అంతర్జాతీయం

చిన్న, పేద దేశాలకు నిధుల అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాతావరణ మార్పులపై ప్రత్యేక కేంద్రం ఏర్పాటుకు కామనె్వల్త్ దేశాల అంగీకారం

వలెట్టా (మాల్టా), నవంబర్ 28: కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడానికి చిన్న, పేద దేశాలు అవసరమైన నిధులు పొందడానికి వీలుగా వాతావరణ మార్పులకు సంబంధించి ప్రత్యేకంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కామనె్వల్త్ దేశాల నేతలు శనివారం అంగీకరించారు. కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగినన్ని నిధులు అందజేయాలని భారత్ చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు 53 దేశాలు సభ్యులుగా ఉన్న కామనె్వల్త్ నేతలు తీసుకున్న నిర్ణయం ఈ డిమాండ్‌కు అనుగుణంగా ఉండడం గమనార్హం. అంతేకాదు, భూగోళం వేడెక్కి పోవడాన్ని గణనీయంగా తగ్గించడానికి ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్ణయించుకోవడానికి పారిస్‌లో ప్రపంచ దేశాల నేతలందరూ వాతావరణ మార్పుపై చర్చించడానికి సమావేశం కావడానికి రెండు రోజుల ముందు కామనె్వల్త్ దేశాలు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
వాతావరణ మార్పులను అదుపు చేయడానికి చేసిన రుణాలను తీర్చడానికి పేద దేశాలకు సాయం చేయడానికి ఒక కొత్త విధానాన్ని ఏర్పాటు చేయాలని కూడా కామనె్వల్త్ దేశాల నేతలు నిర్ణయించారని సమావేశం అనంతరం కామనె్వల్త్ సెక్రటరీ జనరల్ కమలేష్ శర్మ చెప్పారు. గ్రీన్‌హౌస్ వాయువులను తగ్గించడానికి అవసరమైన ఆర్థిక మద్దతును సమకూర్చుకోవడంలో చాలా దీవి (ఐలాండ్) దేశాలు, చిన్న దేశాలు ఇబ్బంది పడుతున్నాయని, ఈ కేంద్రం ఆ దేశాలకు నిధులను సమకూరుస్తుందని శర్మ చెప్పారు. ఈ దేశాలకు నిధులు సమకూరుస్తామని ధనిక దేశాలు హామీలయితే ఇస్తున్నాయి కానీ ఎవరిని సంప్రదించాలో తెలియక ఆ దేశాలు ఇబ్బంది పడుతున్నాయని ఆయన అంటూ, ఇప్పుడు ఈ కేంద్రం ఆ హామీని వాస్తవం చేస్తుందని చెప్పారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంతోపాటుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపై చర్చించిన కామనె్వల్త్ దేశాల శిఖరాగ్ర సమావేశానికి ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన, బ్రిటీష్ ప్రధాని డేవిడ్ కామరాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడియా, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సహా దాదాపు 30 దేశాల, ప్రభుత్వాల అధినేతలు హాజరయ్యారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వాతావరణ మార్పుపై జరిగిన సమావేశానికి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్, ప్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే కూడా హాజరయ్యారు. పారిస్‌లో దారుణమైన ఉగ్రవాద దాడి జరిగినప్పటికీ ఈ అంశం తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తాను ఈ సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు హోలాండే చెప్పారు. పారిస్ సమావేశంలో ప్రపంచ దేశాలన్నీ ఒక ఒప్పందానికి వస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తూ, కొన్ని దేశాలు ఈ ఒప్పందానికి అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించవచ్చని కూడా చెప్పారు. అయితే ఆ దేశాలు ఏవో హోలాండే చెప్పలేదు. మనిషికి సాటి మనిషే గొప్ప శత్రువని, ఉగ్రవాదం విషయంలో మనం దీన్ని చూసామని, అలాగే వాతావరణ మార్పు విషయంలో కూడా చూసామని ఆయన అన్నారు.
కాగా, వచ్చే సోమవారం పారిస్‌లో ప్రారంభం కానున్న ప్రపంచ దేశాల సదస్సుపై కామనె్వల్త్ దేశాల సమావేశం ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున అభివృద్ధి చెందుతున్న దేశాల ఆందోళన విధాన ప్రకటనలో స్పష్టంగా ప్రతిబింబించాలని చర్చ సందర్భంగా భారత్ గట్టిగా కోరింది. కాగా, పారిస్ సదస్సులో ఓ సానుకూల ఫలితం లభించగలదన్న దానికి కామనె్వల్త్ దేశాల సదస్సులో తీసుకున్న నిర్ణయాలే సంకేతాలని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్ అన్నారు. పారిస్ శిఖరాగ్ర సదస్సుకు 150 దేశాలకు పైగా నేతలు హాజరవుతున్నారు.