మంచి మాట

నిర్మల చిత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకసారి ధర్మరాజు యాత్రలను సంకల్పించుకున్నాడు. ఆయన సంకల్పాన్నింటికి శ్రీకృష్ణుడే అధిపతి అని అనుకునేవాడు. ఆ సంకల్పాలను శ్రీకృష్ణుడితో చెప్పి వాటిని ఆరంభించేవాడు. తాను ఒక అనుకొన్న యాత్రల గురించి కృష్ణుడితో చెప్పాలని అనుకొని ఆయన దగ్గరకు వెళ్లాడు. శ్రీకృష్ణుని చూచి ఆనందంతో నమస్కరించి ఆమాట ఈమాటమాటాడేలోపులే అక్కడికొక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయన కృష్ణునికి నమస్కరించి మహానుభావా నేను కాశీకి వెళ్లదలిచాను. గంగలో స్నానం చేయాలని సంకల్పించుకున్నాను. కనుక నాకు దారిఖర్చుల కోసం ఏదైనా తృణమో ఫణమో ఇప్పించండి అని అడిగాడు.
అపుడు కృష్ణుడు ఆయన్ను కాశీకి ఎందుకు వెళ్లడం ఇక్కడే శివుని గుడి ఉంది కదా. మన వూరిలోను యమునా నది ఉంది. దానిలో స్నానం చేయవచ్చు కదా అన్నాడు. నాయనా కృష్ణా నీకు తెలియంది ఏముంది. గంగలో ఒక్కసారి స్నానం చేస్తే పాపాలన్నీ నశిస్తాయ కదా. మరుజన్మలేకుండా పోతుంది. కనుక నేను అక్కడికి వెళ్దామనే ఆలోచన చేస్తున్నాను అన్నాడు.
దానికి కృష్ణుడు ఒక గుమ్మడి పండునిచ్చి అయ్యా మీతో పాటుఈ గుమ్మడి పండును తీసుకెళ్లి చక్కగా స్నానం చేయంచి తీసుకొని రండి దీనికి మరుజన్మలో మంచి మనుష్యజన్మ వస్తుంది అని పైకంతోపాటుగా గుమ్మడిపండునిచ్చాడు.
అపుడు ధర్మరాజు ఏం బావా ఆ పండు ఎక్కడైనా మారుతుందా ఎందుకు అలా ఇచ్చావు అని అడిగితే మరి మనుష్యుల మనసు మారకుండా ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగితే, ఎన్ని నదుల్లో స్నానం చేస్తే ఏమి ఫలము అని అన్నాడు. అపుడు ధర్మరాజు సంకల్పాన్ని విరమించుకుని ఉన్నంతలో దానాలు చేస్తూ నలుగురికీ మంచిని కలుగచేసే పుణ్యకార్యాలు చేస్తానని సంకల్పించుకుని శ్రీకృష్ణుని దగ్గర సెలవు తీసుకొని వెళ్లాడు.
అట్లానే కలియుగంలో మానవులు కూడా ఆర్భాటంగా పూజలు చేసినా, దీక్షలు పట్టినా లాభమేమీ ఉండదు. పైగా అదనంగా అహంకారం పెరుగుతుంది. కనుక ఈ కృష్ణబోధను గుర్తుపెట్టుకుని నలుగురి పనికి వచ్చే పనులు చేయాలి. ఎవరికీ ద్రోహం తలపెట్టకూడదు. జీవకారుణ్యం, భూతదయ అనే మంచి గుణాలను అలవర్చుకోవాలి. హృదయ పరివర్తన చెందాలి. నాకే ఉండాలన్న కుత్సిత్సాన్ని విడనాడాలి. లోభాన్ని విడిచి పెట్టాలి. నలుగురు బాగుండాలన్న ధ్యాస నుకలిగి ఉండాలి. ఆచారాల్లోని అంతరార్థాన్ని గ్రహించటమే మనిషి చెయ్యవలసిన పని. మనలో దుర్గుణాలు తొలగి, సద్గుణాలు పెంపొందించుకోవటమే మహనీయుల సందర్శన ఫలం కావాలి. మనస్సు మారకుండా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా ప్రయోజనం లేదు. తమలో నిండి వున్న చెడు వాసనలను నిర్మూలించనిదే ఎన్ని దేవాలయాలు సందర్శించినా, ఎన్ని పుణ్య నదుల్లో స్నానం చేసినా ప్రయోజనం లేదు.
మనిషిలో భక్తి గుణం అలవడాలి. పరుల్లో పరమాత్మను చూడగలగాలి. నడవడిలో ఇతరులపై జాలి దయ ఉండితీరేలా మసలాలి. అపుడే మనుష్య జన్మకు సార్థకం కలుగుతుంది. అవేమీ లేకుండా కేవలం తీర్థయాత్రలు చేసినా, ఎన్ని ఆథ్మాత్మిక ఉపన్యాసాలు విన్నా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ప్రార్థించే చేతులుకన్నా సాయం అందించే.. చేతులే మిన్న. మనమెంత సంపాదించినా వున్నంతలో ఉడుతాభక్తి సాయం చేస్తే... భగవంతుడి కరుణా కటాక్షములు మనపై ఎల్లవేళలా ఉంటాయి. చిత్తశుద్ధితో నిరంతరం శ్రమిస్తే విజయం లభిస్తుంది. మంచికై శ్రమించు.. పోరాడు.. మనిషిగా మానవతామూర్తిగా ఈ జగతిలో నిలబడుఅనే పెద్దల వాక్యాన్ని నిరంతరం మనసున నిలుపుకుని మంచిపనులను చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటే మనిషి జన్మ పుణ్య ప్రదం అవుతుంది.

చోడిశెట్టి శ్రీనివాసరావు