విజయవాడ

అన్న క్యాంటిన్ తరహాలో ఆటోనగర్‌లో ప్రత్యేక క్యాంటిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 30: స్వాతంత్య్రం వచ్చి 67ఏళ్లు దాటుతున్నా విజయవాడ నగరం అభివృద్ధిపరంగా అడుగు ముందుకేయలేదు. అధికారంలోకి ఏనాటికైనా రాగలమనే నమ్మకం వారిలో లేకపోయినా కేవలం తమ స్వప్రయోజనాల కోసం కమ్యూనిస్టులు సంకుచిత భావాలతో అభివృద్ధిని అడ్డుకుంటూ నిత్యం ధర్నాలు, ఆందోళనలతో విజయవాడ నగరాన్ని నాశనం చేశారంటూ విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) నిప్పులు చెరిగారు. 2000 సంవత్సరం జూన్‌లో బెంగుళూరులో శ్రీమాన్ మధు పండిట్ దాస ఆధ్వర్యంలో స్థాపించబడిన అక్షయపాత్ర నాడు కేవలం ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో 1500 మంది పిల్లలకు మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టింది. నేడు 10 రాష్ట్రాల్లో 24 ప్రదేశాల్లో 10వేల 640 ప్రభుత్వ పాఠశాలల్లో 15 లక్షల మంది విద్యార్థులకు నిత్యం తాజాగా వండిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ ఎంపి కేశినేని కృషితో సోమవారం విజయవాడ చాప్టర్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షత వహించిన ఎంపి కేశినేని నాని మాట్లాడుతూ అక్షయపాత్ర ఫౌండేషన్ చేస్తున్న సేవల గురించి తెలిసి తాను ఆరు మాసాల క్రితం బెంగుళూరు వెళ్లి అక్కడ భోజన తయారీ, పంపిణీ విధానాన్ని చూసి పరవశించానన్నారు. పిల్లలకు వీరందించే భోజనం విలువ స్టార్ హోటల్‌లో వెయ్యి రూపాయలు ఉంటుందన్నారు. వీరి సేవలు విజయవాడ వాసులకు లభించాలనే పట్టుదలతో ఇక్కడకు రప్పించడం జరిగిందన్నారు. విజయవాడ ఆటోనగర్ ఆసియా ఖండంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని దీనిపై లక్షా 30వేల మంది కార్మికులు ఆధారపడ్డారని చెబుతూ తొలుత కనీసం 35వేల మందికి రూ.5లు, రూ.7లకే నాణ్యమైన భోజనం అందించేలా అన్న క్యాంటిన్ నడపాలని తాను కోరగా అందుకు అంగీకరించారని తెలిపారు. ఏ విధంగానైనా విజయవాడ నగరంలో పేదవారు ఆనందంగా నివసించే నగరంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షలకు అనుగుణంగా కలెక్టర్ బాబు.ఎ, మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండ్యన్, సిపి గౌతం సవాంగ్ పనిచేస్తున్నారంటూ వారిని అభినందించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా అన్ని ప్రభుత్వ శాఖలు కలిసి దాదాపు ఆరువందల కోట్లు విలువైన పనులు జరుగుతున్నాయని అదనంగా దుర్గా ఫ్లైఓవర్, బెంజిసర్కిల్ ఫ్లైఓవర్‌లు రాబోతున్నాయని అన్నారు. మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండ్యన్ మాట్లాడుతూ నగరంలో మున్సిపల్, జిల్లా పరిషత్, ఎయిడెడ్, చైల్డ్ లేబర్ స్కూల్స్ అన్నీ కల్సి 194 పాఠశాలలు ఉండగా ఇందులో 35వేల మంది అభ్యసిస్తున్నారని అయితే నాణ్యతతో కూడిన ఆహారం లభించక కేవలం 17వేల మంది మాత్రమే మధ్యాహ్న భోజనాన్ని వినియోగించుకుంటున్నారన్నారు. సరైన భోజన సదుపాయం లేక అనేకమంది మధ్యలో చదువులు ఆపి కూలీలుగా మారుతున్నారన్నారు. పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ మాట్లాడుతూ పిల్లలకు సరైన భోజనం, సరైన విద్య లేకపోతే సమాజంలో అడ్డదారులు తొక్కుతారని ఆ దుష్ప్రభావం అందరిపై పడగలదన్నారు. అక్షయపాత్ర ఫౌండేషన్ అందిస్తున్న సేవలు మరువరానివన్నారు. ఫౌండేషన్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు సత్యగౌర చంద్రదాస మాట్లాడుతూ ప్రస్తుతం నగరంలో లక్ష మందికి భోజనం అందించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కిచెన్ సెంటర్ సిద్ధమైందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి మేర తుళ్లూరు, మంగళగిరిలో కూడా మరో రెండు కిచెన్ సెంటర్లు ఏర్పాటు చేసి తమ సేవలను గుంటూరుకు విస్తరింప చేయనున్నామన్నారు. తమ సంస్థకు కుల మతాలతో సంబంధం లేదన్నారు. ఇస్కాన్‌తో కూడా ప్రమేయం లేదన్నారు. కిచెన్ ఏర్పాటుకు ఆటోనగర్ 100 అడుగుల రోడ్డులో 3వేల గజాల స్థలాన్ని ఆరేళ్లపాటు లీజుకు ఇచ్చిన ఆచంట శివరామప్రసాద్‌ను అతిథులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఇక ఎంపి కేశినేని తన వంతు సాయంగా ఫౌండేషన్‌కు 10లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ సమావేశంలో ఐలా చైర్మన్ సుంకర దుర్గాప్రసాద్, మేయర్ కోనేరు శ్రీ్ధర్, డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, టిడిపి పశ్చిమ ఇన్‌చార్జి నాగుల్‌మీరా, ఫౌండేషన్ విజయవాడ చాప్టర్ అధ్యక్షులు మహావిష్ణుదాస, ఉపాధ్యక్షులు కొమ్మారెడ్డి పట్ట్భారామ్, వంశీధార దాస, ఆంధ్రా ఛాంబర్ కార్యదర్శి చుక్కపల్లి ప్రసాద్, ఉపాధ్యక్షులు భాస్కరరావు, న్యాయవాది వెలగపూడి రామకృష్ణ పాల్గొన్నారు.