విజయవాడ

పుష్కరాలకు రెవెన్యూ, పోలీసుల శాఖల మధ్య సమన్వయమే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, మే 30: నవ్యాంధ్ర రాష్ట్రంలో రానున్న పుష్కరాలను ఎలాంటి అవాంతరాలు లేకుండా సవ్యంగా నిర్వహించి శభాష్ అనిపించుకోవాలని అధికారులు సమీక్షలు, సమావేశాలు నిర్వహించడం జరుగుతోంది. పుష్కర స్నాన ఘాట్స్, పుష్కర నగర్ తదితరాల సౌకర్యాలు కల్పనకు కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నారు. అయితే ప్రకాశం బ్యారేజీ నిర్మించిన తరువాత గతంలో ఎన్నడూలేని విధంగా నదిలో నీరు తగ్గాయి. దాంతో గుంటూరు, కృష్ణా జిల్లా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అలాంటి తరుణంలో నదిలో నీటి నిలువలు ఎంత ఉంటాయో అంతా దైవాదీనంపై ఆధారపడింది. వాతావరణంలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఆంధ్రా, తెలంగాణ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో వర్షాభావం ఏర్పడింది. దాంతో లక్షలాది హెక్టార్ల పంట భూములు సైతం బీడుబారాయి. రోను తుపానుతో భూమాత తాపం తీరుతుందని ఎదురుచూసినా చిరుచినుకులతో నాన్చుడు వర్షంతో ఊరించిందేగాని భూతాపం తగ్గే విధంగా వర్షాలు పడలేదు. దాంతో నదిలో నీరు చేరుతుందనేది ఏ అధికారీ స్పష్టంగా చెప్పలేదు. వాతావరణశాఖ అధికారుల అంచనాలు కూడా తలకిందలవుతున్నాయి. వర్షాలు పడతాయి, బీభత్సం సృష్టిస్తుందని చెప్పినా రోను తుపానులో వర్షాలు తక్కువగానే పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆగస్టులో రానున్న పుష్కరాల్లో నదికి నీరు చేరుతుందని ఖచ్చితంగా చెప్పలేము. మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల జూన్, జూలై నెలల్లో భారీ, అతిభారీ వర్షాలు పడతేగాని ఈ పుష్కరాలకు కృష్ణానదిలో నీరు పుష్కలంగా చేరవు, కాని పుష్కర ఏర్పాట్లు చేస్తున్న అధికారులు భవానీపురం, గొల్లపూడి, సూరాయపాలెం, ఫెర్రి తదితర ప్రాంతాల్లో పుష్కర స్నాన ఘాట్ నిర్మాణానికి పనులు చేపట్టారు. విజయవాడ నుండి ఇబ్రహీంపట్నం వరకు సుమారు 12కిలో మీటర్ల కృష్ణా పరివాహక ప్రాంతముండగా 6 కిలోమీటర్ల మేరకు స్నాన ఘాట్లు నిర్మిస్తున్నారు. అసలు అంతా ఎండిపోయిన నదిలో స్నాన ఘాట్ల ఎంత వరకు నదిలోకి నిర్మించాలి, ఘాట్లు నిర్మించినా నీరు అక్కడ వరకు చేరుతాయా అనేది అధికారులకు అంతుచిక్కని ప్రశ్నలుగా మిగిలాయి. ఫ్లైఓవర్ పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అర్ధరాత్రులు తనిఖీలు నిర్వహించిన విషయం విదితమే. కాగా పుష్కర నిర్వహణ అధికారులకు, పోలీసులకు మధ్య సమన్వయం లోపించినట్లుగా ఉంది. పోలీసులు తాము అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ప్రధాన రహదారుల్లో ప్రధాన స్నాన ఘాట్ల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నారు. కానీ స్నాన ఘాట్‌ల నిర్మాణం పూర్తయిన తరువాత సిసి కెమెరాల పోల్స్ పాతాల్సి ఉంది. ఎన్ని పోల్స్ ఎక్కడ పాతాలని అంచనా వేయాలంటే ముందుగా ఘాట్ల నిర్మాణం పూర్తవాలి. ఘాట్ల నిర్మాణం పూర్తవ్వాలంటే అసలు నదిలో ఏ మేరకు ఎంత వరకు నీరు అందుబాటులో ఉంటుందో అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. సిసి కెమెరాలు అప్పటికప్పుడు ఏర్పాటు చేసేవికాదు. అందుకే పోలీసులు స్నాన ఘాట్ల నిర్మాణాల కోసం ఎదురుచూస్తున్నారు. మిగతా శాఖలు ఎలా పని చేసినా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో జరగనున్న కృష్ణా పుష్కరాలకు పోలీసుల పాత్ర కీలకమే. అందుకే శాంతిభద్రతల సంరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై పోలీసు బాసులు రెండు రోజులకోమారు కిందస్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తునే ఉన్నారు. చిటికెల పందిరి మాదిరిగా పుష్కర స్నా ఘాట్ల నిర్మాణాలుండరాదు. గత పుష్కరాలకు సుమారు 3.50 కోట్ల మంది కృష్ణా పుష్కర పుణ్య స్నానాలు ఆచరించారు. ఈసారి ఆ సంఖ్య రెట్టింపు అవుతుందనే అంచనాలతో అధికారులు ప్రణాళికలను తయారు చేసుకుంటున్నారు. రాజమండ్రిలో గోదావరి పుష్కర ఘాట్ తొక్కిసలాట దుర్ఘటన చేదు అనుభవం పునరావృతం గాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఏదిఏమైనా రెవెన్యూశాఖ, అలాగే పోలీసులు ఎన్నిరకాలుగా సిద్ధంగా ఉన్నాగాని కృష్ణానదిలో నీటి చేరిక పైనే ఈ ఉత్సవాలు ఆధారపడి ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు ఎంత వరకు ఈ పుష్కరాలను ఒడ్డు ఎక్కిస్తాయో ఎదురుచూడాల్సిందే.