విజయవాడ

పోలీసు స్వాధీనం చేసుకున్న వాహనాల వేలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మే 30: పోలీసు స్వాధీనంలో ఉన్న ఆచూకీ తెలియని వాహనాలను సోమవారం వేలం ప్రక్రియ ముగిసింది. పోలీసు కమిషనరేట్ పరిథిలో స్వాధీనం చేసుకున్న 244 మోటారు వాహనాలను ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సోమవారం ఉదయం 10 గంటల నుంచి బందరురోడ్డు సిటి ఆర్మ్‌డ్ రిజర్వు గ్రౌండ్స్‌లో నిర్వహించారు. డిసిపి జివిజి అశోక్‌కుమార్ ఆధ్వర్యాన వేలం నిర్వహించారు. సుమారు 200 మంది పాటదారులు వేలంలో పాల్గొన్నారు. ఈవేలం పాటలో వాహనాలను వేలం వేయగా ప్రభుత్వానికి 9లక్షల 13వేల రూపాయలు ఆదాయం సమకూరింది. ఈ కార్యక్రమంలో ఏసిపి హెడ్ క్వార్టర్స్ కె కోటేశ్వరరావు, సిసిఆర్‌బి ఏసిపి డి శ్రీనివాసరెడ్డి, ఆర్‌ఐ అజ్మతుల్లా ఇతర అధికారులు పాల్గొన్నారు.