మంచి మాట

భగవదవతారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపము, పుణ్యం, మంచి చెడు, పగలు చీకటి, సుఖము, దుఃఖము, ఆనందం, విచారములు అనే అంశాలన్నీ వైరుధ్య భావములను కలిగినవి. దుర్మార్గులు, సన్మార్గులు పుడుతూ గిడుతూనే ఉంటారు. వారి వారి జననమును బట్టి కాల మాన పరిస్థితుల ప్రభావం వలన గుణగణాలు మారుతుంటాయి. హిరణ్యాక్ష, హిరణ్య కశ్యపులు, రావణ కుంభకర్ణులు, దుర్యోధన దుశ్శాసనులు వంటి లోక కంటకులు జన్మించి తమ జన్మ స్వభావ రీత్యా పలు అహంకారములు కలిగి సజ్జనులను, స్ర్తిలు, పిల్లలు ఋషి గణాలను వేదిస్తూ లోక కంటకులైన వారే. వారు పెట్టే బాధలు భరించలేక శ్రీ మహా విష్ణువు, శివుణ్ణి బ్రహ్మదేవుడిని మొరపెట్టుకుంటారు.
ధర్మ సంరక్షణార్ధం, భూమి భారమును పాప ప్రక్షాళన ద్వారా తేలిక పరచడానికై ఆ పరమాత్ముడు పలు కాలాల్లో పలు యుగాల్లో మహాపురుషుడిగా జన్మించి భువిపై కొంత కాలము జీవించి దుష్ట శక్తులను సామ దాన భేద దండోపాయములచే అంతం చేస్తారు.
అవతరణ అను పదమును పరిశీలించినట్టయితే ‘అవ’ అనగా కిందకు ‘తరణ’ అనగా దిగి రావడం. అనగా ఊర్ధ్వ లోక వాసియగు శ్రీ మన్నానారాయణుడు తన విశేషమైన అంశములతో శుభ ఘడియలలో మానవ రూపము ధరించడానికి ఈ నిమ్న లోకం (్భమి) పైకి తల్లిదండ్రుల గర్భ వాసాన జన్మించును. దశావతారముల అంతర్లీన రహస్యమిదే. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క లోక కంటకుడు(లు) జన్మించి యజ్ఞ యాగాదులు, వైదిక కర్మలు విధ్వంస రచన చేయుచు అమాయకులు, సాధువులు, స్ర్తిలను చెరబట్టి లోకాలను వర బల గర్వంతో ఆయుధాలు సమకూర్చుకుని, సర్వసైన్యంతో దాడులు చేసి ప్రకృతిలో సమతుల్యతను విపరీతంగా నాశనం చేసేటందకు కారణభూతులవుతారు.
సంభవామి యుగే యుగే-అన్నట్టుగా భగవంతుడు అవతరించుచు ధర్మమును సంరక్షించును. బ్రహ్మదేవుడు, భోళాశంకరుడు రాక్షసుల ఎడల వాత్సల్య కరుణా పూరితులై వారి తపమునకు త్వరగా లొంగిపోయి అజేయమైన వరాలు ప్రసాదించి సంతుష్టులను చేయును.
అంతట వారు వర బల గర్వితులై ఏడేడు లోకాల్లో మంటలు పుట్టిస్తారు. తీవ్రమగు అశాంతిని, హింసను, దౌర్జన్యాలను కలిగిస్తారు. విధిలేని పరిస్థితుల్లో మహా విష్ణువు భువికి దిగివస్తాడు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, లాంటి అవతారములు అవతరించెను.
ఆ అవతారముల్లో ఒక్కోసారి తమ ప్రియభక్తులను సైతం దేవతల క్షేమం కోరి అదుపు చేయును. వామనావతారంలో బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువు భక్తుడు. ఇతను ప్రహ్లాదునికి మనుమడు. ప్రహ్లాదుడు హిరణ్యకశపుని పుత్రుడు. పుట్టుకతోనే శ్రీమన్నానారాయణ నామ సంకీర్తనాచార్యుడై నిద్రపోతున్నా, మేల్కొన్నా, ఆటలాడే సమయంలోను, పాఠశాల విద్యలో వున్నప్పుడు, హాస, భాస, లాస్యములయందును శ్రీహరినే ధ్యానించిన పరమ భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు. తన నవవిధ భక్తి మార్గములలో నొకటి యగు కీర్తనం ద్వారా నిరంతరం శ్రీమన్నారాయణుని సంకీర్తనం చేసి తరించెను. అది ప్రహ్లాదుడి కథ కాగా-
వామనావతారంలో తన భక్తుడైన బలిని పాతాళమునకు పంపవలసిన అవసరం ఏముంది? అతి అత్యంత అన్యాయం కదా! శ్రీ మహా విష్ణువు నింద ఏమైనా చేశాడా? యాగం చేస్తున్న బలి చక్రవర్తిని వామనుడు మూడు అడుగుల నేలను దానంగా కోరడంతో ఏదైనా మాయ లేక తిరకాసు వుందా అనిపిస్తుంది. రాక్షస గురువు శుక్రాచార్యుడు సైతం ఈ విషయం తన శిష్యుడైన బలి చక్రవర్తికి నివేదించెను. అయినా నా స్వామి అంతటివాడే ఇలా మాయ రూపంలో వచ్చి దేహీ! అని అర్ధించాడంటే అది పూర్వ పుణ్యమే అని వినయంగా గురువుకి విన్నవించి మరీ దానంఇచ్చాడు బలి. సర్వవ్యాపి సర్వసృష్టికర్త అయన భగవంతుడు తాను సృష్టించిన లోకాల్లో అధర్మం పెచ్చుమీరితే ధర్మసంస్థాపన కోసం మళ్లీ తన్ను తాను సృష్టించుకుని ఆ అధర్మాన్ని కాలరాచి ధర్మాన్ని స్థాపిస్తాడు. తానే సృష్టించడం తాను నిర్మూలనం చేయడం అనేవి భగవంతుని లీలావినోదాలే తప్ప సామాన్యులు అర్థం చేసుకొనే విషయాలు కావు కనుకనే ధర్మం తప్పకుండా కర్తవ్యాలను నిర్వర్తిస్తూ భగవంతునికి ప్రియతములుగా మారాలి.

- లక్కరాజు శ్రీనివాసరావు