విజయవాడ

ఇళ్ల రిజిస్ట్రేషన్లకు సమైక్య ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 19: నగరంలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ల కోసం సమైక్యంగా ఉద్యమిద్దామని అఖిల పక్ష నేతలు పిలుపునిచ్చారు. శాంతినగర్, బసవతారకనగర్, అయోధ్యనగర్, అరుణోదయనగర్, సుబ్బరాజు నగర్ ప్రాంతాల్లో ఇళ్ల పట్టాదారులందరికీ నామమాత్రపు ధరకే సత్వరం రిజిస్ట్రేషన్లు చేయాలని కోరుతూ మంగళవారం 51వ డివిజన్ ఇళ్లపట్టాల రిజిస్ట్రేషన్ల సాధన సమితి ఆధ్వర్యాన స్థానిక అయోధ్యనగర్‌లోని గంగానమ్మ గుడి వద్ద సామూహిక నిరాహారదీక్ష జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సభకు సాధన సమితి కన్వీనర్ సిహెచ్ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. సిపిఐ నగర కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్ మాట్లాడుతూ 50 ఏళ్ళుగా ఈ ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకపోవటం, ఇచ్చిన పట్టాలకు రిజిస్ట్రేషన్లు చేయకపోవటం అన్యాయమని అన్నారు. కొత్తకొత్త జీవోలను తీసుకువచ్చి కొత్తగా నిర్మించబడిన ఇళ్ళకు మాత్రం రిజిస్ట్రేషన్లు చేస్తున్నారగాని గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్లు చేయకపోవటం అమానుషమన్నారు. తాను గెలిచిన నెల రోజులలోగా అందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని వాగ్దానం చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే మూడు ఏళ్ళు గడిచిపోయినా ప్రజలకు ఇచ్చిన హామీలను నీటిమూటలు చేసారన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు మాట్లాడుతూ ప్రజలు తమ ఆర్థిక అవసరాలను బ్యాంక్ లోన్లు కూడా తీర్చుకునే వెసులుబాటుకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు తప్పని సరి అయినందున పై ప్రాంతాలలోని ఇళ్ళ పట్టాదారులందరికీ నామమాత్రపు ధరకే సత్వరం రిజిస్ట్రేషన్లు చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే, వైసిపి నాయకులు మల్లాది విష్ణు మాట్లాడుతూ కాకులను కొట్టి గద్దలకు పెట్టిన చందంగా రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం పేదల శ్రేయస్సును గాలికి వదిలి సంపన్నవర్గాలకు మాత్రమే పని చేస్తుందని విమర్శించారు.

బొల్లినేని చంద్రికకు ఘన సన్మానం
విజయవాడ (స్పోర్ట్స్), సెప్టెంబర్ 19: సెప్టెంబర్ 11 నుంచి దక్షిణాఫ్రికాలో జరుగుతున్న కామన్‌వెల్త్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో నాలుగు బంగారు పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి బొల్లినేని చంద్రిక(మంగళగిరి)ను ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన అభినందన కార్యక్రమంలో శాప్ వీసి అండ్ ఎండి ఎన్ బంగార్రాజు మాట్లాడుతూ కామన్‌వెల్త్‌లో నాలుగు బంగారు పతకాలతో రాష్ట్ర ఖ్యాతిని అనుమడింపజేసిందన్నారు. ఈ సందర్భంగా చంద్రికకు ఏపి క్రీడాశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపి స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్పోర్ట్స్ ఎల్‌వి సుబ్రహ్మణ్యం అభినందనలు తెలిపారన్నారు. రానున్న రోజుల్లో శాప్ తరపు నుంచి చంద్రికకు శిక్షణకు కావాల్సిన సహాయ సహకారాలను అందజేస్తామన్నారు. కొత్త స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ప్రతిభ క్రీడాకారులకిచ్చే ఇన్‌సెంటివ్స్‌ని వెంటనే అందేందుకు సహాయపడతామన్నారు. ఈ కార్యక్రమంలో శాప్ ఒఎస్‌డి పి రామకృష్ణ, పవర్ లిఫ్టింగ్ స్టేట్ సెక్రటరీ ఎస్ కోటేశ్వరరావు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఎస్‌కె మహ్మద్ఫ్రీ, సెక్రటరీ గుమ్మడి పుల్లేశ్వరరావు, కృష్ణాజిల్లా సెక్రటరీ జి వెంకటేశ్వరరావు, కోచ్ ఎండి కమరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.