విశాఖ

గీత కార్మికులకు బ్రాందీషాప్ లైసెన్సుల్లో 50శాతం కేటాయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, సెప్టెంబర్ 21: గీత కార్మికుల కులవృత్తి అంతరించిపోతున్నందున వారి జీవనోపాధికి మెరుగుపరుచుకునేందుకు 50శాతం బ్రాందీషాప్ లైసెన్స్‌లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేసారు. శుక్రవారం సాయంత్రం స్థానిక చిన్నబజార్ వీధి వద్ద గీత కార్మికుల ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గీత కార్పొరేషన్‌కు రెండువేల కోట్లు నిధులు ప్రకటించాలన్నారు. అలాగే ఎటువంటి షూరిటీ లేకుండా సబ్సిడీ రుణాలను అందజేయాలన్నారు. తాటి ఆహార ఉత్పత్తి పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. గీత కార్మికులు తమ వృత్తిలో ప్రమాదవశాత్తు మరణిస్తే పదిలక్షలు, అంగవైకల్యం సంభవిస్తే ఐదులక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలన్నారు. ప్రధానంగా డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఈనెల 30వ తేదీన అడ్డురోడ్డు వద్ద నిర్వహించతలపెట్టిన భారీ బహిరంగ సభకు పార్టీలకు అతీతంగా గీత కార్మికులందరూ హాజరై సభను విజయవంతం చేసి గీత ఉపకులాల ఐక్యతను చాటిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో చోడవరం నియోజకవర్గ అధ్యక్షులు బి. శ్రీను, తుని నియోజకవర్గ అధ్యక్షులు పి. రాంబాబు, పాయకరావుపేట నియోజకవర్గ అధ్యక్షులు కె. వెంకటరమణ, సిహెచ్ లోవరాజు, ఖండిపల్లి అప్పలరాజు, ఎ. మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన వినాయక నవరాత్రి ఉత్సవాలు
చోడవరం, సెప్టెంబర్ 21: చరిత్ర ప్రసిద్ధి కలిగిన స్థానిక స్వయంభూ విఘ్నేశ్వరాలయంలో నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా శుక్రవారం ఉదయం శ్రీ గణపతి హోమం, పంచామృతాభిషేక పూజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారి ఉత్సవ విగ్రహలకు ప్రత్యేక పూజలు చేసి వివిధ వాయిద్యాల నడుమ ఎలుక వాహనంపై స్వామివారి తిరువీధి ఉత్సవం వేడుకగా సాగింది. సాయంత్రం ఆరుగంటలకు స్వామివారికి పూనంగి సేవ, విశేష పుష్పార్చన పూజలు ఎంతో నియమ నిష్టలతో నిర్వహించారు. వేదపండితులు, ఘనాపాటీలు చతుర్వేద పారాయణం, నీరాజన మంత్రపుష్ప పూజలు చేసారు. వేద పండితుల ఆశీర్వచనం, పండిత సత్కారం జరిగింది. ఈ పూజలలో ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు, గోవాడ సుగర్స్ మాజీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు, ఎంపీపీ గూనూరు కొండతల్లి, జెడ్పీటిసి కనిశెట్టి మత్స్యరాజు, మాజీ ఎంపీపీ గూనూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
గిరిజనుల ముంగిట న్యాయస్థానం
* సివిల్ కేసుల పరిష్కారానికి సరికొత్త విధానం
* అనతికాలంలోనే అత్యధిక కేసుల పరిష్కారం
పాడేరు, సెప్టెంబర్ 21: విశాఖ ఏజెన్సీలో గిరిజనులు ఎదుర్కొంటున్న సివిల్ కేసుల సత్వర పరిష్కారానికి ఏజెన్సీ సబ్ జడ్జిగా బాధ్యతలు వహిస్తున్న పాడేరు సబ్ కలెక్టర్ డి.కె.బాలాజి వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. గిరిజనులకు చెందిన వివిధ అంశాలపై దాఖలైన సివిల్ కేసులను ఇంతవరకు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ప్రత్యేక న్యాయస్థాన మందిరంలో విచారణ చేస్తూ పరిష్కారం చేస్తుండగా సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన బాలాజి గిరిజనుల ముంగిటనే కోర్టు నిర్వహిస్తూ కేసులను త్వరితగతిన పరిష్కరించడంలో విశేష కృషి చేస్తున్నారు. విశాఖ గిరిజన ప్రాంతం భౌగోళికంగా ఎంతో విస్తరించి ఉండడంతో ఏజెన్సీలోని పదకొండు మండలాల నలుమూలల నుంచి గిరిజనులు తమ తమ సివిల్ కేసులను పరిష్కరించుకునేందుకు పాడేరు రావాల్సిన పరిస్థితి ఇంతవరకు ఉండేది. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉండే న్యాయస్థాన గదిలో ఈ కేసులను విచారిస్తూ వాయిదాల పర్వంతో సంవత్సరాల తరబడి గిరిజనులు ఈ కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి ఉండడంతో వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనేవారు. సబ్ కలెక్టర్‌గా ఉన్న వారు ఏజెన్సీ సబ్ జడ్జిగా అదనపు బాధ్యతలు వహిస్తుండడంతో ఆయనకు అవకాశం ఉన్నప్పుడు కోర్టులు నిర్వహించడం, లేనిపక్షంలో వారాలు, నెలల తరబడి కేసులు వాయిదాలతో నడుస్తుండడం పరిపాటిగా జరిగేది. దీంతో కోర్టు వాయిదాపై వచ్చిన గిరిజనులకు ఆ రోజు సబ్ కలెక్టర్ అత్యవసర పనులపై వెళ్లిపోవలసి వచ్చేటప్పుడు కేసు వాయిదా పడుతూ ఉండేది. ఈ సందర్భంలో సుదూర ప్రాంతాల నుంచి కోర్టు పనులపై వచ్చే గిరిజనులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవడమే కాకుండా తమ తమ కేసుల పరిష్కారానికి సుదీర్ఘకాలంగా వేచి ఉండాల్సి వచ్చేది. అయితే పాడేరు సబ్ కలెక్టర్‌గా 2017 అక్టోబర్ నెలలో బాధ్యతలు స్వీకరించిన బాలాజి ఈ పరిస్థితిని అధ్యయనం చేసి గిరిజనులకు ఇబ్బందులు కలుగకుండా వారి ముంగిటనే కోర్టు నిర్వహించి త్వరితగతిన కేసులను పరిష్కరించేందుకు నడుం బిగించారు. సబ్ కలెక్టర్ తీసుకున్న ఈ వినూత్న నిర్ణయంతో ఏజెన్సీలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఎన్నో కేసుల పరిష్కారానికి మోక్షం లభించిందనే చెప్పాలి. గత పది నెలల కాలంలో ఏజెన్సీలో వందకు పైగా కేసులను ఆయన పరిష్కరించి గిరిజనుల ఇబ్బందులను నివారించడంలో సఫలీకృతులయ్యారు. ఏజెన్సీలోని గిరిజనులు అధికంగా భూ, ఆస్థి తగాదాలతో పాటు కుటుంబ కలహాలకు చెందిన కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులన్నీ సబ్ కలెక్టర్ పరిధిలోని ఏజెన్సీ సబ్ డివిజనల్ కోర్టు మాత్రమే విచారించి తగిన న్యాయం చేయాల్సి ఉంది. అయితే బాలాజి సబ్ కలెక్టర్‌తో పాటు ఏజెన్సీ సబ్ జడ్జిగా కూడా బాధ్యతలు నిర్వర్తిసుండడంతో గిరిజనులు తమ తమ తగాదాల పరిష్కారానికి కోర్టు పని నిమిత్తం పాడేరు రాకుండా ఉండేందుకు వారి చెంతకే వెళ్లి ఇరువురి కక్షిదారులను విచారిస్తూ అక్కడికక్కడే తీర్పులను వెలువరించే విధానాన్ని తీసుకురావడం కేసుల పరిష్కారం సులభతరమై గిరిజనులకు ఎంతో ఉపయుక్తంగా మారింది. ఏజెన్సీలో ఇంతవరకు అనంతగిరి మండలంలో 13, అరకులోయలో 15, డుంబ్రిగుడలో 10, హుకుంపేటలో 13, పాడేరులో 16, పెదబయలులో మూడు, ముంచంగిపుట్టలో ఆరు, జి.మాడుగులలో రెండు, గూడెంకొత్తవీధిలో మూడు, చింతపల్లిలో 10, కొయ్యూరు మండలంలో పది కేసుల వంతున ఆయన పరిష్కరించి గ్రామాలలోనే తీర్పులు వెలువరించినట్టు కోర్టు వర్గాలు తెలిపాయి. గిరిజనుల చెంతనే కోర్టును నిర్వహించి వారి సమస్యలను సత్వరమే పరిష్కరించడం వలన వ్యవస్థపై వారికి విశ్వాసం మరింత పెరిగే అవకాశం ఉందని సబ్ కలెక్టర్ బాలాజి చెప్పారు. ప్రభుత్వ అధికారులు తమ కోసమే పనిచేస్తున్నారనే భావన గిరిజనులలో దీనివలన కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

క్వారీ దీక్షకు కులపాడు గిరిజనులు మద్దతు
పాడేరు, సెప్టెంబర్ 21: హుకుంపేట మండలం గూడ గ్రామం వద్ద నిర్వహిస్తున్న నల్లరాయి క్వారీని మూసివేయాలని డిమాండ్ చేస్తూ క్వారీ పరిసర ప్రాంత గిరిజనులు చేస్తున్న రిలే దీక్షకు కులపాడు గ్రామ గిరిజనులు బాసటగా నిలిచారు. స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయం ఎదుట గత 78 రోజులుగా చేపడుతున్న రిలే దీక్షలలో కులపాడు గ్రామానికి చెందిన గిరిజనులు శుక్రవారం పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. గూడ గ్రామం వద్ద నిర్వహిస్తున్న నల్లరాయి క్వారీ వలన తాము కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు చెప్పారు. క్వారీలో జరుపుతున్న పేలుళ్ల వలన తమ మనుగడ ప్రమాదకరంలో పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేసారు. క్వారీ పేలుళ్లతో తమ పంట పొలాలు, ఇళ్లు దెబ్బతింటున్నాయని, దీంతో నిత్యం భయంభయంతో బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు అన్నారు. ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించకుండా గ్రామ సభ తీర్మానం లేకుండా క్వారీ నిర్వహిస్తూ అనేక గ్రామాల గిరిజనులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు వాపోయారు. దీంతో తాము ఇటీవల గ్రామ సభను నిర్వహించి క్వారీని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినట్టు వారు చెప్పారు. గిరిజనులకు నష్టాన్ని కలిగిస్తున్న ఈ క్వారీని మూసివేసేందుకు అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కులపాడు గ్రామస్తులు కె.సత్యనారాయణ, కె.మధు, కె.బాలక్రిష్ణ, ప్రశాంత్, కోటిబాబు, ప్రసాద్, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

వాలీబాల్ పోటీల్లో పాడేరు విద్యార్థుల ప్రతిభ
పాడేరు, సెప్టెంబర్ 21: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ నెల 18,19వ తేదీలలో నిర్వహించిన అంతర్ డిగ్రీ కళాశాలల వాలీబాల్ పోటీలలో పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ద్వితీయ స్థానాన్ని సాధించారు. మహిళా విభాగంలో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో ఈ కళాశాల బాలికలు తృతీయ స్థానం చేజిక్కించుకున్నారు. వాలీబాల్ పోటీల్లో ప్రతిభా పాటవాలను కనబరిచిన స్థానిక డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత