విశాఖ

ప్రత్యేక హోదా కోసం నేటి నుంచి జీపు జాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, మార్చి 21: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22వ తేది గురువారం నుంచి జీపు జాత చేపడుతున్నట్టు సి.పి.ఎం. నాయకులు పొద్దు బాలదేవ్, వి.ఉమామహేశ్వరరావు, కె.దయానిధి తెలిపారు. స్థానిక గిరిజన సంఘం కార్యాలయ భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అనంతగిరి మండలం కాశీపట్నంలో జీపు జాత ప్రారంభవౌతుందని చెప్పారు. సి.పి.ఎం. నాయకుడు కిల్లో సురేంద్ర ఆధ్వర్యంలో పది మండలాల్లోని రెండు వందల గ్రామాలలో జీపు జాత ద్వారా ప్రత్యేక హోదాపై విస్తృతంగా ప్రచారం చేయనున్నట్టు వారు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదాపై ఆంధ్రులకు తీరని అన్యాయం చేసాయని, దీనిపై రాజీలేని పోరాటం చేపడుతున్నామని వారు చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రజలంతా సమిష్టి పోరాటానికి సిద్ధం కావాలని వారు కోరారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కుని కేంద్రానికి వినిపించేలా ప్రజలంతా పోరాటం చేయాలని వారు సూచించారు. ప్రత్యేక హోదా సాధన కోసం పార్టీలకు అతీతంగా ప్రజలంతా ఏకం కావాలని వారు పిలుపునిచ్చారు. హోదాతో యువతకు ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమ ఏర్పాటు, పేదలకు పలు సంక్షేమ పథకాలు చేకూరుతాయని వారు అన్నారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పొందుపరిచిన విశాఖ రైల్వే జోన్, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని బాలదేవ్, ఉమామహేశ్వరరావు, దయానిధి డిమాండ్ చేసారు.

సిసిరోడ్లతో పల్లెగ్రామాలకు కొత్తశోభ
మునగపాక, మార్చి 21: గ్రామాల్లో సిసి రోడ్లు ఏర్పాటు చేయడంతో పల్లెలకు నూతనశోభ సంతరించుకుంటుందన తిమ్మరాజుపేట సర్పంచ్ సూరిశెట్టి రాజేశ్వరీరాము అన్నారు. బుధవారం తిమ్మరాజుపేట, వాడ్రాపల్లి గ్రామాలకు లింక్‌రోడ్డుకు సిసిరోడ్డును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ఇప్పటివరకు మట్టిరోడ్లుగా ఉన్న రోడ్లు జాతీయ ఉపాధి హామీ పథకం ఎమ్మెల్యే ప్రత్యేక నిధులతో సిసి రోడ్లుగా పెద్దఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుందని, గ్రామీణ ప్రాంతాలకు సిసి రోడ్లకు పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తున్న పంచాయతీరాజ్ శాఖామంత్రి లోకేష్‌కు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సూరిశెట్టి రాము, బొడ్డేడ సత్యనారాయణ, సూరిశెట్టి అప్పారావు, భీమరశెట్టి బాలసుబ్రహ్మణ్యం పలువరు పాల్గొన్నారు.

విభజన హామీలు అమలు చేయాలని సిపిఎం ప్రచార జాతా
మునగపాక, మార్చి 21: పార్లమెంట్ బీజేపీ ఇచ్చిన విభజన హామీలన్ని తప్పక అమలు చేయాలని బుధవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండలంలో పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలను చైతన్యం చేసారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌వై జిల్లా కార్యదర్శి వివి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా నిజాలు కప్పిపుచ్చి రాష్ట్ర ప్రజలను బీజేపీ, టీడీపీలు ఒక్కటై మోసగించాయని, ఇప్పటివరకు ప్రత్యేక ప్యాకేజీ పేరుతో మభ్యపెట్టారని నేడు ప్రత్యేక ప్యాకేజీకీ కూడా నిధులు కేటాయించకుండా ఆంధ్రాప్రజలకు తీరని మోసం చేసారని, దీనిపై జిల్లాలో ఉన్న అన్నివర్గాల ప్రజలు కలసికట్టుగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కళాశాలలోను, హైస్కూల్‌లోను వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లోను సిపిఎం నాయకులు ప్రజాజాత నిర్వహించి ఉద్యమానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు గండి నాయినిబాబు, జిల్లా సిఐటియు కార్యదర్శి దాకారపుశ్రీనివాసరావు, టెక్కలి జగ్గారావు, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు ఆళ్ల మహేశ్వరరావు, బి. నూక అప్పారావు, మండల సిఐటియు నాయకులు బ్రహ్మాజీ పలువురు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా విభజన హామీలకై ప్రచార జాత
అనకాపల్లి టౌన్, మార్చి 21: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, రైల్వేజోన్ సాధనకై సిపిఎం పార్టీ విశాఖజిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో కూరగాయల మార్కెట్ వద్ద ప్రచార జాత కార్యక్రమం బుధవారం ఉదయం సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం. కృష్ణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోదాకై టీడీపీ, బీజేపి మోసకారి విధానాలను ప్రజలు అర్ధం చేసుకున్నారన్నారు. టీడీపీ ఇకనైనా మోసాలు, అబద్దాలు కట్టిపెట్టి హోదాకు సహకరించాలన్నారు. ఈనెల 21 నుండి 28వరకు జిల్లా వ్యాప్తంగా జాతరలో భాగంగా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 31న మండల కేంద్రాల్లో ధర్నాలు చేయాలని ఈ కార్యక్రమంలో జి.నాయినిబాబు, బాలకృష్ణ, మళ్ల సత్యనారాయణ, దాకారపు శ్రీనివాసరావు, బుద్ద శ్రీనివాసరావు, ఎవి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.