విజయవాడ

ఆటోనగర్‌కు మొండిచేయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, సెప్టెంబర్ 23: ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా పేరుగాంచిన జవహర్ ఆటోనగర్‌ను అభివృద్ధి చేయాలని ఎన్నో ఆశలు, ఆశయాలతో ఐలా పాలకవర్గ బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఎపిఐఐసి, ఐలా అధికారులు సహకరించకపోవటంతో అభివృద్ధి ప్రశ్నార్ధకంగా మారుతుందని ఐలా ఛైర్మన్ సుంకర దుర్గాప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోనగర్‌లోని ఐలా కార్యాలయంలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆటోనగర్‌లో లక్ష మంది కార్మికులు పనిచేస్తున్నారని, తమ పాలకవర్గమైతే ఆటోనగర్‌ను శరవేగంగా అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ఐలా పీఠంపై తమను కూర్చోబెట్టారన్నారు. వారి నమ్మకం వమ్ముకాకూడదనే సంకల్పంతో తమ పాలకవర్గాన్ని రెండోసారి ప్రజలు గెలిపించటంతో మే 5న బాధ్యతలు చేపట్టామన్నారు. అప్పటి నుండి జవహర్ ఆటోనగర్‌ను రాష్ట్రంలోనే మోడల్‌గా తీర్దిదిద్దాలనే లక్ష్యంతో ఐలా పాలకవర్గం పనిచేస్తున్నప్పటికీ ఎపిఐఐసి అధికారులు సహకరించకపోవం దురదృష్టకరమన్నారు. ఎపిఐఐసి ఎండి బాబు.ఎ ని ఐలా పాలకవర్గ సభ్యులు కలవాలని మూడు నెలల నుండి ప్రయత్నించినా అపాయింట్‌మెంట్ దొరకటం లేదన్నారు. ఇక ఆటోనగర్ ఎపిఐఐసి జోనల్ కార్యాలయం అధికారులు ఆటోనగర్ అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యదోరణి ప్రదర్శించటం బాధ కలిగిస్తోందన్నారు. ఆటోనగర్ అభివృద్ధి విషయంలో త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి, తరువాత భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని చెప్పారు. జవహర్ అటోనగర్ నుంచి సంవత్సరానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 800 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయల వరకు వివిధ పన్నుల రూపంలో ఆదాయం వెళుతోందని, అయిన్పటికీ ప్రభుత్వాలు ఆటోనగర్ అభివృద్ధి గురించి పట్టించుకోకపోవటం దారుణమన్నారు. ఎపిఐఐసి అధికారులు ఆటోనగర్‌లోని 4 వేల గజాల స్థలాన్ని ఇతరులకు కట్టబెట్టాలని ప్రయత్నించారని, దీంతో ఐలా పాలకవర్గం అడ్డుతగలి స్థలాలను విక్రయించకూడదని తీర్మానం చేసిందన్నారు. ఈ నెల 15న ఆటోనగర్‌లోని 27 అనుబంధ సంఘాలతో ఆటోనగర్ అభివృద్ధిపై సమావేశం నిర్వహించామని తెలిపారు. ఈ సమావేశంలో ఆటోనగర్‌లో అనుమతులు లేకుండా హోర్డింగులు, ప్లెక్సీలు, బ్యానర్లు కట్టకూడదని తీర్మానం జరిగిందని, ఆ తరువాత పత్రికల ద్వారా ఈ విషయమై సమాచారం ప్రజలకు తెలియజేశామన్నారు. అయినా ఇంతవరకు ఆటోనగర్‌లో హోర్టింగులు తొలిగించకపోవటంతో మంగళవారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి హోర్డింగులు, ప్లెక్సీలు, బ్యానర్లు తొలిగిస్తామని, ఈలోగా అనుతులు లేని హోర్డింగులు తొలిగించాలని దుర్గాప్రసాద్ కోరారు. విలేఖరుల సమావేశంలో ఐలా సెక్రటరీ అనే్న శివనాగేశ్వరరావు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.