మంచి మాట

ప్రతిఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ అనంత కోటి సృష్టికి మూలం భగవంతుడు. మనము ఆ భగవంతుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలము. నింగి, నేల, గాలి, నీరు, అగ్ని పంచభూతాలను వరంగా ప్రసాదించాడు. వాటిని మనం సక్రమంగా వినియోగించుకొంటే జీవితం ఆనందమయం అవుతుంది భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి సైతం భగవంతుని యందు భక్తి, ప్రకృతి అందు సంరక్షణ కలిగియుండాలి.
ఈ కలియుగాన మానవుడు క్షణికమైన సుఖాలంటూ పరిగెడుతున్నాడు. అధికార, ధన అహంతో అంధుడిగా మారి రాక్షస జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ జగతిన ఏది శాశ్వతం కాదని జగమెరిగిన సత్యమే అయినా మనిషిలో మార్పు లేదు. నాది అనే అహంకారంతో మానవత్వం మరిచి మనిషిగా మాయమైపోతున్నాడు. మనిషిగా ఈ భువిపై చేయాల్సిన సత్కార్యాలు ఎన్నో మన కళ్ళముందున్నాయి. అన్నీ సమకూర్చిన ఆ భగవంతుని యందు భక్తి , మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, మన పూర్వీకులకు సదా రుణపడి వుండాలి. ఆ భగవంతుడు ఏమి చేసినా లోక కళ్యాణం కోసమే. ఆ లోక కళ్యాణానికి భాగస్వాములు కావాలి. మన వంతు సాయం సదా చేస్తూనే వుండాలి. అందుకే భగవంతునియందు, పెద్దలయందు భక్తి, అనురాగంతో, ఆప్యాయతతో, మమతానుబంధాలతో మానవత్వంతో సతతం మనం పరిమళించాలి.
ప్రకృతి మనకు తినడానికి తిండి, తాగటానికి నీరు, వుండటానికి నివాసంతోపాటు సకల సౌకర్యాలను ఇస్తుంది. కాని మనిషి స్వార్థంతో మన ప్రకృతి పరిసరాలను కలుషితం చేస్తున్నాము. ఈ వేదభూమిలో ఎందరో మహాత్ములు ఏ ప్రతిఫలం ఆశించకుండానే తమ జీవితాలను మనకై ధారబోశారు. అలాంటి వారిని స్మరిస్తూ మనమూ వారి బాటలో నడవడానికి ముందుకు వెళ్లాలి కాని స్వార్థచింతనతో ప్రకృతి సమతౌల్యతను దెబ్బతీయకూడదు.
కర్మభూమిలో పుట్టిన మనం గర్వంగా జీవించాలి. ఆపన్నులకు, అన్నార్తులకు మన వంతు సాయం అందించాలి. ఏ స్వార్థం లేకుండా జీవిస్తే జీవితం ఆనందంగా వుంటుంది. స్వార్థంతో కళ్ళు మూసుకుపోతే ఆ జీవితం వ్యర్థం అవుతుంది.
‘ఈ సృష్టికి మూలం అమ్మ. బిడ్డ ఎంత దుర్మార్గుడైనా దుష్టుడైనా అక్కున చేర్చుకొనేది అమ్మ మాత్రమే. ఆ అమ్మకు ప్రతిరూపం జగన్మాత. శ్రీశైలంలో భ్రమరాంబిక, కాశీలో అన్నపూర్ణ, విజయవాడ కనకదుర్గ, తిరుచానూరు అలివేలుమంగ, హిమాలయాల్లో వైష్ణోదేవి, ఆలంపూర్ జోగులాంబగా.. అన్నింటా అమ్మవారిదే అగ్రస్థానం. ఆ కలియుగదైవం శ్రీ శ్రీనివాసుని ఎదపై శ్రీలక్ష్మీదేవి నిలవడం ఎంత భాగ్యం. అమ్మ కరుణా వీక్షణములు లేకుండా మనిషి మనుగడ సాగించలేడు. గంగ, కృష్ణ, గోదావరి, యమున, సరస్వతీ నదీ తీరాలు మన జీవన గమనానికి జీవవాహినులు. అలాంటి అమ్మ పట్ల మనం సదా భక్త్భివంతో కలిగి జీవించాలి. అమ్మ చల్లని చూపుతో జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. సుఖమయ జీవితానికి నాంది పలకాలి. ఈ కలియుగంలో అమ్మరూపంలో ఉన్న స్ర్తిరూపులను మనం భక్త్భివంతో చూడాలి. వారిని పూజించాలి. వారియెడ సహనభావంతో చూడాలి.
భగవంతుడు లేడని వాదించే వితండవాదులు వున్నారు. భగవంతుడు అంటే నమ్మకం. ఆ నమ్మకానికి ప్రతిరూపం భగవంతుడు. భగవంతున్ని నమ్మి చెడినవారు చరిత్రలో లేరు. ఎందరో భక్తులు భగవంతున్ని నమ్ముకొని మహాత్ములు అయ్యారు. అందుకు సాక్ష్యాలు మన కళ్ళముందు కోకొల్లలు. అందుకు నిదర్శనాలు సతతం మనకు ఆదర్శ దర్శనాలు.
భగవంతుని మెప్పు పొందిన అన్నమయ్య కీర్తనలు అజరామరాలు. త్యాగయ్య రామకీర్తనలు తేనె పలుకులు. క్షేత్రయ్య పల్లె పదాలు అద్భుతాలు. భక్తరామదాసు పాడిన పాటలు ఆనందపరవశాలు. ఇంతకుమించిన భాగ్యం మనకు ఏమి కావాలి. ఈ సృష్టికి స్థితి లయ కారకుడు ఆ భగవంతుడు. కర్త కర్మ క్రియ భగవంతుడు. ఆ భగవంతుని చల్లని నీడలో సేద తీరుదాము. ఆనందంగా జీవిద్దాం.

-కురువ శ్రీనివాసులు