కనబడగానే వారధికి ఇరువైపులా చిన్న సంచలనం ప్రారంభమయింది. వారధికి రెండు వైపుల వేలెడంత జలచరమునుండి యోజనములు వ్యాపించి ఉంటే జలచరములు సముద్రము పైకివచ్చి దివ్య మంగళ స్వరూపుని తదేకంగా చూస్తూ తమలో తాము తన్మయం చెందసాగాయి. రెప్ప మూస్తే ఆ మంగళ స్వరూపుడు మాయమగుతాడు ఏమో అని ఆ జీవులు రెప్ప వేయటం కూడా మరచి తదేకంగా చూడసాగాయి.
వారథి మొదలునుండి అంతము వరకు జలచరములు అవకాశం కోసం ప్రతీక్షించసాగాయి. పరిస్థితిని గమనించిన జాంబవంతుడు స్వామి ఈ జలచరములు కేవలం మిమ్ములను దర్శించడానికిమామ్రే వచ్చాయి ప్రభూ. ఇవి మీకు సహాయం చేయగల స్థితిలో ఉన్నాయని నేను భావించటంలేదు. ఏ ఒక్క వానరుడు వీటి మీద ఆధారంగా సముద్రము దాటలేవు అని సవినయంగా విన్నవించెను. అపుడు శ్రీరామచంద్రుడు జాంబవంతునితో నాయనా ఒక రాయి తెచ్చి ఈ జలచరములమీద వేసి చూడు అనగా జాంబవంతుడు అట్లే చేసెను. పెద్ద బండరాయనివేసినా జలచరములలో ఎటువంటి కదలిక లేదు. జాంబవంతునికి రాముడిపై జలచరములకుగల అనన్య భక్తి విశ్వాసములు ఎంతో ఆశ్చర్యమును కలిగించాయి. శ్రీరాముల వారి లంక ప్రయాణం ప్రారంభమయినది. వానర వీరులందరూ రావణుని పీచమణచుటకు లంకకు బయలుదేరారు. వానరులంతా దేవతా స్వరూపులే, రామభక్తులే. కొందరు ఆకాశ మార్గమున లంకకు చేరినారు. మరికొందరు వారధి గుండా లంక చేరినారు. మరికొందరు తాము ఎటువైపు నడుస్తున్నామని గమనించక జలచరములమీద అడుగులు వేస్తూ లంకకు చేరుకున్నారు. ఆకాశ మార్గము గుండా లంకకు చేరినవారు జ్ఞానయోగులు. చేసేది లోకహితమని భావించినపుడు వీరు ఎంతటి త్యాగమునకైనా సిద్ధపడతారు. వారధి మీద నడుస్తూ లంకకు చేరినవారు కర్మ యోగులు. వీరు కర్మ సిద్ధాంతమును నమ్మి ఆచరిస్తారు. ఇక జలచరముల మీద నడచినవారు భక్తియోగులు. వీరికి భక్తి చింతన అధికం. శరీరం వసతి గృహం, ఆత్మ శాశ్వతమని ప్రగాఢముగా నమ్ముతారు. వీరు తమ గురించి ఆలోచించక అన్నింటా భగవంతుడు కలడు అని నమ్ముతారు. నాది నేను అనే భావనను సంపూర్తిగా మరచి అంతా భగవంతుడే అని నమ్మి దుఃఖ నివృత్తికై అహోరాత్రులు కృషి చేసే మునులు వీరు. ఇంతటి విశదీకరణ చేసిన తులసీదాసుకు ఎప్పటికీ కృతజ్ఞులమే.

- వేదగిరి రామకృష్ణ