మంచి మాట

సంక్రాంతి పర్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే పెద్ద పండుగ ఆబాల గోపాలాన్ని అలరిస్తుందనడం అతిశయోక్తి కాదు. మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు మకరరాశిలో ప్రవేశించినపుడు వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిని భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమగా నాలుగు రోజులు జరుపుకుంటారు.
ఈ పండుగ వచ్చిందంటే చాలు వారిలో ఉత్సాహం ఉరకలేస్తుంది. మేడలకు మిద్దెలకు రకరకాల రంగులు వేస్తారు. పేడతో అలికిన పూరిపాకల మట్టిగోడల చుట్టూ తెల్లని చుక్కల బొట్లు పెడతారు. పల్లెపడుచులు తెల్లవారముందే, మంచు తెర వీడకముందే మేల్కొని ఇంటి వాకిళ్ళ ముందు కళ్ళాపి జల్లి, ముత్యాల ముగ్గులు వాటిపై గొబ్బెమ్మలు పెడతారు. గుమ్మాలకు మామిడి తోరణాలు, పూలమాలలు కట్టి సంక్రాంతి లక్ష్మికి సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలుకుతారు.
ఇంటిల్లిపాదీ కొత్త బట్టలు ధరిస్తారు. హరిదాసులు, నుదుటిపై విభూతి కట్లు దిద్దుకొని, గణ గణ గంట మోగిస్తూ శంఖమూదుతూ జంగమదేవర ప్రత్యక్షమవుతారు. బుడబుక్కల వాళ్ళు వారి వారి కళలను ప్రదర్శించి, ఇంటి యజమానులిచ్చే కానుకలు అందుకొని వారిని దీవిస్తారు. ఇలా ఏ పల్లెలో చూసినా సంక్రాంతి సందడి కనిపిస్తూ వుంటుంది.
భోగభాగ్యాలు అందించే సంక్రాంతి భోగి మంటలతో ప్రారంభమవుతుంది. ఈ భోగిమంటల కోసం కుర్రకారు హుషారుగా బయలుదేరి ‘ఇచ్చినమ్మకు పుణ్యం ఇవ్వనమ్మకు పాపం’ అంటూ ఇంటింటికీ తిరిగి, పాత సామాన్లు, కలప, పిడకలు వగైరా సేకరించి పోటా పోటీగా వీధుల్లో భోగి మంటలు వేస్తారు. భోగి మంటల కాంతిలో పల్లెలు నూతన ‘క్రాంతి’ని సంతరించుకుంటాయి. రెండవరోజైన సంక్రాంతినాడు పాలు పొంగించి పొంగలి తయారుచేస్తారు. పాల తాలికలు, బొబ్బట్లు, అరిసె జంతికలు, పాయసం, పులిహోర, గారెలు మొదలైన వంటకాలు చేసి ఈ పండుగను ఆస్వాదిస్తారు. పరలోకంలోని పెద్దలకు తర్పణాలు వదులుతారు.
సంక్రాంతి మరునాడు జరుపుకునే పండుగ కనుమ. ఇది రైతుల పండుగగా పేర్కొంటారు. ఈ రోజు రైతులందరికీ చేతినిండా పనే. వ్యవసాయ పనిముట్లను, ఎడ్లబండ్లను రంగులతో అందంగా ముస్తాబు చేస్తారు. వ్యవసాయ పనిమట్లను, ఎడ్లబండ్లను రంగులతో అందంగా ముస్తాబు చేస్తారు.
వ్యవసాయంలో తమకు చేదోడుగా ఉండే ఎడ్ల మెడలలో కొత్తదండలు వేసి జేగంటలు తగిలిస్తారు. పచ్చగడ్డి, తెలకపిండి, అరటిపళ్ళు నైవేద్యంగా తినిపిస్తారు. కనుమ తరువాతి రోజైన ముక్కనుమను నాడు కూడా పశువులను అలంకరించి మేళ తాళాలతో ఊరేగిస్తారు.
సంక్రాంతి నాలుగు రోజులూ పందెం రాయుళ్ళకు పెద్ద పండుగలే. ఒకప్పుడు సంప్రదాయానికి అద్దం పట్టిన ఈ కోడి పందేలు రాను రాను పండగలో ఓ భాగంగా మారిపోయాయి. సంక్రాంతి పండుగకు బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పిల్లలకు ప్రాణప్రదమైన బొమ్మలను ఒక క్రమ పద్ధతిలో అందంగా అమర్చుతారు. ఇది మనమరాళ్ళతో కలిసి బామ్మలు చేసే ఓ వేడుక.
ఆటల దృష్టిలో ఉండే పిల్లలు దైవధ్యానంమీద దృష్టి సారించడానికి దైవం పట్ల విశ్వాసం కలిగించడమే బొమ్మలకొలువు యొక్క ముఖ్యోద్దేశ్యమని పెద్దలు చెబుతారు. తరచి చూస్తే మనం ప్రకృతితో చేయవలసిన సహజీవన విధానాలు సంక్రాంతి పండుగలో అణువణువునా దర్శనమిస్తాయి.
మనిషి తాను పొందిన సంపదను పదిమందితో కలిసి పంచుకోవాలనే ఉద్బోధ కనిపిస్తుంది. జీవనయానంలో తనకు సాయం చేసే పశు పక్ష్యాదులను పూజించి, ఆదరించాల్సిన బాధ్యతను అతనికి గుర్తుచేసే గొప్ప సంస్కృతి గోచరిస్తుంది. మొత్తానికి పిన్నలకు, పెద్దలకు ఆహ్లాదాన్ని కలిగించి, ఆనందాన్ని పంచి మానవతను ఆధ్యాత్మికతను పెంచే మహాపర్వదినం సంక్రాంతి పండుగ.

-చోడిశెట్టి శ్రీనివాసరావు