విజయవాడ

ఫెస్‌బుక్ నకిలీ అకౌంట్లతో యువతులకు వేధింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మే 30: ఫెస్‌బుక్ నకిలీ అకౌంట్లతో మహిళలను వేధింపులకు గురి చేస్తున్న ముగ్గురు వ్యక్తులను సైబర్ పోలీసింగ్ సెల్ కటకటాల వెనక్కు నెట్టింది. సదరు యువతులకు అసభ్యకర మెసేజ్‌లు, నగ్న చిత్రాలు పోస్టు చేస్తూ బెదిరింపులకు దిగుతున్నట్లు బాధితుల ఫిర్యాదుల మేరకు సత్యనారాయణపురం, పెనమలూరు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ తరహా నేరాలకు కట్టడి చేసేందుకు నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ ఆదేశాలతో ఈ ‘సైబర్ పోలీసింగ్ సెల్’ వింగ్ ఏర్పాటైంది. ఒక ఎస్‌ఐ, ఆరుగురు సిబ్బందితో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక విభాగం బృందం రంగంలోకి దిగి సత్యనారాయణపురం, పెనమలూరు పోలీసులకు సహకారం ఇవ్వడం ద్వారా ఇద్దరు బాధిత యువతుల ఫిర్యాదుపై ఆయా కేసుల్లో ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఆయా కేసులకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తుళ్ళూరుకు చెందిన కారుమంచి సాయికిరణ్ (21) నగరంలో బిటెక్ పూర్తి చేశాడు. తాను చదువుకున్న కాలేజ్‌లో జూనియర్ అయిన విద్యార్ధిని తనను ఓ సందర్భంలో తిట్టిందని కక్ష పెంచుకున్నాడు. ఈక్రమంలో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ తెరచి తద్వారా యువతికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతున్నాడు. అంతేకాకుండా సదరు యువతికి సంబంధించి ఫేస్‌బుక్ అకౌంట్ మాదిరిగానే నకిలీ అకౌంటు క్రియేట్ చేసి యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్నచిత్రాలను అకౌంట్‌లో పెడుతూ వచ్చాడు. ఈ అకౌంట్‌లను బ్లాక్ చేస్తే ఆ ఫొటోలను యువతి స్నేహితులకు కూడా పంపుతానని ఆమెను బెదిరించాడు కూడా. ఈ పరిణామాలతో కంగు తిన్న యువతి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సత్యనారాయణపురం పోలీసులు, సైబర్ పోలీసింగ్ సెల్ సహకారంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి నేరానికి వినియోగించిన రెండు లాప్‌ట్యాప్‌లు, వైఫై రూటర్లను, సెల్‌ఫోను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. కాగా ఇదేవిధంగా పెనమలూరు పోలీస్టేషన్ పరిధిలో కూడా ఓ యువతి ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఫేస్‌బుక్, వాట్సప్‌లకు అసభ్యకర మెసేజ్‌లు పంపి వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొనగా. రంగంలోకి దిగిన సైబర్ పోలీసింగ్ సెల్ నిందితులను గుర్తించారు. కానూరి సత్య శ్రీనివాసబాబు, గోగినేని యోగిచౌదరి అనే ఇద్దరినికి అదుపులోకి తీసుకుని నేరానికి వినియోగించిన రెండు లాప్‌ట్యాప్‌లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు.