విశాఖ

ఇచ్చిన హామీలను నెరవేర్చిన నాడే ప్రజాప్రతినిధులకు విలువ ఉంటుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, ఏప్రిల్ 20: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన నాడే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు విలువ ఉంటుందని ఎమ్మెల్యే కెఎస్‌ఎ రాజు అన్నారు. విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరశిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు సంఘీభావంగా శుక్రవారం ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు ఆధ్వర్యంలోని స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ధర్మపోరాట నిరసన దీక్షలు జరిగాయి. ఈ నిరసన దీక్షలకు అన్నివర్గాల వారినుండి మద్దతు లభించింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ సుకుమార వర్మ కూడా ఇక్కడ దీక్షా శిబిరంలో పాల్గొని దీక్షలు చేపట్టారు. గోవాడ సుగర్స్ చచైర్మన్ గూనూరు మల్లునాయుడు, జెడ్పీటిసి కనిశెట్టి మత్స్యరాజు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీపీలు తదితరులు ఉదయం ఏడుగంటలకే శిబిరంలోని దీక్షల్లో కూర్చున్నారు. ఈ శిబిరానికి నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల నుండి పెద్దఎత్తున ఉపాధ్యాయులు, ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు, పాన్‌షాపు వర్తకులు, జంగమ సేవాసంఘం, బార్ అసోసియేషన్ సభ్యులు తదితర ప్రజాసంఘాల సభ్యులు దసందర్శించి దీక్షలకు తమ సంఘీభావాన్ని తెలియజేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన నాడే ప్రజాస్వామ్యంలో ఆయా నాయకులకు విలువ ఉంటుందన్నారు. వార్డుమెంబర్ నుండి ప్రధాని వరకు అందరూ ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాల్సి ఉంటుందన్నారు. గత ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంధ్రమోడీ తిరుపతిలో వేంకటేశ్వర స్వామి సాక్షిగా వెల్లడించిన విభజన హామీలను నెరవేర్చాలన్నారు. ఇప్పటికైనా మాటమార్చుకుని పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి ప్రత్యేకహోదా, రైల్వేజోన్ వంటి విభజన హామీలన్నింటిని నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా 29సార్లు తమకు అన్యాయం చేయవద్దని కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆయా హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. ఆదర్శవంతమైన నాయకునిగా చంద్రబాబునాయుడు తన పుట్టినరోజు నాడు పోరాట దీక్షలను ప్రారంభించడం ప్రజాసంక్షేమంపై ఆయనకున్న నిజాయితీకి నిదర్శనమన్నారు. డిసిసిబి చైర్మన్ సుకుమార వర్మ మాట్లాడుతూ అప్పట్లోవిభజన హామీలు అమలుచేస్తామని ప్రధాని మోదీ చెప్పడం జరిగిందన్నారు. రాష్ట్భ్రావృద్ధికి సహకారం అందించాల్సిన ప్రధానమంత్రి ఆ దిశగా చర్యలు చేపట్టలేదన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ ప్రత్యేక హోదా ఉద్యమాలకు సహకరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. అంతకుముందు ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు వెంకన్నపాలెం నుండి గాంధీగ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా అంటూ నినాదాలు చేసారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ నాయకులు పూతి కోటేశ్వరరావు, దొమ్మెసి అప్పలనర్సగిరి, ఎంపీటీసీ సభ్యులు మారెడుపూడి రమాదేవి, కె. రమాదేవి, పిఎసిఎస్‌ల అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, వార్డుమెంబర్లు పాల్గొన్నారు.

ఘనంగా ఆదిశంకరాచార్యుల జయంతి ఉత్సవాలు
చోడవరం, ఏప్రిల్ 20: జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి 2090 జయంతి సందర్భంగా స్వయంభూ గౌరీశ్వర స్వామి ఆలయ శాలాహారంలో ఉన్న ఆదిశంకరాచార్యుల వారికి శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ముందుగా అష్టోత్తర పూజ, శతనామార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలోని గౌరీశ్వర స్వామికి కూడా విశేష పూజలు జరిగాయి. దేవాదాయ శాఖ, హిందూ ధర్మపరిరక్షణ సమితి సంయుక్త ఆదేశాల మేరకు ఈ ఆదిశంకరాచార్యుల వారి జయంతి ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు కొడమంచిలి గణేష్, చలపతి, వెంకట్రావు, మహేష్‌లతోపాటు ఆలయ కమిటీ చైర్మన్ పసుమర్తి మల్లిక్, నాని తదితర భక్తులు పాల్గొన్నారు.