విజయవాడ

జగన్ కేసులో అసంపూర్తిగా సిబిఐ దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 27: జగన్ కేసుల్లో సిబిఐ దర్యాప్తు అసంపూర్తిగా ఉంది.. ఎందుకో జగన్ పట్ల సిబిఐ చివరి దశలో ఉదాసీనంగా వ్యవహరించిందని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. గురువారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిబిఐ ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే ఇంకొంత అవినీతి బయటపడేదన్నారు. ఆరు దేశాల్లో జగన్ మనీలాండరింగ్‌కు పాల్పడినట్లుగా స్పష్టమైన సమాచారం సిబిఐ వద్ద ఉందన్నారు. ఈ ఆరు దేశాల నుండి సమాచారం కోరుతూ సిబిఐ లెటర్ ఆఫ్ రెగోటరీ విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా ఆయా దేశాలకు పంపిందన్నారు. కానీ ఆ సమాచారం పూర్తిగా సేకరించకుండానే చార్జిషీట్లు వేసి దర్యాప్తు ముగించటం ఎంతవరకు సమంజసమని రామయ్య ప్రశ్నించారు. సిబిఐ ఇంకొంచెం చొరవ చూపి విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా ఆరు దేశాల నుండి జగన్ మనీలాండరింగ్ సమాచారం సిబిఐ కోర్టు ముందు ఉంచితే ఇంకా అవినీతి బట్టబయలయ్యేదన్నారు. ఏ-1 జగన్, ఏ-2 విజయసాయిరెడ్డి అన్నిసార్లు ఆయా దేశాలకు వెళ్లింది సమాచారం సేకరించటంలో సిబిఐ విఫలమైందన్నారు. వాళ్లిద్దరి పాస్‌పోర్టులు పరిశీలిస్తే ఇద్దరూ దొరికేవారని స్పష్టం చేశారు. ఇప్పటికైనా సిబిఐ విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా ఒత్తిడి తెచ్చి జగన్ విదేశాల్లో మనీలాండరింగ్ సమాచారాన్ని సేకరించి కోర్టులో అడిషనల్ చార్జిషీట్ దాఖలు చేయాలని కోరారు. లేదంటే ఈ కేసు కూడా విజయ్‌మాల్యా కేసులాగా భారతదేశ చట్టాలను వెక్కిరిస్తుందన్నారు. స్వదేశంలో కూడా జగన్ కంపెనీలైన కార్మెల్ ఏసియా, సిలికాన్ బిల్డర్స్, క్లాసిక్ రియాల్టీ, హిముర్జీ ఇన్‌ఫ్రా, ఆకాష్ ఎస్టేట్స్, మార్వెల్ ఇన్‌ఫ్రా, షాలొమి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌స్పైర్ హోటల్స్, క్యాప్‌స్టన్ ఇన్‌ఫ్రా, ఉటోపియా ఇన్‌ఫ్రా, ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సికార్ కంపెనీల్లో జగన్ పెట్టుబడులు కూడా సంపూర్తిగా దర్యాప్తు చేసినట్లుగా కనపడటం లేదన్నారు. ఒక వ్యక్తి అందునా అతని తండ్రి ముఖ్యమంత్రి కాక ముందు ఏ కంపెనీ లేని వ్యక్తి తన తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకుని ఇన్ని కంపెనీలు నెలకొల్పటం సాధ్యమా అనే రీతిలో దర్యాప్తు చేయటంలో సిబిఐ విఫలమైందన్నారు. ఇవే కాకుండా కోల్‌కతా, ముంబయి ల్లోని బ్రీఫ్‌కేస్ కంపెనీల సమాచారం కూడా అసంపూర్తిగానే సిబిఐ సేకరించిందన్నారు. ఇటీవల ఏ-1 జగన్, ఏ-2 విజయసాయిరెడ్డి కలిసి మారిషస్‌లో పెద్దసంఖ్యలో బొగ్గు గనులు కొని ఉద్ధృతంగా బొగ్గు ఎగుమతి చేస్తున్నట్లుగా సమాచారం సిబిఐ దగ్గర ఉందన్నారు. ఈ దశలో కూడా సిబిఐ దర్యాప్తు చేయాలని కోరారు.

సామాజిక స్పృహ అవసరం
* ఉన్నతాధికారుల సమీక్షలో డిజిపి నండూరి
* సిబ్బందికి మార్చినెల ఐపిఎస్ అవార్డుల ప్రదానం
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 27: ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించటంతో పాటు సామాజిక స్పృహను పెంపొందించుకోవాలని డిజిపి నండూరి సాంబశివరావు అన్నారు. విధి నిర్వహణలో సామాజిక సేవలు అందిస్తున్న పోలీసు శాఖలోని సిబ్బందికి ప్రతినెలా ఇచ్చే ప్రత్యేక ఐపిఎస్ (ఇంప్రెసివ్ పబ్లిక్ సర్వీస్) అవార్డులను మార్చి నెలకు గాను ఎంపిక చేసిన ముగ్గురికి గురువారం ఆయన అందచేశారు. ఈసందర్భంగా విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీసు సిబ్బంది తమ విధులు నిర్వహిస్తూనే సమాజ వికాసానికి తోడ్పడే పనులు, ప్రయత్నాలు కూడా చేయాలని నండూరి పిలుపిచ్చారు. అలా ప్రజల సేవలో భాగస్వాములయ్యే సిబ్బందిని ప్రత్యేకంగా గుర్తించి ఐపిఎస్ అవార్డులు అందించడం ద్వారా మరింత ప్రోత్సాహం ఇచ్చినట్లువుతుందని ఉన్నతాధికారులకు సూచించారు. అనంతరం ఆయన సిబ్బందికి ఐపిఎస్ అవార్డులు అందచేశారు. రాజమండ్రి అర్బన్ సేవాదళ్ సభ్యుడైన కానిస్టేబుల్ వై శ్రీనివాస్‌కు మొదటి అవార్డు లభించింది. గత మార్చి 8న అనూష అనే భక్తురాలు దర్శనం ముగించుకుని మెట్లదారిలో తిరిగి వెళుతూ తీవ్ర అస్వస్థతకు గురికాగా గమనించిన శ్రీనివాస్ ఏకంగా 419 మెట్లు ఆమెను మోసుకెళ్లి వైద్య శిబిరంలో చేర్చాడు. దీంతో ఆమె రెండు గంటల తర్వాత కోలుకుంది. అయితే తర్వాత దురదృష్టవశాత్తు కానిస్టేబుల్ శ్రీనివాస్ ఈ నెల 5న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఐపిఎస్ అవార్డు మొత్తాన్ని రెండింతలు చేసి అతని తల్లిదండ్రులకు, భార్య పిల్లలకు అందచేశారు. ద్వితీయ అవార్డు విజయవాడకు చెందిన ఎస్‌ఐ అబ్దుల్ సలీం, కానిస్టేబుల్ మహ్మద్ మస్తాన్‌లకు లభించింది. భవానీపురం వద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో చిక్కుకున్న ఇద్దరు కూలీలను రక్షించే ప్రయత్నంలో భాగంగా 18 అడుగుల లోతులోకి దిగి సహాయక చర్యలు అందించినందుకు వీరిద్దరికీ ఐపిఎస్ అవార్డు అందచేశారు. అనంతపురానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ రజకులయ్యప్ప, కానిస్టేబుల్ ఏ నాగార్జునలకు తృతీయ అవార్డు లభించింది. అదృశ్యమైన మూడేళ్ల చిన్నారిని కేవలం చిన్నపాటి వీడియో ఫుటేజీ అధారంగా గుర్తించి నేరస్తులను కూడా పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచినందుకు డిజిపి వీరికి అవార్డు అందచేశారు. సమీక్ష సమావేశంలో రేంజ్ ఐజీలు, డిఐజిలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.