విశాఖ

ఘనంగా నూకాంబిక కొత్తఆమావాస్య పండగ మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు అందజేసిన వ్యవసాయశాఖ మంత్రి
అనకాపల్లి, మార్చి 17: ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాద్య దైవం అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య పండుగ మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ప్రభుత్వం తరపున వ్యవసాయ శాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పట్టువస్త్రాలను అమ్మవారికి సమర్పించారు. ఆలయ మర్యాదలతోను, పూర్ణకుంభంతోను మంత్రులు సోమిరెడ్డి, అయ్యన్నపాత్రులకు ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టువస్త్రాలను మంత్రి సోమిరెడ్డి సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రులకు ఆశీర్వచనాలు అందజేసారు. అమ్మవారి ఆలయం తరపున స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ శాలువాలు కప్పి జ్ఞాపికలు బహుకరించి సత్కరించారు. ఈ సందర్భంగా నూకాంబిక ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రులకు ఎమ్మెల్యే పీలా వివరించారు. స్థానిక ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, వాసుపల్లి గణేష్‌కుమార్, గిడ్డి ఈశ్వరి, పంచకర్ల రమేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు తదితర ప్రముఖులు అమ్మవారిని దర్సించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు తగు చర్యలు తీసుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారిణి ఎం. సుజాత, ఆలయ ట్రస్టీబోర్డు మాజీ చైర్మన్లు బుద్ద నాగజగదీశ్వరరావు, కొణతాల వెంకట్రావు, బొడ్డేడ జోగినాయుడు, మళ్ల సురేంద్ర, డాక్టర్ నారాయణరావు, ఆడారి జగన్నాథరావు తదితరులు నేతృత్వం వహించారు. అలాగే స్థానిక తాకాశివీధిలోని నూకాంబిక అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్సించుకున్నారు. ఎమ్మెల్సీ పప్పల చలపతిరావుకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ తాకాశి చిన్న నేతృత్వంలో సత్యనారాయణ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ తాకాశి బాబు, తాకాశి సత్యం దొర తదితర ఉత్సవ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.