మంచి మాట

గీతాబోధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవద్గీతను అవగాహన చేసుకొంటే సులభంగా ఈ భవసాగరాన్ని ఈదవచ్చు. భగవద్గీతను పఠిస్తే చాలు సగుణాకార పూజనుంచి నిర్గుణపూజ విధానానికి మారుతారు. ప్రతి రోజు అతిశ్రద్ధతో పూలుపరిమళాలద్ది పూజించే పరమాత్మను నిస్సంగునిగా తెలుసుకొంటారు. వారు సంసారజీవితంలో ఉంటూనే నిస్సంగత్వాన్ని అలవర్చుకుంటారు. అందరిలో ఉన్న పరమాత్మ అంశాన్ని గుర్తించే నైపుణ్యాన్ని అలవాటుచేసుకొని అందరియెడ సమబుద్ధిని ప్రదర్శించే చిత్తాన్ని ఏర్పరుచుకుంటారు.
అధర్మాన్ని కాలరాస్తూనే తమ తమ జీవితాలను ఎట్లా సుమధుర భరితం చేసుకోవాలలో తాను చేసి చూపించినవాడు శ్రీకృష్ణుడు. తాను చేసి చూపించడం కాదు ఇతరులచేత చేయంచినవాడూ కృష్ణుడే. మమతానురాగబంధంలో ఇరుక్కున్న అర్జునుడికి రాగద్వేషాలు అక్కర్లేదంటూ బుద్బుధప్రాయమైన జీవితంలో ఉన్నంత వరకు మంచినే చేస్తూ జననమరణఛక్రం నుంచి ఎలా విడువడాలో నేర్పించాడు కృష్ణయ్య. గోకులాష్టమి నాడు గీతస్మరణ చేసి కృష్ణకథలను రసరమ్యంగా చెప్పుకుం టారు కృష్ణ్భక్తులు.
గీతను చదవితేచాలు గంగాస్నానం ఫలం అందుకుంటారు. గంగాస్నానం ఐహికా ముష్మిక ఫలాలను లభింపచేస్తే ఈలోకంలో ఎలా వ్యవహరించాలో ఏవిధంగా నడుచుకోవాలో ఎవరితో ఎట్లా మసులుకోవాలో గీత నేర్పిస్తుంది. భూతలానే్న స్వర్గసీమగా ఎలా అలంకరించుకోవాలో నేర్పుతుందీ గీత. అసలు గీత భగవానుని హృదయంగా పండితులు చెప్తారు.
మంచికి చెడుకూ నిరంతర ఘర్షణ ఉంటూనే ఉంటుంది. చెడును నిర్మూలించి మంచిని సుస్థాపితం చేయడానికి, పెచ్చుమీరిన అధర్మాన్ని కాలరాచి ధర్మాన్ని పునర్నిర్మించడానికి గీతాజ్ఞానం అందరికీ ఆవశ్యకం. రామావతారంలో రావణుని లాంటి అసురులను సంహారం చేసి రాక్షసులు వ్యాపింపచేసిన అధర్మాన్ని నీతి న్యాయంగా, సత్యధర్మాలతో రాముడు సుస్థాపితం చేశాడు. శీలవంతునిగా సత్య మూర్తిగా ధర్మపరునిగా రాముడు కలకాలం పురుషోత్తమునిగా మాయామానుష విగ్రహునిగా కీర్తించబడుతున్నాడు.
ఏకాదశినాడు, ద్వాదశిపారాయణానంతరం గీతాస్మరణ మహత్తరఫలితాలను సంక్ర మింపచేస్తుందనేది పెద్దల ఉవాచ. ఉత్తమోత్తమైనమార్గశిరంలో శుద్ధ ఏకాదశి పర మోన్నతమైంది. ఈరోజున సమిష్ఠి గీతాపారాయణ ముక్తినివ్వడంలో ముందుంటుంది. సమస్త వేదాలను, శాస్త్రాలను, పురాణాలను అధ్యయనం చేస్తే వచ్చే జ్ఞానం కూడా ఇస్తుంది.
‘‘గీతాయాః పుస్తకం యత్ర- నిత్యపాఠశ్చవర్తతే’’ అని శాస్త్ర వర్ణన. గీత తత్త్వార్థజ్ఞానమంజరి. అంతేకాక వైఖానసుడను ఒకానొకకాలంలో ఒక రాజు తన తండ్రి చనిపోయన తరువాత నరకంలో ఉన్నాడని తెలుసుకుంటాడు. ఆ తన తండ్రి స్వర్గలోకనివాసి కావడానికి మార్గం పెద్దలనడిగి తెలుసుకొంటాడు. వారు చెప్పిన ప్రకారం మార్గశుద్ధ ఏకాదశినాడు ఏకాదశి వ్రతాచరణను చేసి గీతా పారాయణ చేసా డు. ఉపవాసాది నియమాలతో చేసిన వ్రతాచరణ ఫలం వల్ల వైఖానసుడి తండ్రికి నరకయాతన తప్పి స్వర్గానికి వెళ్లాడు. దానివల్లే ఈ ఏకాదశి మోక్షదైకాదశి అన్న పేర్గాంచింది. ఈ రోజున భగవద్గీతను దానం చేయడంకూడా అమితమైన పుణ్యఫలాన్ని స్తుంది.
‘చాతుర్వర్ణ్యం మయాస్పష్టం గుణకర్మ విభాగశః’ అని కృష్ణపరమాత్ముడు గీతలో చెప్పినట్టుగానే మానవులైన అందరూ గీత ను చదివి అర్థం చేసుకొని యశఃకాముకులు కావాలి. శైశవ దశనుంచే గీతపై ఆసక్తిని కలిగించడానికి అటు తల్లితండ్రులు, గురువులు పెద్దలు అందరూ గీతాజ్ఞానాన్ని అందరికీ అందేలా చేయాలి. మనుష్యులందరిలోను నీతినియమాలు, ధర్మాచరణ, పరాయసొమ్ముపై నిరాసక్తత ఏర్పడాలంటే అందరూ గీతాపఠనంపై ఆసక్తి కలిగించాలి.

- సాయకృష్ణ