మంచి మాట

చిత్తశుద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ఎక్కడ చూచినా పూజలు, భజనలు ఎక్కువగా కనిపిస్తున్నాయ. ఇక్కడ మతం ప్రమేయంలేకుండా సర్వులూ పూజాదికార్యాక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నట్టు తెలుస్తోంది. కాని దురాచారాలు జరుగుతూనే ఉన్నాయ. అన్యాయాలు, అక్రమాలు కనబడుతూనే ఉన్నాయ. ఎందుకని ఆలోచిస్తే పూర్వం రాజులు, మహర్షులు సమాజ శ్రేయస్సుకై విధిగా యజ్ఞాలు, యాగాలు చేసేవారు. తత్ఫలితంగా ఆయా రాజ్యాలలో కరువు కాటకాలుసమసిపోయేవి. రాజ్యంఅంతా సస్యశ్యామలంగాను కళకళలాడుతూ ఉండేది. అదేకాదు ప్రజల్లో సత్యం, ధర్మం, దానం, శాంతి మొదలగు గుణాలుసైతం పెరిగేవి. ప్రజలంతా పిల్లాపాపలతో సుఖసంతోషాలతో జీవించేవారు.
కాని ఇపుడు జనుల్లో జనార్ధునుని పైన భక్తి పెరిగినట్లు కనిపిస్తోంది. కాని అరాచకాలు జరుగుతూనే ఉన్నాయ అంటే వీరిలో స్వార్థకాంక్ష పెరిగింది. తను మాత్రమే అందరికన్నా గొప్పవాడుగా ఉండాలనే కోరిక పెరిగింది. ఇక్కడ ఆహ్లాదకరమైన పోటీ మనస్తత్వం తరిగిపోయ ఎట్లాగైనా తనకే మొదటిశ్రేణి లభించాలని అనుకోవడమే కాదు పక్కవానికి రాకూడదనే ఆలోచన కూడా పెరుగుతూ ఉంది. అది వేళ్ళూనుకొనే నేటి పరిస్థితుల్లో లోకకల్యాణకారమైన పనులు పోయాయ. నలుగురూ బాగుండాలనే ఆలోచన తక్కువై పోయంది. అందువల్లే పూజలు, భజనలు అనుకొన్న ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయేమో అన్న ఆలోచన మొల కెత్తుతోంది.
దానం చేయడంలో తాము ముందుడాలని పూర్వులు కోరుకునేవారు. నేడు దానం చేస్తున్నారు కాని ఆ దానానికి కీర్తికండూతి తోడై ప్రతిఫలాపేక్షరహితులుగా ఉండాల్సిన వాళ్లు కాస్తా ప్రతిఫలాన్ని ఆశిస్తున్నారు. మనసున భగవంతుని నిలుపుకుని మనసా వాచాకర్మణా భగవంతుడే నన్న నమ్మకానికి దూరమవుతూ నేను భక్తుణ్ణని నలుగురూ గుర్తిస్తున్నారా లేదా అని చూస్తున్నారు... దీనివల్ల కూడా ఆడంబరమే కాని ఆనంద తన్మయత్వం మృగ్యమైపోయంది.
ఆనాడే శ్రీకృష్ణుడు రారాజు ఇచ్చిన విందుభోజనానికి వెళ్లకుండా అరటి పండ్లు పారేసి భక్తి తన్మయత్వంతో తనకు అరటిపండుతొక్కలిచ్చిన భక్తుని దగ్గరకు పరుగెట్టుకు వెళ్లాడు. ఆ సంఘటన కేవలం ఇప్పటి మనుష్యులకోసం భగవంతుడు కల్పించినట్టు అన్పిస్తోంది కదా.. మరి ఆడంబరాలెందుకు చేసేది మంచిది అయతే కీర్తి దానికదే వస్తుంది దానికోసం వెంపర్లాట అక్కర్లేదు.
శిబి చక్రవర్తి, అంబరీషుడు, కర్ణుడు వీరంతా వారు చేసిన మంచిపనులకు ప్రచారమేదైనా చేసుకొన్నారా? ప్రచారం లేదు కనుక వారి కీర్తి కిరీటమేదైనా మసకబారిందా? విజ్ఞతతో ఆలోచించి చేయాల్సిన పనిని తన కర్తవ్యంగాను, ఫలం ఆశించకుండాను చేస్తే అన్నీ మంచిపనులేజరుగుతాయ. నలుగురికీ ఉపయోగం ఉంటుంది. దివిలో భగవంతుని ఆశీస్సులందుతాయ. మహిలో నలుగురి దీవనెలూ అందుతాయ. దానికి కావాల్సింది మాత్రం చిత్తశుద్ధి.
దుర్యోధనుని లాగా అంతా తనకే కావాలనుకొన్నా అధోగతి తప్పదు. రావణాసురుని లాగా పరుల సొమ్ముకు ఆశపడినా కాలుని చేతిలో మృత్యువాత పడక తప్పదు. కనుక పరాయ సొత్తును పాములాగా చూడాలి. ఉన్నదానిలో సంతృప్తి చెందాలి. అంతా భగవంతుని కృపలాగా భావించాలి. చేసే పనేదైనా అది ఈశ్వరార్పణం చేసి చేయాలి. అత్యాశకు కాని దురాశకుకాని పోరాదు. తనకు మాత్రమే అత్యధిక ఫలం రావాలని కాక నలుగురికీ మంచి జరగాలని ఆశిస్తే చాలు భగవంతుని కృపతో పాటు కీర్తీ వస్తుంది.
................

మంచిమాట శీర్షికకు
ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు.
రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

- ఎస్. నాగలక్ష్మి