మంచి మాట

రక్షణ కవచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవుణ్ణి ఉద్దరించేది, మానవ జీవితాన్ని సార్థక్యం చేసేది రామనామమే. రామ అన్న రెండు అక్షరాలే మానవుణ్ణి కీర్తిమంతుణ్ణి చేస్తాయ. చెడు దారిలో నడిచేవారిని మంచిదారిలోకి తెస్తాయ. రామనామము కల్పవృక్షము. అది ధర్మార్థ కామ మోక్షములనిచ్చునది. రాక్షసుడైన మారీచుడు రాముని దెబ్బతిని రామనామాన్ని విని తన రాక్షస కృత్యాలు మాని రామనామంతో జీవితాన్ని సార్థకం చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాడు. రావణుడు తనకు సాయం చేయమని చెబితే రామునికి అపకారం చేయబూనితే మనమే నాశనమవుతామని రామనామాన్ని పలుకమని హితబోధ చేశాడు. విపరీత కాలం దాపురించినపుడు మంచి చెప్పినా తలకెక్కదు. కనుక రావణుడు వినకుండా తన పని చేయకపోతే మరణ శిక్ష విధిస్తానని మారీచుణ్ణి భయ పెట్టాడు.
ఆ మరణం మేదో రాముని చేతిలో మరణిస్తే చాలు వచ్చేజన్మలోనైనా రాముని సేవ చేసుకొనే భాగ్యం లభిస్తుందని రావణుని పనిని చేస్తానని మారీచుడు బంగారు జింకగా మారాడు. అట్లాంటి రామనామము మహత్తరమైంది. మానవ జన్మను పునీతం చేసేది. శంకరుడు కూడా నిరంతరం రామనామోచ్చారణతో ఆనందిస్తుంటాడు.
రామనామమనేది అభాగ్యులకు భాగ్యమును కలిగిస్తుంది. గుణహీనులకు సుగుణాలను థరిచేరుస్తుంది. దరిద్రులకు దారిద్య్రాన్ని దూరం చేస్తుంది. దీనులను రక్షిస్తుంది. పండితులకు పామరులకు కూడా రామనామోచ్చారణమొక్కటే మార్గము. పండితులు తెలిసి నామోచ్చారణ చేసి ముక్తిని పొందుతారు. తెలియని వారు సైతం రామానామాన్ని జపిస్తుంటే వారిలో కాలానుగుణంగా జ్ఞానముదయంచి ముక్తిని పొందుతారు.
రామ నామాన్ని జపించువారు, జపిస్తున్నవారు, జపించాలన్న వారు సైతం మహాభాగ్యవంతులే. అందుకనే దేవతలు దనుజులు, మునులు, నాగములు, మనుష్యులు వీరందరూ కూడా రామానామాన్ని జపించాలనీ అందులోని అమృతాన్ని గ్రోలాలని అర్రులు చాస్తారు.
ఆంజనేయుడు ఒక్కసారి రాముణ్ణి చూచాడు. అతనితో ఒక్కసారి మాట్లాడాడు. ఇక అంతే - జీవిత పర్యంతమూ రామాంజనేయుడుగానే పిలువబడ్డాడు. రామదూత గానే వ్యవహరించాడు. దాసాంజనేయుడన్న ఖ్యాతి వహించాడు. అట్లాగేమానవులంతా కూడా రాముని దివ్య జీవన యానాన్ని చూడాలి. రామునిలోని ధర్మనిరతిని పట్టు పట్టి నేర్చుకోవాలి. రామునిలో అన్యాయాన్ని, అక్రమాలను ఎదురించే ధైర్యాన్ని అవలంభించాలి. రామునిలోని నీతి నియమాలను అలవర్చుకోవాలి. రాముడు నెరిపిన మిత్రత్వాన్ని నేర్చుకుని తోటి మానవులతో మిత్రత్వాన్ని కలిగి ఉండాలి. రాముని సోదర ప్రేమను చూసి తోటి తోబుట్టువులపై ప్రేమను పంచాలి. సీతమ్మ తల్లి పైన రామునికున్న గురిని, రామునికున్న అనురాగాన్ని చూచి సీతారాములను ఆదర్శంగా తీసుకొని గృహస్థ ధర్మాన్ని ఆచరించాలి. ఇట్లా రాముని జీవితంలోని ప్రతి అడుగును పరికించి పరిశీలించి వారు కూడా రామునికి మారురూపులుగా మారాలి. అపుడే జగమంతా రామమయంగా మారుతుంది. అపుడే జగత్తు అంతా సత్యయుగంగా భాసిల్లుతుంది.
రాముని కీర్తి నేటికి అజరామమంగా ఉన్నట్టుగా నే మానవ జీవితం సార్థక్యం అవుతుంది. కేవలం రామనామపాయసాన్ని ఒక్కసారి రుచి చూస్తే చాలు జీవిత పర్యంతమూ రామనామాన్ని వదలక పట్టుకుంటారు. బోయవానిగా ఉన్న వాల్మీకి రామఅన్న పదం పలుక లేక మర అన్న పదం పలుకుతూ మనసులో రాముని రూపాన్ని రచించుకున్నాడు. కనుకనే రాముని జీవన అయనాన్ని భావితరాలకు అక్షరరూపుకట్టి అందించాడు. అట్లానే మనమూ రాముని నామాన్ని జపించుదాం. రామునికి మారుగా మారుదాం. భరతజాతిగొప్ప తనాన్ని నలుదిశలా చాటుదాం.

- రాజమల్లమ్మ