విజయవాడ

అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే పోటీ నుండి తప్పకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, ఏప్రిల్ 14: తాను ఒక్క అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే ఐలా చైర్మన్ అభ్యర్థిగా పోటీ నుండి తప్పకుంటానని ఐలా మాజీ ఛైర్మన్, ప్రస్తుత అభ్యర్థి సుంకర దుర్గాప్రసాద్ ప్రత్యర్థి ప్యానల్ వర్గానికి సవాల్ విసిరారు. శుక్రవారం ఆటోనగర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న జరగనున్న ఎపిఐఐసి ఐలా ఎన్నికల నేపథ్యంలో ఐలా ప్రత్యర్థి వర్గం సుంకర ప్యానల్ వర్గంపై చేస్తున్న ఆరోపణలకు దుర్గప్రసాద్ ఘాటుగా స్పందించారు. ఐలా చైర్మన్‌గా తన హయాంలో గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నడు జరగని విధంగా కోట్లాది రూపాయలు నిధులు సమీకరించి అటోనగర్‌ను ఏ విధంగా అభివృద్ధి చేశామో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. పత్యర్థి ప్యానల్‌కు ఓటమి భయం పట్టుకొని ఐలా ఎన్నికల్లో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఐలా ఎన్నికల అధికారి వెంక్రటావు వద్ద నుంచి తమ పత్యర్థి ప్యానల్ వర్గం సభ్యులు బలవంతంగా ఎన్నికలకు సంబంధించిన పత్రాలు లాక్కొని, మరల ఎన్నికల అధికారిపైనే దూషణలకు దిగటం వారికి అలవాటేనన్నారు. ఈ నెల 21న నిబంధనల ప్రకారం ఐలా ఎన్నికలు జరిగితీరుతాయని అన్నారు. ఎన్నికల ఓటమి వారిని వెంటాడుతున్నందునే ఐలా ఎన్నికలు వాయిదా వేయాలని కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. తనపై అవినీతి చేస్తున్నవారు బహిరంగ చర్చకు సిద్ధమా అని మరోసారి పత్యర్థి పానల్‌కు సవాల్ విసిరారు. తమ ప్యానల్ తరుపున పోటీ చేస్తున్న కార్యవర్గ సభ్యులకు దేవుడిచ్చిన ఆస్తి ఉందని రాజకీయాలు, పదవులు అడ్టుపెట్టుకుని సంపాదించాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజలకు సేవ చేయటానికే మరల రెండోసారి ఐలా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని చెప్పారు. ఎంతో మంది పెద్దలు కృషి ఫలితంగా జవహార్ ఆటోనగర్ అభివృద్ధి జరిగిందన్నారు. అటువంటి ఆటోనగర్ గౌరవ ప్రతిష్టలను పత్యిర్థి పాన్యల్ వర్గ సభ్యులు బజారుకీడ్చడం వారి దివాలా కోరు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ఐలా ఎన్నికల్లో కులాలు అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకునేవారికి ఓటర్లే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ సమావేశంలో ఐలా మాజీ సెక్రటరీ పంచుమర్తి ప్రసాదరావు, ఐలా మాజీ కోశాధికారి అనే్న శివనాగేశ్వరరావు, ఐలా మాజీ జాయింట్ సెక్రటరీ బాయన బాబూజీ తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రి కామినేని
బెంజిసర్కిల్ : డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనకు అనుగుణంగా ప్రధాని నరేంద్రమోడీ పాలన అందిస్తున్నారని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. అంబేద్కర్ 126 జయంతి వేడుకలు సూర్యారావుపేటలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపా నేతలు అంబేద్కర్ చిత్రపఠానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా మంత్రి కామినేని మాట్లాడుతూ శ్యాంప్రకాష్ ముఖర్జీ, దీనదయళ్ ఉపాధ్యాయ, అంబేద్కర్ ఆశయాల సాధన భాజపాతోనే సాధ్యమన్నారు. అంబేద్కర్‌ను భారదేశ ముద్దుబిడ్డగా ఆయన కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనలను కార్యరూపమివ్వడమే ఆయనకిచ్చే నిజమైన నివాళిగా తెలిపారు. కార్యక్రమానికి భాజపా ఎస్‌సిమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దారం సాంబయ్య అధ్యక్షత వహించగా జమ్ముల కిషోర్, శ్రీనివాసరాజు, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు.

అలరించిన సప్తతాండవ నృత్యం
విజయవాడ (కల్చరల్), ఏప్రిల్ 14: తెలుగుజాతి సంస్కృతికి కూచిపూడి నృత్యం మకుటాయమానమని, ఆ నృత్యాన్ని కాపాడటానికి ప్రభుత్వం తనవంతు సహకారం అందిస్తోందని సప్త తాండవ నృత్య కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. భాషా సాంస్కృతికశాఖ సంచాలకులు డి.విజయభాస్కర్ గౌరవ అతిథిగా హాజరై కళాకారులను అభినందించారు. స్థానిక మొగల్రాజపురం, మధుమాలక్ష్మి ఛాంబర్స్‌లోని ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతిలో జరిగిన నెలవారీ నృత్యోత్సవం నాట్యస్రవంతి పరంపరంలో భాగంగా సురేంద్రనాథ్ బృందం సప్తతాండవ కూచిపూడి నృత్యం ప్రేక్షకులను అలరించింది. ఆనంద తాండవంగా ప్రారంభమై సంధ్య, కాళిక, విజయ, ఊర్థ్వ, ఉమా, సంహార తాండవాలను సురేంద్రనాథ్, అక్షర, దీక్షితులు, సృష్టినిధి, ప్రసాదరాయుడు, విజయసాగర్, శిరీష, మనీషలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ప్రదర్శించారు. ఆనంద తాండవాన్ని గౌళిరాగం, ధృవతాళంలోనూ, సంధ్యా తాండవాన్ని, సాలంబ రాగం, మత్స్య తాళంలోనూ, కాళికా తాండవాన్ని హంసధ్వని రాగం, రూపక తాళంలోనూ, విజయ తాండవాన్ని బిళహరి రాగం, జంపతాళంలోనూ, ఊర్థ్వ తాండవాన్ని బృందావని రాగం, త్రిపుటి తాళంలోనూ, ఉమా తాండవాన్ని రంజనిరాగం, ఆటతాళంలోనూ చివరిదైన సంహార తాండవాన్ని లవంగి రాగం, ఏకతాధరిలోనూ తాండవం-శివతాండవం అన్న పల్లవితో నాట్యం జనరంజకంగా సాగింది. నర్తక, నర్తకీమణుల హావ, భావ, అభినయ చాతుర్యం ప్రేక్షకులను మైమరపించింది. కార్యక్రమంలో ఘంటసాల సంగీత నృత్య కళాశాల నాట్యాచార్యులు భాగవతుల వెంకటరామశర్మ, అజయ్‌కుమార్, జెఎంఎస్ యోగభారతి చక్రవర్తి, గోళ్ళ నారాయణ, రాధా మాలక్ష్మి ప్రాపర్టీస్ సిఈవో మండవ, ఈమని శివనాగిరెడ్డి పాల్గొన్నారు.