విజయవాడ

వ్యాపారి కిడ్నాప్‌తో అలజడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెజవాడలో మళ్లీ పాత రోజులొస్తున్నట్లున్నాయ్! ఒకప్పుడు గూండాలు, రౌడీలు రాజ్యమేలేవారు. తర్వాత వారే రాజకీయ నేతల అవతారమెత్తి శాసించారు. ఈ కోవలో వ్యాపారులు, ఫైనాన్సియర్లు రంగప్రవేశం చేశారు. ప్రతి దశలోనూ కొందరు పోలీసుల అండదండలు మెండుగా ఉండేవి. దీంతో దందాలు, సెటిల్‌మెంట్లు, కిడ్నాప్‌లు జరుగుతుండేవి. కొందరు కచ్చితమైన పోలీసు కమిషనర్లు అడుగుపెట్టాక వీటన్నింటికీ బ్రేక్ పడింది. దందారాయుళ్లను కటకటాల వెనక్కు నెట్టి జైలుకు కూడా పంపారు. అయితే ఇప్పుడు నవ్యాంధ్ర రాజధానిలో మళ్లీ ఆ పరిస్థితులకు బీజం పడుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పుడు డాక్టర్లే దందాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా వీరికి పోలీసు అండదండలు పుష్కలంగా ఉన్నాయి. మొత్తమీద ఈ తరహా కార్యకలాపాలు సాగేందుకు వీలులేదని సీపీ గౌతం సవాంగ్ తాజా హెచ్చరికలు జారీ చేశారు. ప్రమేయమున్న పోలీసులపై కొరఢా ఝుళిపించి ఈవిషయం చెప్పకనే చెప్పారు!

విజయవాడ (క్రైం), మే 16: ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న కొందరు ప్రముఖ వైద్యులు సిండికేట్‌గా ఏర్పడి దందాలు సాగిస్తున్నారు. కోట్ల రూపాయల డీల్స్ చేస్తూ.. వికటిస్తే కిడ్నాప్‌లు, దాడులు సాగిస్తున్నారు. వీరికి పోలీసు అధికారులు సైతం వంత పాడుతున్నారు. తాజాగా సీపీని ఆశ్రయించిన ఓ బాధితుని ఫిర్యాదు మేరకు ఈ దందా వ్యవహారం వెలుగుచూసింది. పటమట కోనేరు వారి వీధికి చెందిన తమ్మారెడ్డి బ్రహ్మాజీరావు(66) రంగురాళ్ళ వ్యాపారం చేస్తుంటాడు. రాళ్ళతోపాటు గ్రానైట్ కూడా జపాన్, తైవాన్ వంటి ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తున్నాడు. ఈయనకు పెద్దపెద్ద ఫైనాన్సియర్లు, ప్రముఖులతో పరిచయాలున్నాయి. దీంతో భారీగా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు. దీనిలో భాగంగా కొందరు వైద్యులు పరిచయమయ్యారు. వీరిలో నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ పువ్వాడ రామకృష్ణ, హేమంత్, రవి, మరికొందరు కలిసి ఏర్పాటైన సిండికేట్ బ్రహ్మాజీరావును ఆశ్రయించి డీల్ కుదుర్చుకున్నారు. తాతాజీ అనే ప్రైవేటు ఫైనాన్సియర్ వద్ద ఐదు కోట్లు రుణం ఇప్పించాలనేది డీల్. ఇందుకోసం డాక్టర్లు బ్రహ్మాజీరావుకు కోటి రూపాయలు ముట్టచెప్పినట్లు సమాచారం. అయితే డీల్ వికటించడంతో బ్రహ్మాజీరావు రుణం ఇప్పించలేకపోయాడు. మరి కోటి రూపాయలు తిరిగి ఇవ్వాలని వైద్యులు నిలదీశారు. ఇక్కడే ఇరువర్గాల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. వీటిని పురస్కరించుకుని డాక్టర్లు బ్రహ్మాజీరావును కిడ్నాప్ చేశారు. ఈ నెల 14న రాత్రి ఇంటి వద్ద ఉన్న బ్రహ్మాజీరావుకు ఫోన్ వచ్చింది. తాతాజీ కె హోటల్‌లో ఉన్నాడని చెప్పి కారు పంపారు. దీంతో కారులో వెళ్లిన బ్రహ్మాజీరావు ఆరోజు రాత్రంతా తిరిగి రాలేదు. కుటుంబ సభ్యలు విచారించి కె హోటల్‌కు వెళ్ళగా అక్కడ తాతాజీ పేరుతో రూము లేదని తెలిసింది. దీంతో పటమట పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బ్రహ్మాజీరావును తీసుకెళ్లిన వైద్యులు నున్న శివారు ప్రాంతంలోని ఓచోట బంధించి చితకబాదారు. పోలీసులు రంగంలోకి దిగారని తెలుసుకున్న వారు 15న ఉదయం ఇంటి వద్ద వదిలేసి వెళ్లారు. దీంతో బాధితుడు పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్‌ను ఆశ్రయించాడు. సీపీ విచారణకు ఆదేశించిన మీదట ఈ మొత్తం వ్యవహారంలో ట్రాఫిక్ ఎసిపి కె సూర్యచంద్రరావు డాక్టర్లకు అండగా నిలిచినట్లు వెల్లడైంది. కేసులో పటమట సిఐ సరిగా వ్యవహరిచలేదని తేలింది. దీంతో ఎసిపిని డిజి కార్యాలయానికి సరెండర్ చేస్తూ, పటమట కెనడీని వెకెన్సీ రిజర్వుకు సాగనంపారు. నిందితులైన పువ్వాడ రామకృష్ణ, చలపాటి రవి, సన్నీ, చలపాటి వెంకటేశ్వరరావు, శ్రావణ్, మరో ఆరుగురిపై కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు పటమట పోలీసులు వివరించారు. వారి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బాధితుడు బ్రహ్మాజీరావు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అటోనగర్ అభివృద్ధికి ముందుకొచ్చిన జర్మనీ ఆరీపో కన్సల్టెన్సీ
పటమట, మే 16: అసియా ఖండంలోనే అతిపెద్ద ఆటోనగర్‌గా పేరుగాంచిన జవహార్ ఆటోనగర్‌లో వౌళిక సదుపాయాలు కల్పించేందుకు జర్మనీకి చెందిన ఆరీపో కనె్సల్టెన్సీ ప్రతినిధులు క్రిస్టిన్, క్రిసిల్ షరాత్‌షా శనివారం ముందుకోచ్చారు. ఈ మేరకు మంగళవారం ఆటోనగర్‌లో పలు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆటోనగర్ ఎపిఐఐసి- ఐలా కార్యాలయంలో ఐలా చైర్మన్ సుంకర దుర్గాప్రసాద్, కమిషనర్ కె,విజయకుమారితో ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐలా చైర్మన్ సుంకర దుర్గప్రసాద్ మాట్లాడుతూ జర్మనీ సంస్ధ ఆటోనగర్‌లో వౌళిక సదుపాయాలు కల్పించటానికి ఎపిఐఐసి వారి భాగస్వామ్యంతో 75:25 నిష్పత్తితో నిధులు మంజూరు చేసే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారని అన్నారు. ఈ నిధులు కనుక మంజూరైతే ఆటోనగర్‌లో ట్రీట్‌మెంట్ ప్లాంట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, గ్రీనరీ, త్రాగునీరు తదితర అభివృద్ధిపనులు శరవేగంగా చేయవచ్చని అన్నారు. సిఎం చంద్రబాబుకు నూతన ఆటోనగర్‌కు స్ధలం కేటాయించాలని వినతిపత్రం సమర్పిటం జరిగిందని, చంద్రబాబు నూతన ఆటోనగర్‌కు స్ధలం మంజూరు చేసినట్లయితే జర్మనీ, ఎపిఐఐసి వారి సంయుక్త భాగస్వామ్యంతో నూతన ఆటోనగర్‌ను అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐలా సెక్రటరీ అనే్న శివనాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ మహాబూబ్ ఖాన్, వార్డు సభ్యులు షేక్ హుస్సేన్, ఎస్‌వివి ప్రసాద్, పి.రాజగోపాల్, వి.కృష్ణమూర్తి, దివాకరరావు తదితరులు పాల్గొన్నారు.