విజయవాడ

గిరిజన గ్రామాల్లో రోడ్లకు ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 20: రాష్ట్రంలోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థల ప్రాజెక్టు అధికారులు, సహాయ ప్రాజెక్టు అధికారులు, జిల్లాల గిరిజన సంక్షేమ అధికారులు, ఉప సంచాలకులు, గురుకులం అధికారులతో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌ను గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్‌పి సిసోడియా గురువారం ప్రారంభించారు. రెండు రోజుల ఈ సమావేశం హోటల్ ఐలాపురం కనె్వన్షన్ హాలులో ఏర్పాటు చేశారు. ఈ సంవత్సర ఆరంభం నుండి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం అమలుచేయటానికి ప్రతి అధికారి చిత్తశుద్ధితో పనిచేయాలని సిసోడియా ఆదేశించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రతి సంవత్సరం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ గ్రామాలకు రోడ్లు, నీటి సరఫరా, వైద్య, ఇతర వౌలిక సదుపాయాల కొరత ఉందని, దానిని అధిగమించటానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జనాభా ప్రాతిపదికన రోడ్డు సౌకర్యం లేని గ్రామాలను ఎంపిక చేసి అవసరం మేరకు సిసి రోడ్లు, ప్రధాన రహదారిని కలిపే రోడ్లు, ఇతర రహదారులు సంతృప్త విధానంలో అన్ని గ్రామాలకు రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించి అమలుచేయాలని ఆర్‌పి సిసోడియా ఆదేశించారు. గ్రామాలకు విద్యుదీకరణ, నీటి సరఫరా, వైద్య సదుపాయం ఏర్పాటు, గిరిజనుల జీవనోపాధికి సంబంధించిన పథకాలు, యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు, ఇతర వౌలిక సౌకర్యాల ఏర్పాటు వంటి కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి అమలు చేయాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాలలో రక్తహీనత, మలేరియా వంటి ఆరోగ్య సమస్యలను నివారించటానికి తగిన విధంగా ప్రణాళికలు రూపొందించాలని, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి గిరిజన కుటుంబం నెలకు కనీసం 10 వేల రూపాయలు ఆదాయం వచ్చేవిధంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది అందరూ ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ప్రతిపాదిత పనులు అమలు చేయటానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్ డా.ఎం.పద్మ తెలిపారు. గిరిజన ప్రాంతాలలో భూబదిలీ చట్టం (ఎల్‌టిఆర్) అమలు చేయటం ద్వారా వారి భూమికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని, విద్య, ఉపాధి, వౌలిక సదుపాయాలు కల్పించటం, వైద్య సౌకర్యాలు ప్రధానంగా పరిగణలోకి తీసుకొని అమలు చేయాలని ఆమె తెలిపారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు, బివి బాలయోగి, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారులు, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొని 2017-18 సమగ్ర ప్రణాళిక రూపొందించటానికి అవసరమైన సూచనలు చేశారు.

ఎన్నికల హామీలు అమలు చేయండి
* సిపిఎం నేత మధు డిమాండ్
బెంజిసర్కిల్, ఏప్రిల్ 20: ఎన్నికల సమయంలో పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించకూడదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అమలు చేయకపోవడం దారుణమని గురువారం ముఖ్యమంత్రికి రాసిన లేఖలో ఆయన విమర్శించారు. హామీకి భిన్నంగా ఇప్పుడు కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయలేమని, సాధ్యం కాదని చెప్పడం వారిని మోసగించడమేనన్నారు. వారికి పెంచిన జీతాలు కూడా 10వ పిఆర్‌సి బేసిక్ కంటే తక్కువగా ఉన్నాయన్నారు. కాంట్రాక్టు కార్మికులకు వేతనాలను 104 శాతం పెంచాలని, వారిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
సమాన పనికి సమాన వేతనమివ్వాలి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, పార్ట్‌టైమ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతో పాటు వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏపి స్టేట్ కాంట్రాక్టు అండ్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ఆర్గనైజింగ్ కార్యదర్శులు ఎవి నాగేశ్వరరావు, ఎం బాలకాశి విజ్ఞప్తి చేశారు. త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన వేతనం ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని గురువారం వారు విలేఖరుల సమావేశంలో కోరారు. మహిళలకు 180 రోజులు వేతనంతో కూడిన మెటర్నటీ లీవు సౌకర్యాన్ని కల్పించాలన్నారు. 10వ పిఆర్‌సి ప్రకారం వారికి 106 శాతం వేతనాలు పెంచాలన్నారు. ఎన్నికల సమయంలో కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.