విజయవాడ

నగరాభివృద్ధికి సమష్టి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్): దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన విజయవాడ నగరం నాటి ఉద్యమ స్ఫూర్తితో నేడు అందరూ సమిష్టి కృషి చేసి సమగ్రాభివృద్ధికి దోహదపడాలని విఎంసి కమిషనర్ జె నివాస్ పిలుపునిచ్చారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నగరంలోని విఎంసి కార్యాలయంలో జరిగిన వేడుకల్లో తొలుత నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఎన్‌సిసి విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కమిషనర్ నివాస్ మాట్లాడుతూ జిల్లా టూరిజం విడుదల చేసిన 2 కోట్ల నిధులతో బందర్ కాల్వగట్టు అభివృద్ధికి చర్యలు తీసుకొంటున్నామని, పుష్కరాల ఘాట్‌ల నిర్వహణపై మరో 80 లక్షలతో వివిధ పనులు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా అండర్ గ్రౌండ్ స్మార్ట్ డంపర్ బిన్లను ఏర్పాటుచేసుకొన్న నగరంలో పారిశుద్ధ్యానికి విస్తృత ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ప్రధాన పార్కుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేస్తుండగా నగర వ్యాప్తంగా పది వేల మొక్కలను నాటించి వారి సంరక్షించేందుకు ట్రీగార్డులను కూడా ఏర్పాటుచేశామన్నారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ కాలుష్య నివారణకు 10 బ్యాటరీ వాహనాలను కొనుగోలు చేశామని, విఎంసి పాఠశాలల విద్యార్థుల విద్యాభ్యున్నతికై ఫౌండేషన్ కోర్సులు, డిజిటల్ క్లాస్ రూమ్‌లను నిర్వహిస్తున్నామన్నారు. నగరంలో నిర్వహించే హ్యాపీ సండే కార్యక్రమాలు రాష్ట్రానికే స్ఫూర్తిగా నిలిచి ఇతర మున్సిపాలిటీల్లో కూడా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా 30 మంది నిరుద్యోగులకు కారుణ్య నియామకపు ఉత్తర్వులను అందించిన కమిషనర్ నివాస్ విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన 175 మంది ఉద్యోగులకు ప్రశంశా పత్రాలను అందించారు. ఈసందర్భంగా విఎంసి పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.