మంచి మాట

కార్యదీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనోనిబ్బరంతో పట్టుదలతో ప్రయత్నిస్తే కానిపని ఏదీ లేదు. యుగాలు గడిచినా తరాలు మారినా మారనిది ఒక్కటే ధర్మం. అధర్మం ఎప్పుడూ పరాజయంవైపే పయనిస్తుంది. మంచివారికెప్పుడూ మంచే జరుగుతుందన్నది చరిత్ర చెప్పే సత్యం. ఎన్ని ఆటంకాలు వచ్చినా మొదలుపెట్టిన పనిని పూర్తిచేసేవరకు కొందరు విశ్రమించరు. ఒక పని ప్రారంభించాక మధ్యలో ఆపకుండా కొనసాగించడమే కార్యదీక్షకు నిదర్శనం. అన్నదమ్ములైన రామలక్ష్మణుల సీతానే్వషణ కూడా అటువంటిదే.
రామలక్ష్మణులు సీతను వెతుకుతూ వెళుతున్న దారిలో ఒక వికృత ఆకారం వారికి కనిపించింది. ఆ ఆకారానికి కళ్ళు ముక్కు చెవులు చేతులు వుండవలసిన చోట లేవు. ఆ వికృతాకారం అన్నదమ్ములిద్దరిని తన పొడవైన రెండు చేతులతో బంధించాలని చూసిన హస్తాలను ఇద్దరు నరికేశారు. ఆ ఆకారం నేలకూలింది. ఆ వికృతాకార కళేబరం అదృశ్యమై చూడచక్కని రూపంతో ఒక గంధర్వుడు ప్రత్యక్షమై ఒక సిద్ధుని శాపంవలన నాకీ వికృత రూపం వచ్చిందని, తన పేరు కబంధుడని చెప్పాడు. మీ దయవలవన నాకు శాప విమోచనం కలిగింది. మీరు చేసిన రుూ ఉపకారానికి బదులుగా మీకొక ఉపాయం చెబుతాను అని, పంపా తీరంలో సుగ్రీవుడనే వానర రాజు వున్నాడు. అతనిని కలిసి సహాయం కోరితే మీరు మీ సీతను తిరిగి పొందవచ్చు అని చెప్పి వెళ్లిపోయాడు.
కబంధుడు చెప్పిన ప్రకారం రాముడు లక్ష్మణుడు ఋష్యమూక పర్వతం చేరారు. అక్కడికి దగ్గరలోవున్న కిష్కింధ నగరానికి మహాబలశాలియైన వాలి అధిపతి. అతని తమ్ముడు సుగ్రీవుడు. సుగ్రీవుని భార్యని వాలి తన భార్యగా చేసుకొని సుగ్రీవుణ్ణి రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. వాలి తనకున్న శాపంవలన రాలేని ప్రదేశమైన ఋష్యమూక పర్వతం మీద తన నివాసం ఏర్పరచుకున్నాడు. ధనుర్భాణాలను ధరించి వస్తున్న రామలక్ష్మణులను చూసిన సుగ్రీవుడు తనను చంపటానికి తన సోదరుడు వాలి పంపినవారేమో తెలుసుకొని రమ్మని తన మంత్రి హనుమంతుణ్ణి పంపించాడు. ఒక ముసలి బ్రాహ్మణ వేషధారిగా మారి రామలక్ష్మణుల దగ్గరికి వెళ్లి వారి వివరాలడిగాడు హనుమంతుడు. మమ్మల్ని రామలక్ష్మణులంటారు. మేము అయోధ్యానగర రాజకుమారులం. మా తండ్రిగారి ఆజ్ఞను అనుసరించి అరణ్యవాసం చేస్తూ దుష్టశిక్షణ శిష్ట రక్షణ చేస్తున్నాము. ఇలా వుండగా ఎవరో ఒక మాయావి నా భార్య సీతాదేవిని అపహరించాడు. అతడికోసం అనే్వషిస్తూ ఇటు వైపు వచ్చాము అని శ్రీరాముడు చెప్పగా విన్న హనుమంతుడు ‘మహాప్రభూ! శ్రీరామచంద్రా, భయపడకుండా నా వెంట రండి, ఈ పర్వతంపై నీతి నియమాలు తప్పని సుగ్రీవుడనే వానరరాజు వున్నాడు. అతనిని కలుకొని అతనితో స్నేహం చేయటం మీకిద్దరికీ మంచిది’ అని చెప్పిన మాటలకు రాముడు సంతోషంతో సుగ్రీవుణ్ణి కలుసుకోవటానికి అన్నదమ్ములిద్దరూ హనుమంతునితో కలిసి బయలుదేరి కొండపైకి వెళ్లారు.
సుగ్రీవుడు ఎదురేగి స్వాగతం పలికి తన సింహాసనంపై ఆసీనులను చేశాడు. రాముడు, సుగ్రీవుడు వారి వారి కష్టనష్టాలను మనసు విప్పి మాట్లాడుకున్నారు. స్నేహబంధాన్ని మరింత పెంచుకున్నారు. ఇంతలో సుగ్రీవుడికి నగల మూట గుర్తుకొచ్చింది. వెంటనే నగల మూటను తెప్పించాడు. రామలక్ష్మణున్ని పిలిచి ఆ నగలను గుర్తుపట్టమన్నాడు. అంతే సుగ్రీవునికిచ్చిన మాట ప్రకారం రాముడు వాలిని నిర్జించాడు.సుగ్రీవుణ్ణి కిష్కింధ రాజ్యానికి పట్ట్భాషిక్తుణ్ణి చేశాడు శ్రీరాముడు.
సుగ్రీవుడు రామునికిచ్చిన మాట ప్రకారం వానరసైన్యాన్ని సీతానే్వషణకు పంపించాడు. వీరాభిమానియైన ఆంజనేయుని రాముని సేవలో నిమగ్నమయ్యాడు. ఆయన లంకలో అడుగుపెట్టి సీతమ్మను వెదికాడు. ఆ అమ్మకు స్వాంతన కలుగ చేసాడు. రావణునికి హితబోధ చేశాడు. మూర్ఖుల మనసు రంజింపలేమని తెలుసు కొన్నాడు. సీత కనిపించిందన్న సువార్తను రామునికి చెప్పాడు. రాముడు వానరసేనతో బయలుదేరాడు. రావణుని అంతంచేశాడు. సీతమ్మను అక్కున చేర్చుకున్నాడు. ఇదీ కార్యదీక్ష.

-కాకరపర్తి సుబ్రహ్మణ్యం