విజయవాడ

క్రికెట్ స్టేడియాన్ని సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, మే 30: క్రికెట్ ప్రాంగణం అన్ని సౌకర్యాలతో నిర్మించటం జరిగిందని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా (బిసిసిఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. మండలంలోని మూలపాడులో సుమారు రూ.17 కోట్లతో అత్యాధునిక ప్రమాణాలతో కూడిన క్రికెట్ స్టేడియంను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ చల్లని వాతావరణంలో క్రీడాకారులకు ఎంతో ఆనందం కలుగుతుందని వివరించారు. నూతన రాష్ట్రానికి ఇది అత్యధిక అధునాతనంగా ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని), నర్సాపురం పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు, గుంటూరు పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్, శాసనమండలి సభ్యులు బుద్దా వెంకన్న, శాప్ చైర్మన్ కె.మోహన్, సోమయాజులు, శ్రీకాంత్, జిల్లా పరిషత్ సభ్యురాలు సిహెచ్ రాధా, పిబి శ్రీనివాసరావు, క్రీడాభిమానులు, మండల ప్రజలు పాల్గొన్నారు.