మంచి మాట

ఆదిగురువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సద్గురువు శ్రీదత్తాత్రేయుడు. గురువుల్లోకెల్లా ఉత్తమగురువు విశిష్టగురువు మూర్త్భీవించిన పరమాత్మస్వరూపం. నేటిదాకా వినవచ్చే గురు పరంపర అంతయు దత్తాత్రేయ అంశయే. గురుస్థానములన్నియు దత్త స్థానమలే అని చెప్తుంటారు. మనుష్యులందరూ ఎవరికి వారు వేరువేరు గురువులనుకొంటూ వారికినమస్కారం చేసినా అవి అన్నీ కూడా- నదులన్నీ ఎలాగైతే సముద్రాన్ని చేరుతాయో, వివిధ దేవతా స్వరూపాలను పూజించినా ఆ పూజలన్నీ ఎట్లాగైతే పరమాత్మకు చేరుకుంటాయో అదేవిధంగాఆయాగురువులకుచేసేనమస్కారాలన్నీకూడా దత్తాత్రేయునికేచెందుతాయ.
మానవునికి విచక్షణావివేకజ్ఞానములను భగవంతుడు కల్పించాడు. చేయంచేవాడు భగవంతుడే అయనను ఏ పని చేయాలి ఏ పని చేయకూడదన్న వివేకాన్ని తారతమ్యా లను కనుగొనటానికి బుద్ధి అనే మహాద్భుత లక్షణాన్ని భగవంతుడు మానవులకు కూర్చాడు. అందువల్లనే నేను ఎవరు అన్న ప్రశ్నను తనకు తాను వేసుకొంటూ అంతర్ముఖుడై భగవంతునికోసం అనే్వషిస్తుంటాడు. ఆ అనే్వషణలో భగవంతుడిని భావాత్మకుడని తెలుసుకొంటాడు.
ఆ భగవంతుణ్ణి సునాయాసంగా తాను ఎంచుకున్న రూపంలో చూడడానికి గురువును మార్గదర్శిగా చేసుకుంటారు త్రిమూర్తులకన్నా శక్తి స్వరూపుడు కనుక ఒక్క గురువును ప్రసన్నం చేసుకొంటే ఆ గురువే మనకు త్రిమూర్తులను దర్శింపచేస్తాడు. అందుకే గురు లక్షణాన్ని శిష్యుడు ప్రతి పదార్థంలోనూ చూచేనేర్పును కలిగి ఉండాలని దత్తాత్రేయుని భావన. అందుకే పృధివి, వాయువు, ఆకాశము, జలము, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, పావురము, కొండచిలువ, సముద్రము, మిడత, తేనెటీగ, తేనె సేకరించువాడు, ఏనుగు, జింక, చేప, వేశ్య, లకుముకిపిట్ట, బాలుడు, కుమారి, బాణాకారుడు, సర్పము, సాలెపురుగు, కందిరీగ అను ఈ 24 మంది గురువుల వద్ద నుంచి తాను ఎట్లా జ్ఞానామృతాన్ని గ్రోలాడో చెప్పాడు. అద్దాని వల్లే అవధూత అయనట్టుగా కూడా చెప్పాడు. మానవుడు భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రతి వస్తువు అవస్తువు కూడా గురుస్వరూపాలే అనే అంతరార్థాన్ని గ్రహించాలి.
ఈ లోకంలోని మానవకోటిలో ఇద్దరే ఇద్దరు - అనె్నం పునె్నం ఎరుగని చీకుచింతా లేని చిన్నారి బాలుడు, వీనితో పాటు గుణాతీత స్థితిని పొందిన పురుషుడు వీరిద్దరూ కూడా ఏచింతలేకుండా ఆనందమనస్కులై పరమానందాన్ని సదా పొందుతుంటారంటారు పెద్దలు. ఇలాంటి పరమానందాన్ని మనమందరం పొందాలంటే భగవంతుణ్ణి భావాత్మకుడుగా గుర్తించాలి.
మన భావనల్లో భగవంతుడు రూపుదిద్దుకుంటాడు. ఆ భగవంతుడే భావః అన్న కీర్తిపొందినవాడు. భావననే భగవంతుడు కనుక ఆ భగవంతుడు సహస్రశీర్షుడైనాడు. సహస్రనామధారుడైనాడు. సహస్రవదనుడు అయ్యాడు. ఈవిషయానే్న బ్రహ్మ శ్రీకృష్ణుని పరీక్షిద్దామని వెళ్లి తెలుసుకొన్న నిజం. యశోదమ్మదగ్గర ఉన్న గోపాలుడు పరమాత్మ అని నారదుడు చెపితే పరీక్షించాలని బ్రహ్మ వెళ్లి ఆవులుకాసే గోపాలురును, గోవులను మాయంచేశాడు. ఇదితెలుసుకొన్న శ్రీకృష్ణుడు గోవులుగాను, గోపాలురుగాను తానే మారి గోపజనాన్ని కాపాడాడు కృష్ణుడు. అలా ఓ సంవత్సరకాలం గడిచింది. తిరిగి తాను మాయచేసిన గోవులు, గోపాలురు ఇక్కడే ఉన్నాయ మరి అక్కడ ఏమిజరుగుతోందో అన్న ఆత్రుతతో బ్రహ్మ చూస్తే అక్కడా గోవులున్నాయ గోపాలురూ ఉన్నారు. ఆ హా శ్రీకృష్ణుడే పరమాత్మ అన్న నిశ్చంత బ్రహ్మకు తెలిసిందట. ఆ భావాత్మకుడైన భగవానుని తెలుసుకోవడంలో జాప్యం బ్రహ్మకే కలిగితే ఇక మానవ మాత్రులెంత? కనుక ఎప్పటికప్పుడు శ్రీకృష్ణుని కథలను వింటూ ఉండాలి. భగవంతుని లీలలను తెలుసుకోవాలి. అపుడు మానవుల్లో భగవానుడు కల్పించిన బుద్ధి ప్రచోదనలు కలిగి మానవుడు దివ్యుడై పరమాత్మ వైపుకు తిరిగిన బుద్ధిని పక్కకు తొలగనీయడు. కనుక సదా భగవంతుని రమ్యమైన కథలను వినడానికి ఆసక్తిని కలిగించుకోవాలి .

- నాగలక్ష్మి